జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 'డ్రాగన్'. 'దేవర' మరియు 'వార్ 2' తర్వాత తారక్ చేస్తున్న మోస్ట్ ఏవైటెడ్ ప్రాజెక్ట్ #NTR31 అదే ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ కాకపోయినా పిలువబడుతున్న డ్రాగన్ నుంచి అదిరిపోయే అప్‌డేట్స్ వచ్చేశాయి. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. లేటెస్ట్ సమాచారం ప్రకారం, ఈ చిత్రం కోసం మేకర్స్ కొన్ని క్రేజీ నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాను ఇండియన్ స్క్రీన్ మీద ఇప్పటివరకు చూడని రీతిలో ప్లాన్ చేస్తున్నాడు.
ఈ నెలలో చిత్ర యూనిట్ జోర్డాన్ దేశంలో ఒక భారీ యాక్షన్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. అక్కడ అత్యంత కీలకమైన మూడు భారీ యాక్షన్ సీక్వెన్స్‌లను చిత్రీకరించారు.మధ్యలో కొన్ని సీన్లు నచ్చక ఎన్టీఆర్ రీ-షూట్ అడిగారనే వార్తలు వచ్చాయి. కానీ, ప్రశాంత్ నీల్ పక్కా ప్లానింగ్‌తో తీసిన అవుట్‌పుట్ అదిరిపోయిందని, సినిమా అనుకున్న సమయానికే వస్తుందని ఇండస్ట్రీ టాక్.మలయాళ స్టార్ టొవినో థామస్ కూడా ఈ జోర్డాన్ షెడ్యూల్‌లో పాల్గొన్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాకు ముందు నుంచి 'డ్రాగన్' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. అయితే, తాజాగా సోషల్ మీడియాలో 'బ్రూస్ లీ' అనే టైటిల్ కూడా పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో రామ్ చరణ్ సినిమాకు ఈ పేరు ఉన్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ స్టార్ అనిల్ కపూర్ ఒక పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. 'వార్ 2' తర్వాత అనిల్ కపూర్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న రెండో సినిమా ఇది. హీరోయిన్‌గా 'కాంతార' ఫేమ్ రుక్మిణి వసంత్ నటిస్తోంది.
ఈ సినిమా థియేటర్లలోకి రాకముందే రికార్డులు సృష్టిస్తోంది. నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ఏకంగా 125 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. ఈ డీల్ వర్క్ అవ్వాలంటే సినిమా బాక్సాఫీస్ వద్ద కనీసం 500 కోట్లు వసూలు చేయాలనే ఒక ఆసక్తికరమైన అగ్రిమెంట్ కూడా కుదిరిందట. ప్రశాంత్ నీల్ రేంజ్‌కు ఇది చాలా చిన్న టార్గెట్ అని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ చిత్రం జూన్ 25, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.