ప్రపంచంలో FIRST MOVIE.. 55 వేల థియేటర్స్ ఒక్కటి చాలు…!

వారాణాసి మూవీ ప్రపంచ వ్యాప్తంగా 120 దేశాల్లో 100 కోట్ల మంది చూసేలా 30 భాషల్లోనే కాదు, 55 వేల తియేటర్స్ లో కూడా రిలీజ్ కాబోతోంది. ఇందులో ఒక్క థియేటర్ తగ్గకుండా, ఉండేలా హాలీవుడ్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ని, నెట్ ఫ్లిక్స్

Post Published By: dialnews
Updated : 14 March 2026, 4:20 PM IST

55 వేలథియేటర్స్ లో ఒక ఇండియన్ మూవీ వారణాసి వస్తోందంటే, నమ్మ శక్యంగా లేదు. కాని ఇదే విషయంలో లెక్కంటే లెక్కేసుకుని ఉన్నాడు దర్శకుడు రాజమౌళి. ఇంతవరకు సూపర్ స్టార్ మహేశ్ బాబు ఒక్కటంటే ఒక్క పాన్ ఇండియా మూవీ చేయలేదు. కాని దేశవ్యాప్తంగా తనకి, తన గుడ్ లుక్స్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటి తన వారణాసి మూవీ హాలీవుడ్ సినిమాలకే సాధ్యం కాని రికార్డుని సొంతం చేసుకోబోతోంది. ఏకంగా 55 వేల థియేటర్స్ లో రిలీజ్ కాబోయే తొలి ఇండియన్ సినిమాగానే కాదు, తొలి ప్రపంచ సినిమాగా కూడా హిస్టరీ క్రియేట్ చేయబోతోంది. ఒక ఇండియన్ సినిమా వచ్చి వరల్డ్ వైడ్ గా 55 వేల థియేటర్స్ లో రిలీజ్ అవ్వబోతోందంటే, ఇదే పని హాలీవుడ్ సినిమాలెందుకు చేయలేకపోయాయి..? ఈ డౌట్ ఎవరికైనా రావటం సహజం.. కాని బాహుబలి వచ్చే వరకు, పాన్ ఇండియా లెవల్లో ఇలా ఓ సినిమాను రిలీజ్ చేయొచ్చని, 5 వేల థియేటర్స్ లో ఒక తెలుగుసినిమా ఆడుతుందని ఎవరైనా అనుకున్నామా? బాహుబలి 2 వ భాగం 10 వేల థియేటర్స్ లో ఆడిందంటే నమ్మగమా..? కాని బాలీవుడ్ వాళ్లకి ఇవేవి సాధ్యం కాలేదు.. సో వారణాసి కూడా హాలీవుడ్ కి అలాంటి గుణపాటమే చెప్పబోతోందా?

వారాణాసి మూవీ ప్రపంచ వ్యాప్తంగా 120 దేశాల్లో 100 కోట్ల మంది చూసేలా 30 భాషల్లోనే కాదు, 55 వేల తియేటర్స్ లో కూడా రిలీజ్ కాబోతోంది. ఇందులో ఒక్క థియేటర్ తగ్గకుండా, ఉండేలా హాలీవుడ్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ని, నెట్ ఫ్లిక్స్ కి అలానే పీవీ ఆర్ థియేటర్స్ చైన్ ని ఇలా అందరితో టై అప్ అవుతున్నాడు దర్శక ధీరుడు రాజమౌలి.ఇండియా మొత్తం కూడా 10 వేల థియేటర్స్ లేవు.. అమెరికాలో 12 వేల థియేటర్స్, యూరప్ అంత వేసుకుంటే మరో 15 వేలు.. ఇలా లెక్కేస్తే గట్టిగా 30వేల థియేటర్స్ కి మంచి రీచ్ ఉన్న థియేటర్స్ లేవు.. అందుకే ఇప్పటి వరకు, అవతార్, అవేంజర్స్, లాంటి హాలీవుడ్ మూవీలు కూడా 25 నుంచి 30 వేల థియేటర్స్ లోపే రిలీజ్ అయ్యాయి..

అలాంటిది 55 వేల థియేటర్స్ లో ఒక ఇండియన్ మూవీ రిలీజ్ అవటం సాధ్యమా? అదే సాధ్యమైతే, హాలీవుడ్ సినిమాలెందుకు ఇలాంటి సాహసం చేయలేదు.. ఈ రెండు ప్రశ్నలకు ఒకటే సమాధారం.. దటీస్ రాజమౌళి. హాలీవుడ్ వాళ్లకంటే గొప్పోడని కాదు.. కాని కొన్ని సార్లు గొప్పవాల్లనిపించుకున్న వాళ్లకి కూడా సాధ్యం కానివి ఎవరో ఒక ఆర్డినరీ పర్సన్ వచ్చి చేస్తే షాక్ అవుతాం..రాజమౌళి మనకుగొప్పో దర్శకుడు కావొచ్చు.. హాలీవుడ్ మార్కెట్ లో మాత్రం తనో కొత్తవాడు..లేదా ఆర్టినరీ డైరెక్టర్. తనిప్పడు వారణాసితో వరల్డ్ మార్కెట్ ని షేక్ చేస్తేనే, హాలీవుడ్ లో తన పేరు రీసౌండ్ చేస్తుంది. అలా జరగాలంటే, కథ కత్తిలా ఉంటే సరిపోదు.. తెల్లోల్లు ఆఫ్రికన్లు ఆసియన్లు ఇలా అంత మన సినిమా చూసేలా కంటెంట్ గొప్పగా ఉండాలి..

అంత గొప్పగా తీసినా అది వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కావాలి. అందుకే ఇండియా, అమెరికా తో పాటుమిగతా ఇంగ్లీష్ దేశాలు, యూరప్ తో మా పాటు రష్యా, కొరియా, జపాన్, ఆఫ్రికా, సౌత్ అమెరికాలో బ్రెజిల్ నుంచి అతర్జెంటీనా వరకు లెక్కేస్తే 40 వేల వరకు థియటర్స్ దొరుకుతున్నాయట. ఇక మిగతా 15 వేల థియేటర్స్ చైనా లో టార్గెట్ చేస్తున్నాడు రాజమౌళి. చైనాలో లక్షకు పైగా థియేటర్స్ ఉన్నా, అందులో 20 వలే వరకు డైరెక్ట్ రిలీజ్ కి ఛాన్స్ ఇస్తాయి.. మిగతావి, అక్కడి సంస్థలతో టై అప్ అయ్యి డబ్ చేసి రిలీజ్ చేయాల్సిందే..అందుకే మొత్తంగా వరల్డ్ వైడ్ గా హాలీవుడ్ కి కూడా సాధ్యం కాని 55 వేల థియేటర్స్ రిలీజ్ అన్న పాయింట్ మీదే ఫోకస్ పెంచాడు రాజమౌళి. ఇలాంటిదేదో చేస్తే తప్ప వరల్డ్ ఆడియన్స్ దిమ్మ తిరిగి బొమ్మ కనిపించదు... సో ఇలా కథ, కథనం, మేకింగ్ నుంచి థియేట్రికల్ రిలీజ్ వరకు ప్రతీది సినిమాకు ప్లస్ అవటమే కాదు, హాలీవుడ్ కూడా షాకయ్యే పనులు చేస్తున్నాడు రాజమౌళి.

Published : 
  • 14 March 2026, 4:20 PM IST