1000 కోట్లు నిజమైతే.. జేమ్స్ బాండ్ కి పండగే..!

వారణాసి మూవీ ఓటీటీ రైట్స్ నిజంగా 1000 కోట్లైతే అదో సెన్సేషనల్ న్యూస్.. అదే ఎంతవరకు నిజమో వచ్చేనెలలో తేలే ఛాన్స్ఉంది.

Post Published By: dialnews
Updated : 11 February 2026, 4:45 PM IST

వారణాసి మూవీ ఓటీటీ రైట్స్ నిజంగా 1000 కోట్లైతే అదో సెన్సేషనల్ న్యూస్.. అదే ఎంతవరకు నిజమో వచ్చేనెలలో తేలే ఛాన్స్ఉంది. ఉగాది ఎనౌన్స్ మెంట్ సాలిడ్ గానే వచ్చేలా ఉంది. అయితే ఈ అంశం మాత్రం సూపర్ స్టార్ నెక్ట్స్ మూవీ పంట పండించేలా ఉంది. సుకుమార్ డైరెక్షన్ లో మహేశ్ బాబు చేయబోయే ఫస్ట్ జేమ్స్ బాండ్ మూవీ అని ఆల్రెడీ ప్రచారం జరుగుతోంది. ఆ సినిమాకు వారణాసి వల్ల పెద్దగానే కలిసొచ్చేలా ఉంది. 1000 కోట్ల వారనాసి రైట్స్, సుకుమార్ ప్లాన్ చేసే జేమ్స్ బాండ్ లాంటిమూవీకి 500 కోట్లు కలిసొచ్చేలా చేస్తోంది. అంతేకాదు మహేశ్ బాబు నిర్ణయం ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొంపముంచేలా ఉంది. తనెంతగానో సేఫ్ జోన్ లో ఉన్నా అనుకుంటున్నాడు.. కాని తనని రిస్క్ లోకి నెట్టేలా ఉంది సూపర్ స్టార్ మహేశ్ బాబు తీసుకున్న నిర్ణయం.. ఇంతకి వారనాసి 1000 కోట్ల ఓటీటీ రైట్స్ ఎలా సుకుమార్ జేమ్స్ బాండ్ మూవీకి 500 కోట్లు కలిసొచ్చేలా చేస్తోంది. సూపర్ స్టార్ ఏ నిర్ణయం బన్నీని రిస్క్ లోకి నెడుతోంది?

వారణాసి మూవీ ఓటీటీ రైట్స్ 1000 కోట్లని అఫీషిలయల్ గా ఎనౌన్స్ మెంట్ వస్తే, భూమ్ బద్దలే.. బాలీవుడ్ హీరోలైతే షాక్ లోకి వెళతారు ఇలాంటి ఎనౌన్స్ మెంట్ వస్తే.. కాని ఇదే జరిగేలా ఉంది. దాని వల్ల సూపర్ స్టార్ మహేశ్ బాబు పేరు వరల్డ్ వైడ్ గా మారుమోగటమే కాదు, తన నెక్ట్స్ సినిమాకు కూడా ఇది ప్లస్ అయ్యేలాఉంది.పుష్పరాజ్ రెండు భాగాలతో పాన్ ఇండియాని షేక్ చేసిన సుకుమార్, ఇప్పుడు మహేశ్ బాబు తో జేమ్స్ బాండ్ జోనర్ లో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. అది రామ్ చరణ్ తో అనుకున్న సినిమా తర్వాతే మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది.. ఐతే దీనికి వారనాసికి ఉన్న లింక్ ఓటీటీ రైట్స్... ఇంకా సుకుమార్, మహేశ్ కాంబినేషన్ లో సినిమా ఎనౌన్స్ కాలేదు.

వర్కింగ్ టైటిల్ కూడా పెట్టలేదు. కాని ఆప్పుడే ఇండియన్ లాంగ్వేజెస్ వర్షన్ కి 500 కోట్ల ఓటీటీ రైట్స్ ఆఫర్ చేసిందట అమేజాన్.. ఇదే మహేశ్, సుకుమార్ తో అమేజాన్ ప్రతినిధుల మీటింగ్ వెనకున్న సారాంశం... ఇదిచాలా విచిత్రంం... రామ్ చరణ్ తో సుకుమార్ మూవీ మొదలు కాలేదు. అదవ్వాలి... ఈలోపు వారణాసి పూర్తయ్యాక, మహేశ్ తో సుకుమార్ సినిమా ఎనౌన్స్ కావాలి..అప్పుడు సరే ఓటీటీ రైట్స్ భారీ దర పలికిందంటే అర్ధం చేసుకోవచ్చు.. కాని వారణాసి ఓటీటీ రైట్స్ కినెట్ ఫ్లిక్స్ 1000 కోట్లు ఆఫర్ ఇవ్వటంతో, అలర్ట్ అయిన అమేజాన్, ఆతర్వాత మహేశ్ చేసే సినిమాను టార్గెట్ చేసినట్టుంది. అంతాబానే ఉంది. కాని మహేశ్ సినిమా ఓటీటీ రైట్స్ 1000 కోట్లు దాటితే, ఆతర్వాత సుకుమార్ తో తను చేయబోయే సినిమా ఓటీటీ రైట్స్ అంతకుమించాలి.

కాని ఎందుకు ఇందులో సగమే ఉంటున్నాయనటానికి ఒక లెక్క ఉంది. అదేంటంటే, సుకుమార్ మేకింగ్ లో మహేశ్ బాబు చేయబోయే సినిమా ఐదు భాషల రైట్స్ మాత్రమే 500 కోట్లు.. ఇంగ్లీష్ వర్షన్ కి మాత్రం ఓటీటీ రైట్స్ ముందే మాట్లాడట్లేదట. సో కేవలం ఐదు భారతీయ భాషల్లో మహేశ్ సినిమా ఓటీటీ రైట్స్ 500 కోట్లంటే అది వారణాసి వార్తకి మించిన సెన్సేషన్.. అదే ఇప్పుడు జరిగేలాఉంది. అమేజాన్ ప్రతినిధులతో, మహేశ్, సుకుమార్ మీటింగ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. అసలు సుకుమార్,మహేశ్ మూవీకి వీల్లిచ్చే 500 కోట్ల ఆఫర్ తోనే, బడ్జెట్ సమకూరేలా ఉంది.

Published : 
  • 11 February 2026, 4:45 PM IST