మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నుంచి రెండు అణుబాంబులు సిద్దమౌతున్నాయి.. ఆల్రెడీ మొన్న పేలిందే, హైడ్రోజన్ బాంబులా ఇంకా షాక్ వేవ్ లను కంటిన్యూ చేస్తోంది.. డ్రాగన్ లెంథీ గ్లింప్స్ కి ఫ్యాన్స్ నుంచి ఇండస్ట్రీ జనం వరకు అందరి మతిపోయింది. అలాంటిది ఇప్పుడు అంతకుమించిన షాక్ వేవ్ రాబోతోంది. అది కూడా టీజర్ తో... అది టీజర్ కాదు, అంతకుమించిన సర్ ప్రైజ్.. ఎందుకంటే, ఈ సారి వచ్చే టీజర్ లో అసలు డ్రాగన్ ఎవరో చూపించబోతున్నారా? డ్రాగన్ గ్లింప్స్ లో మనం చూసింది లూగర్ అయితే, టీజర్ లో ఉండేదే అసలు డ్రాగనా? ఇదే గనక జరిగితే, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి డ్రాగన్ సినిమా కంటే ముందు ప్రోమోలతోనే కడుపు నిండిపోయే ఛాన్స్ఉంది. అయితే డ్రాగన్ టీజర్ మొదటి ఆటమ్ బాంబైతే, అంతకుమించిన అణుబాంబు, ఆ టీజర్ టైంలోనే పేల్చబోతున్నాడు ప్రశాంత్ నీల్.. ఇంతకి ఏంటది?
మాస్ బాంబ్ ని రీసెంట్ గా ప్రశాంత్ నీల్ పేల్చాడు.. నాలుగున్నర నిమిషాల గ్లింప్స్ అన్న షాక్, ఇంకా పాన్ ఇండియా లెవల్లో అందరి మైండ్ బ్లాంక్ చేస్తూనే ఉంది. ఇలాంటి టైంలో రెండు ఆటమ్ బాంబులు పేలితే ఎలా ఉంటుంది.. అందులో ఒకటి డ్రాగన్ టీజర్.. రెండోది అంతకుమించే సర్ ప్రైజ్... ముందు డ్రాగన్ టీజర్ గురించి ఎలాంటి ఎనౌన్స్ మెంట్ లేదు..కాబట్టి ఇది ప్రస్తుతానికి ప్రచారమే.. ఆగస్ట్ 15న డ్రాగన్ టీజర్ లాంచ్ చేసే అవకాశాలున్నాయి. కారణం ఇదో దేశభక్తి చిత్రమని ప్రశాంత్ నీల్ తేల్చటమే.. కాని ఆటైంకి వారణాసి టీజర్ లాంచ్ చేయాలనేది రాజమౌళి ఐడియా.. ఒకవేళ అదే జరిగితే, ఒకరోజు ముందు డ్రాగన్ టీజర్ పేల్చాలనుకుంటున్నాని తెలుస్తోంది. ఇదే డ్రాగన్ టీం బ్యాకప్ ప్లాన్ అంటూ ప్రచారం జరుగుతోంది.
ఇక గ్లింప్సే ఇంత లెంథీగా ఇస్తే ఇక టీజర్ ఏకంగా ట్రైలన్ ని మించేలా ఐదు పదినిమిషాలిస్తారా? డ్యూరేషన్ సంగతి వాళ్లిచ్చే సర్ ప్రైజింగ్ లాంచ్ తోనే తెలుస్తుంది.. కాని తేలాల్సింది ఇందులో ఏం చూపిస్తారు..? అక్కడే డ్రాగన్ సౌండ్ రీసౌండ్ చేస్తోంది. డ్రాగన్ గ్లింప్స్ లో కేవలం ఎన్టీఆర్ లోని ఒకే కోణాన్ని చూపించారు. అంటే లూగర్ పాత్రని మాత్రమే పరిచయం చేశాడు.ఇక డ్రాగన్ టీజర్ లో అసలు డ్రాగన్ రోల్ వేసిన ఎన్టీఆర్ ని చూపిస్తారని అంటున్నారు. అదే నిజమైతే, ఆపాత్రలో తన లుక్ ఎలా ఉంటుంది. తను లూగర్ కి ఏమౌతాడు? ఇవన్నీ తేలే ఛాన్స్ఉంది. అదే జరిగితే, ఇది ఒకరకంగా ఆటం బాంబ్ లాంటి ప్రోమోనే అవుతుంది. అదికాకుండా డ్రాగన్ టీజర్ తో మరో బాంబు పేల్చేందుకు ప్రశాంత్ నీల్ టీం కి స్కోపుంది.అదే డ్రాగన్ సీక్వెల్ ఎనౌైన్స్ మెంట్. డ్రాగన్ మొదటి భాగం తీస్తూనే, రెండో భాగం షూటింగ్ ని కూడా కంటిన్యూ చేస్తున్నారనే ప్రచారం ఎప్పటినుంచో ఉంది. కాని డ్రాగన్ గ్లింప్స్ లో ఇది ఒక భాగం అని, రెండు భాగాలని, ఏం తేల్చలేదు.. కాని ఇంథ లెంథీ కథని ఒక భాగంలో చెప్పటం కష్టమనే క్లారిటీ అందరిలో ఉంది. కాబట్టే రెండో భాగం టైటిల్ ని, కూడా డ్రాగన్ టీజర్ లో తేల్చే అవకాశం ఉంది. సంక్రాంతికే ట్రైలర్ పేల్చాలనే నిర్ణయంలో ప్రశాంత్ నీట్ టీం ఉన్నట్టు తెలుస్తోంది.. మొత్తానికి కేజీయఫ్ ని, త్రిబుల్ ఆర్ ని మించేలా అంచనాల భారం పెరుగుతోంది.