రొటీన్ రోతకు చెక్.. సైన్స్ ఫిక్షన్ తో నితిన్ కొత్త ప్రయోగం.. ఇప్పటికి అయిందా జ్ఞానోదయం..!

వరుస పరాజయాలు నితిన్ కెరీర్‌ను కాస్త ఇబ్బంది పెడుతున్న మాట వాస్తవం. మాచర్ల నియోజకవర్గం, ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్, రాబిన్ హుడ్, తమ్ముడు

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 26, 2026 | 12:21 PMLast Updated on: Jan 26, 2026 | 12:21 PM

Intersting News About Hero Nithin New Movie

వరుస పరాజయాలు నితిన్ కెరీర్‌ను కాస్త ఇబ్బంది పెడుతున్న మాట వాస్తవం. మాచర్ల నియోజకవర్గం, ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్, రాబిన్ హుడ్, తమ్ముడు వంటి రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో.. నితిన్‌కు గట్టిగానే జ్ఞానోదయం అయినట్లు కనిపిస్తోంది. మూస ధోరణిలో వెళ్తే వర్కౌట్ అవ్వదని గ్రహించిన ఈ యంగ్ హీరో.. ఇప్పుడు తన పంథా మార్చుకున్నాడు. కేవలం హిట్ కొట్టడమే కాదు, ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వాలనే ఉద్దేశంతో వైవిధ్యమైన కథల వైపు అడుగులు వేస్తున్నాడు. అందుకే ఈసారి రొటీన్ మాస్, లవ్ స్టోరీలను పక్కనపెట్టి దర్శకుడు వీఐ ఆనంద్‌తో చేతులు కలిపాడు. వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా ఒక ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కావడం విశేషం.

గతంలో ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం వంటి హై కాన్సెప్ట్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న వీఐ ఆనంద్.. నితిన్ కోసం ఒక డిఫరెంట్ వరల్డ్‌ను క్రియేట్ చేస్తున్నాడు. ఇది నితిన్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కబోతున్న చిత్రమని టాక్. తాజాగా విడుదలైన అనౌన్స్‌మెంట్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని అమాంతం పెంచేసింది. No Body.. No Rules అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో వచ్చిన ఈ పోస్టర్, కథలో ఏదో కొత్త మిస్టరీ దాగి ఉందని హింట్ ఇస్తోంది. కేవలం టైటిల్ అనౌన్స్‌మెంట్ కాకుండా, కాన్సెప్ట్ ఏంటనేది చెప్పకనే చెబుతూ వదిలిన ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రెగ్యులర్ హీరో ఇమేజ్ చట్రం నుంచి బయటకు వచ్చి నితిన్ చేస్తున్న ఈ ప్రయత్నం కచ్చితంగా ఫ్రెష్‌గా అనిపిస్తోంది. వీఐ ఆనంద్ సినిమాల్లో లాజిక్, మ్యాజిక్ రెండూ ఉంటాయి. టెక్నికల్‌గా స్ట్రాంగ్‌గా ఉంటూనే, ఎమోషన్ మిస్ అవ్వకుండా కథ చెప్పడం ఆయన స్టైల్. నితిన్ లాంటి ఎనర్జిటిక్ హీరోకి, వీఐ ఆనంద్ లాంటి క్రియేటివ్ డైరెక్టర్ తోడవ్వడం ఈ సినిమాకు ప్రధాన బలం.

ముఖ్యంగా గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ పరంగా ఈ సినిమా నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందని సమాచారం. ఇప్పటి వరకు లవర్ బాయ్ లేదా మాస్ హీరోగా కనిపించిన నితిన్‌ను, ఒక సైన్స్ ఫిక్షన్ సెటప్‌లో చూడటం అభిమానులకు ఖచ్చితంగా కొత్త కిక్ ఇస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్ ఆడియన్స్ మైండ్ సెట్ పూర్తిగా మారింది. రొటీన్ కథలను తిరస్కరిస్తూ, కొత్తదనంతో వచ్చే సినిమాలకు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ నేపథ్యంలో నితిన్ తీసుకున్న ఈ రిస్క్ ఖచ్చితంగా ఆయన కెరీర్‌కు హెల్ప్ అయ్యేలాగే ఉంది. ఈ ప్రయోగం కనుక సక్సెస్ అయితే.. నితిన్ మార్కెట్ పెరగడమే కాకుండా.. అతను మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కడానికి గట్టి పునాది పడుతుంది. మరి ఈ No Body.. No Rules కాన్సెప్ట్ నితిన్‌కు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో వేచి చూడాలి.