వారణాసి ఒక టైమ్ ట్రావెల్…!

టాలీవుడ్ జక్కన్న ఎస్.ఎస్. రాజమౌళి మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న 'SSMB29' సినిమాకు 'వారణాసి' అనే శక్తివంతమైన టైటిల్‌ను ఖరారు చేసిన సంగతి తెలిసిందే

Post Published By: dialnews
Updated : 14 March 2026, 3:57 PM IST

టాలీవుడ్ జక్కన్న ఎస్.ఎస్. రాజమౌళి మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న 'SSMB29' సినిమాకు 'వారణాసి' అనే శక్తివంతమైన టైటిల్‌ను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన ఈ చిత్ర గ్లింప్స్ చూశాక, అభిమానుల్లో ఒకటే చర్చ నడుస్తోంది. అదేమిటంటే.. ఈ సినిమా కథలో 'టైమ్ ట్రావెల్' అంశం ఉందా? అని. గ్లింప్స్ లో కనిపించిన విజువల్స్ మరియు రాజమౌళి హింట్స్ చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తోంది. వారణాసి సినిమా కేవలం ఒక గ్లోబ్‌ట్రోటర్ యాక్షన్ డ్రామా మాత్రమే కాదు, ఇది యుగాల అంతరాలను దాటుకుని వెళ్లే ఒక అద్భుతమైన ప్రయాణం.

ఈ సినిమా కథ కేవలం ప్రస్తుత కాలానికే పరిమితం కాకుండా, త్రేతాయుగం నుండి కలియుగం వరకు సాగుతుందని సమాచారం.వారణాసి నగరంపై పడబోయే ఒక వింత గ్రహశకలం వల్ల ప్రపంచానికి రాబోయే విపత్తును ఆపడానికి, హీరో కాలంలో వెనక్కి వెళ్లి కొన్ని కీలకమైన ఘటనలను ప్రభావితం చేయాల్సి వస్తుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. గ్లింప్స్ లో మహేష్ బాబు చేతిలో త్రిశూలం పట్టుకుని, రక్తసిక్తమైన గాయాలతో ఒక తెల్లటి నందిపై స్వారీ చేస్తూ కనిపించారు. ఈ క్యారెక్టర్ పేరు 'రుద్ర'. మరోవైపు, ఈ సినిమాలో రామాయణంలోని ఒక కీలక ఘట్టం సుమారు 60 రోజుల పాటు షూట్ చేసినట్లు రాజమౌళి స్వయంగా వెల్లడించారు.

దీన్ని బట్టి చూస్తే, మహేష్ బాబు పాత్ర టైమ్ ట్రావెల్ ద్వారా పురాతన కాలానికి వెళ్లి, అక్కడి చారిత్రక లేదా పౌరాణిక వ్యక్తులతో కలిసి ప్రయాణిస్తుందని స్పష్టమవుతోంది. రాజమౌళి ఈ సినిమా కోసం ప్రపంచంలోని అత్యంత కఠినమైన ప్రదేశాలను ఎంచుకున్నారు. ఇప్పుడు తాజాగా అంటార్కిటికాలో షూటింగ్ జరుపుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఒక భారతీయ సినిమా అక్కడ షూట్ జరుపుకోవడం ఇదే మొదటిసారి. ఆఫ్రికా అడవులు, హిమాలయాలు మరియు అంటార్కిటికాలోని మంచు ఖండాల మధ్య సాగే ఈ ప్రయాణంలో 'టైమ్ ట్రావెల్' వల్ల వచ్చే మార్పులు ప్రేక్షకులను థ్రిల్ చేయడం ఖాయం. మహేష్ బాబుకు జోడీగా బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా 'మందాకిని' అనే పాత్రలో నటిస్తుండగా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ 'కుంభ' అనే పవర్‌ఫుల్ విలన్ పాత్రలో కనిపిస్తున్నారు. భారతదేశంలోనే మొదటిసారిగా ఈ సినిమాను పూర్తిస్థాయి IMAX ఆస్పెక్ట్ రేషియోలో చిత్రీకరిస్తున్నారు. ఈ విజువల్ వండర్ 2027 ఏప్రిల్ 7న ఉగాది సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Published : 
  • 14 March 2026, 3:57 PM IST