సౌత్ లో ఫస్ట్ డే 350 కోట్లు.. 5 రోజుల్లో 1250 కోట్లు…!

వారణాసి మూవీ ఏప్రిల్ రిలీజ్ డేట్ మీద హోర్డింగ్స్ మొత్తం, నేషనల్ మీడియానే షేక్ చేశాయి.. కట్ చేస్తే ఈ సినిమా కేవలం తెలుగు వర్షన్ కే మొదటి రోజు 350 కోట్ల వసూల్లు వస్తాయన్న లెక్కలు ఇంకా షాక్ ఇస్తున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 31, 2026 | 01:00 PMLast Updated on: Jan 31, 2026 | 1:00 PM

Intersting Facts About Varanasi Movie 4

వారణాసి మూవీ ఏప్రిల్ రిలీజ్ డేట్ మీద హోర్డింగ్స్ మొత్తం, నేషనల్ మీడియానే షేక్ చేశాయి.. కట్ చేస్తే ఈ సినిమా కేవలం తెలుగు వర్షన్ కే మొదటి రోజు 350 కోట్ల వసూల్లు వస్తాయన్న లెక్కలు ఇంకా షాక్ ఇస్తున్నాయి. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో వారణాసికి 350 కోట్ల ఓపెనింగ్స్ వస్తే, 5 రోజుల్లో ఆ వసూళ్లు 1250 కోట్లు దాటుతాయట.. అయితే ఇది కేవలం తెలుగు వర్సన్ లెక్కలు మాత్రమే… అన్ని భాషల్లో ఈ సినిమా 55 వేల తియేటర్స్ లో రిలీజ్ అవుతోంది.. సో ఆలెక్కన ఓపెనింగ్సా ఎలా ఉండొచ్చు… ఆ అంచనాలు వింటే, హాలీవుడ్ కి కూడా సాధ్యం కాని నెంబర్స్ వినిపిస్తున్నాయి.. ఓపెనింగ్స్ తోనే దంగల్ లైఫ్ టైం రికార్డులు బద్దలవ్వొచ్చు… ఓ మాదిరిగిగా ఆడితేనే 10 వేల కోట్లు, అద్రుస్టం కలిసొస్తే, 30 వేల కోట్లు…. మరి ఈ అంచనాలు అందుకునేంత సీన్ వారనాసికి ఉందా? వరల్డ్ ఆడియన్స్ పనికట్టుకుని ఈ సినిమా కోసం క్యూలో నిలుచుంటారా? ఇలాంటి రోజు కూడా ముందు ముందు రావొచ్చా?

వారణాసి మూవీ 2027 ఏప్రిల్ 7న అంటే వచ్చేఏడాది రిలీజ్ అవటం ఆల్ మోస్ట్ కన్ఫామ్ అయ్యింది. జార్జియాలోకి ఫిల్మ్ టీం బయలు దేరబోతోంది. తర్వాత అంటార్కిటికాలో షూటింగ్ ప్లాన్ చేశారు. అక్కడ తెరకెక్కే ఐదో ప్రపంచ సినిమాగా వారణాసి హిస్టరీ క్రియేట్ చేయబోతోంది. అయితే ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఎంత రాబడుతుందో, అటుంచితే, తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు ఎంత రాబడుతుందన్న అంచనాలు షాకిస్తున్నాయి.ఎందుకంటే వారణాసి తెలుగు వర్షన్ ఫస్ట్ డే ఓపెనిం్గస్ 350 కోట్లు రాబట్టే ఛాన్స్ఉందట. థియేటర్ల సంఖ్య, నెంబరాఫ్ షోస్ తోపాటు సీట్ కెపాసిటీని అంచనా వేస్తే వచ్చినెంబర్ ఇది. కేవలం వారణాసి రిలీజ్ అయిన 5 రోజే 1250 కోట్లు తెలుగు వర్షన్ కి వస్తాయని అంచనా వేస్తున్నారు.

కేవలం అంటే కేవలం వారణాసి రిలీజైన 7 రోజుల్లో త్రిబుల్ ఆర్ లైఫ్ టైం వసూల్లైన 1450 కోట్లని వారణాసి రాబట్టే ఛాన్స్ఉంది. అది కూడా కేవలం ఒక భాషలలోనేకాని ఈ సినిమా 30 భాషల్లో, 120 దేశాల్లో రిలీజ్ కాబోతోంది. 100 కోట్ల మంది చూసేలా వరల్డ్ వైడ్ గా 55 వేల థియేటర్స్ లో రిలీజ్ అయితే మరి ఈ మూవీకి, అన్ని భాషల్లో ఓపెనింగ్స్ ఎంత రావొచ్చు.. ఆనెంబర్ దంగల్ లైఫ్ టైం వసూల్లనే మించేలా ఉంది. 2 వేల కోట్ల నుంచి 3 వేల కోట్ల వరకు వారనాసి మూవీకి వరల్డ్ వైడ్ గా ఓపెనింగ్స్ వచ్చే చాన్స్ఉంది.

వరల్డ్ ఆడియన్స్ కి నచ్చేలా డైనోసార్ల సాహాసాలు, టైం ట్రావెల్, దీనికి ఇండియన్ టచ్ ఇస్తూ మన మిథాలజీని కలిపేస్తున్నాడు రాజమౌళి. ఇక ఐమ్యాక్స్ లో తీస్తున్నారు కాబట్టి, హై క్వాలిటీ వీడియో ఎఫెక్టీవ్ గా పని చేసే చాన్స్ ఉంది. హాలీవుడ్ లో మోస్ట్ పాపులర్ మూవీ అయిన ఇండియానా జోన్స్ జోనర్ లో సినిమాలు ఆగిపోయాయి. దాన్ని రిప్లేస్ చేస్తూ, ఆ రూట్లోనే వారణాసి వస్తోంది కాబట్టి, దీన్ని కొత్త రకం ఇండియానా జోన్స్ గా ప్రమోట్ చేస్తున్నారు.

అది కూడా కలిసొచ్చే చాన్స్ఉంది. ఇక ఏడువింతలు, అడవుల్లో అద్భుతాల వేట, లాంటి అంశాలు వరల్డ్ ఆడియన్స్ కి ఆకట్టుకోవచ్చు.. అలా ఏమాత్రం ఈ సినిమా కు అమెరికన్లు, యూరపియన్లు, చైనా, జపాన్ నుంచి సౌత్ అమెరికా వరకు పాజిటివ్ టాక్ వచ్చినా 10 వేల కోట్ల వసూళ్లొచ్చే ఛాన్స్ఉంది. అలా కాకుండా హిట్ టాక్ వస్తే మాత్రం, అవతార్ తాలూకు 24 వేల కోట్ల రికార్డునే బద్దలుకొట్టే ఛాన్స్ఉంది. ఎందుకంటే అవతార్ రిలీజ్ అయిన థియేటర్లకంటే రెండు రెట్లు ఎక్కువ థియేటర్స్ లో వస్తోంది కాబట్టి, 30 వేలకోట్ల అంచానాలు కూడా వినిపిస్తున్నాయి. అదే చరిగితే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాదు, వరల్డ్ సినిమాల్లోనే ఇదో హిస్టారికల్ రికార్డు అవుతుంది.