24 రోజుల్లో చిన్న సునామి… 44 రోజుల్లో భూకంపం…!

మ్యాన్ ఆఫ్ మాస్ సునామీకి టైం దగ్గర పడుతోంది. జస్ట్ 24 రోజుల్లో మొదటి మాస్ వేవ్ కి డ్రాగన్ టీం రెడీ అయ్యింది. ఎప్పుడో లాస్ట్ ఇయర్ బర్త్ డేకే డ్రాగన్ టీజర్ వచ్చి ఉండాలి.. అంతా వార్ 2 టీం వల్లే డ్రాగన్ అప్ డేట్స్ రాకుండా పోయింది.

Post Published By: dialnews
Updated : 7 April 2026, 3:41 PM IST

మ్యాన్ ఆఫ్ మాస్ సునామీకి టైం దగ్గర పడుతోంది. జస్ట్ 24 రోజుల్లో మొదటి మాస్ వేవ్ కి డ్రాగన్ టీం రెడీ అయ్యింది. ఎప్పుడో లాస్ట్ ఇయర్ బర్త్ డేకే డ్రాగన్ టీజర్ వచ్చి ఉండాలి.. అంతా వార్ 2 టీం వల్లే డ్రాగన్ అప్ డేట్స్ రాకుండా పోయింది. ఏదేమైనా ఇప్పడు ఏడాది గ్యాప్ తో డ్రాగన్ గ్లింప్స్ పేలుతోంది. ఈ సారి ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా మూడు సునామీలకు ప్రశాంత్ నీల్ టీం సర్వం సిద్దం చేస్తోంది. ఆల్రెడీ గ్లింప్స్ ఎడిట్ తోపాటు, ఎన్టీఆర్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టే కనిపిస్తోంది. పాటకి పర్మీషన్ వచ్చేసింది. ఇక మిగిలింది టీజరే.. అక్కడే ఆరు ఆప్షన్స్ తో ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కి మైండ్ బ్లాంక్ అయ్యే అప్ డేట్స్ రెడీ చేశాడట. ఇంతకి ఆ ఆరు ఆప్షన్స్ ని ఎందుకు ప్రశాంత్ నీల్ రెడీ చేశాడు? వాటిలో మ్యాన్ ఆఫ్ మాసెస్ దేన్ని ఎంచుకుంటాడు? టీజర్ పూర్తి చేసేందుకు ఎన్టీఆర్ పెట్టిన డెడ్ లైన్ టైం ఏంటి?

డ్రాగన్ సునామీకి టైం అయ్యింది. ఒకటి కాదు, రెండు కాదు, మూడు సాలిడ్ అప్ డేట్స్ తో దాడికి రెడీ అయ్యాడు ప్రశాంత్ నీల్. ఇంతవరకు కనీసం మోషన్ పోస్టర్ కూడా ఇవ్వకపోవటంతో, ఆకలి మీదున్న మ్యాన్ఆఫ్ మాసెస్ ఫ్యాన్స్ కి,ధమ్ బిర్యానీ ఆర్డర్ చేశాడు.. ఆల్ మోస్ట్ స్టార్టరే బ్లాక్ బస్టర్ గా మారేలాఉంది. గ్లింప్స్ కి ఇంకా మూడు వారలే ఉంది.ఎగ్జాక్ట్ గా మేడే కి డ్రాగన్ గ్లింప్స్ పేలే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఆ రోజుకి, ఇండియా, భూటాన్,చైనా కారిడార్ కి ఉన్న లింక్ అలాంటిది.. అందుకే మేడేకి గ్లింప్స్ ని పేల్చాలని ఫిక్స్ అయినట్టుంది ఫిల్మ్ టీం. హనుమాన్ జయంతికే ఎనౌన్స్ మెంట్ ని అంతా ఎక్స్ పెక్ట్ చేశారు.కాని రాలేదు. మోస్ట్ లీ వచ్చే వారం మేడే అప్ డేట్ మీద ఎనౌన్స్ మెంట్ రావొచ్చని తెలుస్తోంది

ఆల్రెడీ గ్లింప్స్ ఎడిట్ చేసిన ఫిల్మ్ టీం, సాంగ్ ని రెడీ చేస్తోంది. ఫైనల్ వర్షన్ కి ఆల్రెడీ ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా, మరో వెర్షన్ కూడా రెడీ చేస్తోంది ఫిల్మ్ టీం. మే డే రోజు గ్లింప్స్, మే 19న పాటని తూటాల పేల్చే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక అసలు సిసలు సునామీ మాత్రం మే 20నే వచ్చేలా ఉంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బర్త్ డేకి ముందే రెండు అప్ డేట్లు, ఇక పుట్టిన రోజే మాస్ అప్ డేట్ రెడీ అవుతోంది.ఏకంగా ఆరు వర్షన్స్ గా టీజర్స్ ని రెడీ చేసిందట ప్రశాంత్ నీల్ టీం.

సో ఒక వర్షన్ ని ఎన్టీఆర్ ఫైనల్ చేస్తే, దాని డబ్బింగ్ పనులుమొదలవ్వొచ్చు. ఒకవైపు షూటింగ్ జరుగుతుండగానే, డబ్బింగ్ పనులు మొదలు పెట్టబోతోంది ఫిల్మ్ టీం, ఈనెల 20, 21, 22 తేదీల్లో డ్రాగన్ టీజర్ కి డబ్బింగ్ చెప్పేందుకు ఎన్టీఆర్ రెడీ అవ్వొచ్చు..మొదటి రోజు తెలుగు, కన్నడ, తమిల్ భాషల్లో తన పాత్రకి డబ్బింగ్ చెప్పబోతున్న ఎన్టీఆర్, ఏప్రిల్ 21 న హిందీ, ఇంగ్లీష్ వర్షన్ కి డబ్బింగ్ చెప్పే ఛాన్స్ఉంది.ఇక ఫస్ట్ టైం తను బంగాలిలో కూడా డబ్బింగ్ చెప్పే సాహసం చేస్తున్నాడు. బంగాలి నేర్చుకుంటున్నాడా? లేదంటే టెంపరరీగా అక్కడి వ్యక్తుల సాయం తీసుకుని, తన డైలాగ్ వరకు గుర్తుపెట్టుకుని డబ్ చేస్తాడా అన్నది ఇంకా తేలలేదు. కాని తను బంగాలిభాషలో మాట్లాడటానికి, తన ఒరిజినల్ వాయిసే అక్కడ వినిపించాలనుకోవటానికి కథ పరంగా కనెక్షన్ ఉందట.కథ పరంగా బంగాలి, నార్త్ ఈస్ట్ బ్యాగ్ డ్రాప్ ఉండటంతో, జెన్యూన్ గా అటెమ్ట్ చేసేందుకే ఇలా టీజర్ లెవల్లోనే ఇంతగా సొంత గొంతుతో పరాయి భాషలో డబ్ చెప్పేందుకు సిద్దపడుతున్నాడు ఎన్టీఆర్.

Published : 
  • 7 April 2026, 3:41 PM IST