రెబల్ లేడీస్ తో పూనకాలు.. ఆయనకి ఇద్దరు…!

రెబల్ స్టార్ ప్రభాస్ కోసం రెబల్ లేడీస్ రంగంలోకి దిగుతున్నారు. అందులో ఒకరు లోకనాయకుడు కమల్ హాసన్ కూతురు...

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 30, 2026 | 01:28 PMLast Updated on: Jan 30, 2026 | 1:30 PM

Intersting News About Prabhas Upcoming Movie

రెబల్ స్టార్ ప్రభాస్ కోసం రెబల్ లేడీస్ రంగంలోకి దిగుతున్నారు. అందులో ఒకరు లోకనాయకుడు కమల్ హాసన్ కూతురు… సలార్ సీక్వెల్ ఉండదన్న వాళ్లకి ఉంటుందని హంబలే సంస్థ తేల్చింది. శ్రుతి హాసన్ కి బర్త్ డే విషెస్ చెబుతూనే, సలార్ 2 పనులు మీద హింట్లిచ్చేసింది. ఇదంతా జరిగిపోయిన విషయం.. ఇక జరగాల్సింది.. సలార్ లో హీరో ఒక్కడు కాదు.. ఇద్దరు… రెబల్ స్టార్ కి తగ్గ రెబల్ లేడీగా శ్రుతి హాసన్ కెరీర్ లోనే ఎన్నడూ ఊహించని సాలిడ్ రోల్ దొరికిందట.. ఆవిషయంలో శ్రుతి చాలా ఎగ్జైటింగ్ గా ఉందంది… పనిలో పనిగా సలార్ 2 తాలూకు లీకులకు తానే కారణమౌతున్నట్టు తెలుస్తోంది. కట్ చేస్తే కల్కీ సీక్వెల్ లో దీపికా పదుకొనే బదులు సాయిపల్లవి కనిపించబోతోందని ప్రచారం ఊపందుకుంది.. ఫిల్మ్ టీం కూడా అదేం లేదు, అది కేవలం రూమర్ మాత్రమే అన్నట్టు వార్తలొస్తున్నా… సాయిపల్లవి పేరు మాత్రం కల్కీ2 ప్రచారం లో ఊపందుకుంది? ఎందుకు ?

రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ మూవీకి సీక్వెల్ ఉండితీరుతుందని ఫిల్మ్ టీం, ఎనౌన్స్ మెంట్ వల్లే తేలింది. శ్రుతి హాసన్ కి బర్త్ డే విషెస్ చెబితే, తను ఈమూవీలో తన పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండబోతుందన్న ఒక్క మాటతో, సలార్ సీక్వెల్ విషయంలో వచ్చిన రూమర్లకు చెక్ పెట్టింది. ఐతే సలార్ మొదటి భాగంల శ్రుతి హాసన్ కేవలం అలా కనిపించి ఇలా మాయమయ్యే రోల్ లోనే వచ్చింది.కాని సలార్ 2 శౌర్యంగా పర్వంలో మాత్రం శ్రుతి హాసన్ కి హీరోకి మించిన బ్యాగ్రౌండ్ ఉండబోతోందట. ఓరకంగా తనే విలన్ బంధువనే ఫీలర్స్ పెరిగాయి.. హీరోకి తగ్గ పాత్రలో ఇందులో తను నెగెటివ్ రోల్ వేస్తుందన్న విషయం పరోక్షంగా శ్రుతి మాటల్లో తేలిపోతోంది. ఏదేమైనా సలార్ 2 త్వరలో పట్టాలెక్కబోతోందని తేలటమే కాదు, అందులో హీరోయిన్ రోల్ మీద కూడా సాలిడ్ క్లారిటీ వచ్చింది.

సలార్ సీక్వెల్ విషయంలో శ్రుతి వల్ల క్లారిటీ వస్తే, కల్కీ సీక్వెల్ కల్కీ 2 విషయంలో మాత్రం సాయిపల్లవి వల్ల కన్ ఫ్యూజన్ మొదలైంది. లేడీ పవర్ స్టార్ గా ఫోకస్ అయిన రౌడీ బేబీ సాయిపల్లవితో కల్కీలో దీపికా పదుకొనే వేసిన సుమతి పాత్రని వేయించాలనుకుంటున్నారట.అలా దీపికను సాయిపల్లవితో రిప్లేస్ చేయించాలనుకుంటున్నారట. ఇది నిన్నటి వరకు రీసౌండ్ చేసిన ప్రచారం. ఆల్రెడీ హిందీ రామాయణంలో సీత పాత్ర వేస్తూ బిజీ అయిన తను, కల్కీ 2 లో సుమతీ పాత్ర వేస్తుందని ప్రచారం మొదలైంది.అయితే ఇందులో నిజం లేదని కల్కీ టీం తేల్చింది. వచ్చేనెల నుంచే కల్కీ సీక్వెల్ ని సెట్స్ పైకి తీసుకెళుతున్నారు. ఐతే వైజయంతీ బ్యానర్ సాయిపల్లవిని అప్రోచ్ కాలేదని తేల్చింది. అంతేకాదు, సాయిపల్లవి కూడా రామాయణం కోసమే రెండేళ్ల డేట్లు ఇచ్చేసిందట. కాబట్టి అదయ్యే వరకు తను మరో ప్రాజెక్ట్ చేసే ఛాన్సే లేదు.

ఐతే దీపికా అతి భరించలేక, తన గొంతెమ్మ కోర్కెలు నచ్చక కల్కీ సీక్వెల్ నుంచి తనని తీసేసింది ఫిల్మ్ టీం. తన స్థానంలోనే ప్రియాంక చోప్రాను తీసుకునే అవకాశం ఉందన్నారు. కాని తను వారణాసి షూటింగ్ తో ఏడాది వరకు బీజీగానే గడిపే ఛాన్స్ఉంది. కాని నాగ్ అశ్విన్ మాత్రం ప్రియాంక చోప్రానే సరైన ఆఫ్షన్ గా ఫిక్స్ అయ్యాడట. సో అదే ఇంకా తేలలేదు. కాని వచ్చే నెల నుంచి మాత్రం కల్కీ 2 షూటింగ్ మొదలవటం కన్ఫామ్ అయ్యింది.