2027 ఏప్రిల్ 7 సునామీ ఫిక్స్.. 10,000 కోట్ల భవిష్యత్తు..?

సూపర్ స్టార్ మహేశ్ బాబు రుద్రుడిగా, రాముడిగా, శివుడిగా మూడు పాత్రలతో పాన్ వరల్డ్ మార్కెట్ మీద దాడి చేస్తున్నాడు. 1100 కోట్లు కాదు, 1500 కోట్లు కాదు అంతకుమించిన బడ్జెట్ తో వారణాసి మూవీ తీస్తున్నాడు రాజమౌళి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 30, 2026 | 12:49 PMLast Updated on: Jan 30, 2026 | 12:49 PM

Intersting News About Varanasi Movie

సూపర్ స్టార్ మహేశ్ బాబు రుద్రుడిగా, రాముడిగా, శివుడిగా మూడు పాత్రలతో పాన్ వరల్డ్ మార్కెట్ మీద దాడి చేస్తున్నాడు. 1100 కోట్లు కాదు, 1500 కోట్లు కాదు అంతకుమించిన బడ్జెట్ తో వారణాసి మూవీ తీస్తున్నాడు రాజమౌళి. ఐమ్యాక్స్ కెమెరాతో భారీ యాక్షన్ సీక్వెన్స్ లు, డైనోసార్లలో హీరో సాహసాలు, ప్రపంచ వింతలు, టైం మిషన్ లో టైం ట్రావెల్.. ఇలా చిత్ర విచిత్రాలతో వారాణాసి నిండిపోతోంది. కాకపోతే ఎప్పుడు రిలీజ్ అన్న విషయంలో చాలా మందికి చాలా డౌట్లుండేవి.. వాటికే చిన్న లీక్ షాక్ ఇస్తూ బ్రేక్ వేసింది. అదే ఏప్రిల్ 7 న విడుదల… వచ్చే ఏడాది ఏప్రిల్ 7 అంటే ఎగ్జాక్ట్ గా ఉగాది స్పెషల్ గా ఈ సినిమా వస్తోందన్న ప్రచారమే నిజమయ్యేలాఉంది. ఔనన్న కాదన్ని, ఎవరో లీక్ చేసినా ఈ రిలీజ్ డేట్ మారదు.. ఎప్పటి లా రాజమౌళి తనకు కుదరకరపోతే రిలీజ్ డేట్ వాయిదా వేయటం కామన్.. కాని ఈసారి కుదరదు.. ఎందుకు? అయినా ఏప్రిల్ 7 ఎందుకు వారణాసి టీంకి అంత స్పెషల్ ?

2027 ఏప్రిల్ 7 అంటే ఉగాది పండగ రోజు… అదే ముహుర్తానికి సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమా వారణాసి రిలీజ్ కాబోతోంది. ఫిల్మ్ టీం అఫీషియల్ గా ఎలాంటి ఎనౌన్స్ మెంట్ ఇవ్వలేదు, కాని రిలీజ్ డేట్ విషయంలో వాల్లు తీసుకున్న నిర్ణయం లీకైంది.. దానికి థియేటర్లను ఎంగేజ్ చేసన డేట్ వల్లే, అంతా ఏప్రిల్ 7కి విడుదలంటూ కన్ఫామ్ చేసుకుంటున్నారు.వచ్చే ఏడాది ఏప్రిల్ 7 అంటే ఉగాది పండగ రోజు… తెలుగు సంవత్సరాది యుగాది… సో తెలుగు సినిమా పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ మార్కెట్ లోకి అడుగుపెట్టేందుకు ఉగాదే సరైన ముహుర్తం అనుకున్నట్టుంది వారణాసి టీం. అందుకే తెలుగు పండగ రోజు, అది తెలుగు క్యాలెండర్ మొదలయ్యే రోజునే ఈ సినిమాను రిలీజ్ చేయాలన్న ఫిల్మ్ టీం ఇంటెన్షన్ బయటికొచ్చింది.

రాజమౌలి సినిమా అంటే ఫలానా టైంలో రిలీజ్ అంటారు. తీరా చూస్తే అది ఏ ఐదునెల్లకో ఆరునెల్లో వాయిదా పడుతుంది. కొన్ని సార్లు ఏడాది కూడా వాయిదా పడే ఛాన్స్ఉంది… కాని ఇదంత ఒకప్పుడు… పాన్ ఇండియా లెవల్లో రాజమౌలి సినిమా ఎప్పడొచ్చినా థియేటర్లు దొరుకుతాయి… కాని వారణాసి పాన్ ఇండియా మూవీ కాదు.. పాన్ వరల్డ్ మార్కెట్ లో 55వేల థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న సినిమా..కాబట్టి ఒక రిలీజ్ డేట్ చెప్పి వాయిదా వేస్తామంటే కుదరదు.. 30 భాషల్లో 120 దేశాల్లో 100 కోట్ల మందికి ఈ సినిమా రీచ్ అవ్వాలంటే, రిలీజ్ డేట్ కి ఏడాది ముందే అన్ని ప్రిపేర్ అయిపోవాలి… అప్పుడే వరల్డ్ వైడ్ గా ఏప్రిల్ 7 సమయానికి కావాల్సినన్ని థియేటర్లు సర్ధుబాటౌతాయి… అందులోనూ హాలీవుడ్ మూవీలో ఇంతవరకు 30 నుంచి 35 వేల థియేటర్స్ వరకే రిలీజ్ అయ్యాయి.

అలాంటింది 55 వేల థియేటర్స్ లో రిలీజ్ కాబోయే తొలి తెలుగు సినిమానే కాదు, తొలి ప్రపంచ సినిమా కూడా ఇదే… కాబట్టి రిలీజ్ డేట్ విషయంలో వాయిదాలు, రెక్లెస్ ప్లానింగ్స్ కి ఛాన్స్ లేదు. సో ఏప్రిల్ 7న యూఎస్, కెనెడా, యూరప్ లో 70శాతం థియేటర్స్ అనులకూలత వల్ల, ఆరోజు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసింది ఫిల్మ్ టీం. ఓరకంగా ఏడాది ముందే ఆ థియేటర్లను ఎంగేజ్ చేయటం వల్ల, డిస్ట్రిబ్యూషన్ సంస్థల నిర్ణయం వల్ల, ఇలా వారణాసి మూవీ రిలీజ్ డేట్ 2027 ఏప్రిల్ 7న ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.