10 వేల కోట్ల డ్రీమ్ వెనకల.. డ్రీమ్ గల్..
వారణాసి మూవీ వరల్డ్ వైడ్ గా 120 దేశాల్లో వందకోట్ల మందిని రీచ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. 55 వేల థియేటర్స్ లో రిలీజ్ అయితేనే పెద్ద రికార్డు..
వారణాసి మూవీ వరల్డ్ వైడ్ గా 120 దేశాల్లో వందకోట్ల మందిని రీచ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. 55 వేల థియేటర్స్ లో రిలీజ్ అయితేనే పెద్ద రికార్డు.. కాని ఈ సినిమాను ఏ కోణంలో వరల్డ్ ఆడియన్స్ దగ్గరికి తీసుకెళతారనేదే మేయిన్ టాపిక్.. ఎంత గొప్ప కథైనా, రిలీజ్ అయ్యాకే, జనాల్లో మౌథ్ టాక్ పెరిగాలి… లేదంటే ట్రైలర్ తో వరల్డ్ ఆడియన్స్ ని ఆకట్టుకోవాలి… అయినా కూడా బాహుబలి కోసం జనాలు క్యూ కట్టినట్టు థియేటర్స్ ముందు వారనాసికోసం వరల్డ్ ఆడియన్స్ క్యూ కడతారా? ప్రాక్టికల్ గా ఇది కానిపని.. కాకపోతే ఈమూవీని హీరో, దర్శకుడు, కంటెంట్ కంటే ఎక్కువగా ఇంకొకరు మోస్తున్నారు.. మోస్తారు.. మోయబోతున్నారు.. అదే ఎవరు? తన వల్లే హాలీవుడ్, యూరప్ లో వారనాసి కోసం వరల్డ్ ఆడియన్స్ క్యూ కడతారా? తర్వాత గ్లోబల్ గా వారణాసి ఫేటే మారిపోతుందా? ఇంతకి రాజమౌళి స్కెచ్చేంటి? 3 వేలకోట్ల ప్రాజెక్ట్ బరువు మోసేదెవరు?
సూపర్ స్టార్ మహేశ్ బాబుతో, రాజమౌళి తీస్తున్న పాన్ వరల్డ్ మూవీ వారణాసి. 1500 కోట్లు కాదు అన్ లిమిటెడ్ బడ్జెట్ తో ఐమ్యాక్స్ త్రీడీలో తెరకెక్కుతున్న తొలి ఇండియన్ మూవీ. దీనికి తోడు 120 దేశాల్లో 100 కోట్ల మందిని రీచ్ అయ్యేలా 30 భాషల్లో ఈమూవీని రిలీజ్ చేస్తున్నారు. హాలీవుడ్ సినిమాలు కూడా ఇప్పటి వరకు 33 వేల థియేటర్స్ కి మించి రిలీజ్ కాలేదు.
అలాంటిది వారణాసిని ప్రపంచ వ్యాప్తంగా 55 వేల థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నారంటే అదో సెన్సేషన్.. కాకపోతే అన్ని వేల థియటేర్స్ లో ఓ ఇండియన్ మూవీ వస్తోందంటే, తెల్లోల్లంతా ఎగబడి చూస్తారా? చెప్పలేం… కంటెంట్ బాగున్నా, అది బాగుందని తేలాలంటే, రిలీజై జనం చూడాలి… మౌత్ టాక్ ఎంత పెరిగినా, పాన్ వరల్డ్ మార్కెట్ షేక్ అవ్వాలంటే, అదొక్కటే సరిపోదు.కాబట్టే పూర్తి బాధ్యతని ప్రియాంక చోప్రా మీదే పెడుతోంది వారణాసి టీం. నిజానికి రాజమౌళి దేశం గర్వించదగ్గ దర్శకుడే కావొచ్చు.. సూపర్ స్టార్ మహేశ్ బాబు హాలీవుడ్ లుక్ ఉన్న టాలీవుడ్ హీరో కావొచ్చు.. ఐతే, వరల్డ్ ఆడియన్స్ కి వారనాసి దగ్గరవ్వాలంటే ప్రమోషన్, సినిమాలో కంటెంట్ ఎలివేషన్ ఒక్కటే సరిపోదు.. ప్రమోట్ చేసేందుకు వెల్ నోన్ ఫేసులు కావాలి..
అందుకే హాలీవుడ్, యూరప్ మార్కెట్ లో పాపులరైన ప్రియాంక చోప్రాని హీరయిన్ గా తీసుకున్నారు. ముందేమే తనెందుకు అక్కలా ఉంది అన్నారు. కాని పాన్ వరల్డ్ మార్కెట్ లోకి మన సినిమా దూసుకెళ్లాలంటే, అక్కడి జనాలకు తెలిసిన కొందరు నటులనైనా ఇందులో తీసుకోవాల్సిందే… అందులో భాగంగా హాలీవుడ్ లో ఎవరిని తీసుకున్నా కథకి, పాత్రకి సూట్ కాకపోవటం వల్లే, ఇలా అప్పుడు నిర్ణయం మార్చుకున్నారు.అంటే ప్రియాంక చోప్రా మీదే వారణాసి భారం అంతా పడుతోందా అంటే, ప్రాక్టికల్ గా చెప్పాలంటే అదే నిజం… సినిమాకు హీరో మహేశే అయినా, హాలీవుడ్, యూరప్ లో ఈ సినిమా రీచ్ ని పెంచేది ప్రియాంకే.. కాకపోతే కథ పరంగా, పాత్ర పరంగా మహేశ్ పెర్పామెన్స్ తోనే 10 వేల కోట్ల వసూల్లు వచ్చే చాన్స్ఉంది… కాకపోతే కొత్త మార్కెట్ లో వారణాసి దుమ్ముదులపాలంటే, ప్రియాంక ఇమేజే ప్లస్ అయ్యే ఛాన్స్ఉంది. ప్రతీ విజయం వెనక, ఒక మహిళ ఉంటుందంటారు… ఇక్కడ ఆ మహిళ హీరోయిన్ గా ఉంటోంది… తనమీదే క్రౌడ్ పుల్లింగ్ భారం పడుతోంది.











