Top story:కర్చీఫ్ ఎక్కడ వేయాలి? ఫ్రస్టేషన్ లో సాయి రెడ్డి…. జగన్ రమ్మనుడు. బాబు కలవడు. పవన్ పిలవడు.
వైసిపి లో ఒకప్పటి నెంబర్ 2, మాజీ ఎంపీ......విజయ్ సాయిరెడ్డి ఫ్రస్టేషన్లో ఉన్నారా? ఆయన మాటలు.... సెటైర్లు... విమర్శలు....
వైసిపి లో ఒకప్పటి నెంబర్ 2, మాజీ ఎంపీ……విజయ్ సాయిరెడ్డి ఫ్రస్టేషన్లో ఉన్నారా? ఆయన మాటలు…. సెటైర్లు… విమర్శలు…. ఆరోపణలు అన్ని చూస్తుంటే సాయిరెడ్డి బాగా నిరాశ నిస్పృహ లతో ఉన్నట్లు కనిపిస్తోంది. వైసిపి అధినేత జగన్ కు 15 ఏళ్లకు పైగా చేదోడు వాదోడుగా ఉండడమే కాక, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్మాణంలో కీలకపాత్ర వహించారు సాయి రెడ్డి.
కానీ మొన్నటి ఎన్నికల్లో వైసిపి ఓడిపోయాక…. మారిన రాజకీయ పరిస్థితులు, ఒత్తిళ్లు వీటన్నిటి కారణంగా వైసీపీకి, రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేసి … వ్యవసాయం చేసుకుంటానంటూ వెళ్లిపోయారు సాయి రెడ్డి.
వ్యవసాయం చేసుకుంటాను అన్న పెద్దమనిషి ఏడాది తిరగకుండానే,…. నేను మళ్ళీ రాజకీయాల్లోకి వస్తాను… ఏ పార్టీలో చేరుతానో అప్పుడే చెప్తాను అంటూ మనసులో మాట బయటపెట్టారు. సాయి రెడ్డి వ్యవసాయం చేసుకుంటానంటూ చెప్పిన కబుర్లు అప్పట్లో ఎవరు నమ్మలేదు. సాయి రెడ్డి క్రిమినల్ బ్రెయిన్ గురించి తెలిసిన వాళ్ళు… ప్రత్యక్షంగా ,పరోక్షంగా ఆయనను చూసిన వాళ్లు సాయి రెడ్డి వ్యవసాయం చేసుకుంటానంటే నమ్ముతారా?
కేంద్రంలో బిజెపితో రహస్య ఒప్పందం మేరకే సాయి రెడ్డి తన రాజ్యసభ ఎంపీ కి రాజీనామా చేసి ఆ పదవిని కమలం పార్టీకి వదిలేశారు. ఏపీ లిక్కర్ స్కామ్ మొత్తం విజయసాయి రెడ్డికి తెలిసే జరిగిన… ఆయనని రెండు మూడు సార్లు పిలిచి స్టేట్మెంట్లు తీసుకున్నారే తప్ప అరెస్టు మాత్రం చేయలేదు. దానికి కారణం…. కూటమి సర్కార్ తో సాయి రెడ్డి కున్న లోపాయి కారి ఒప్పందం అనే టాక్ నడుస్తోంది.
2019 నుంచి 24 వరకు ఇన్చార్జిగా ఉన్న సాయి రెడ్డి ఆ ప్రాంతానికి ముఖ్యమంత్రి లాగే వ్యవహరించారు.
జగన్ ఏపీని చక్రవర్తి సామంత రాజులకు పంచి ఇచ్చినట్లు ఒక్కొక్క ప్రాంతాన్ని వాటాలేసి ఒక్కొక్క రెడ్డి కి కట్టబెట్టాడు. ఉత్తరాంధ్ర మూడు జిల్లాలను విజయసాయి రెడ్డి వనికించేశాడు. సొంత వ్యాపారాలు చేసుకోవడం ఒకే అయితే, ప్రత్యర్థి కులాలు పార్టీలను వెంటాడి వేటా డాడు. పార్టీలోనూ వర్గాలు గ్రూపులు, కుట్రలు కుతంత్రాలు ఒకటి కాదు. ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ తో సాయి రెడ్డి వ్యవహారం పార్టీ పరువు తీసింది.
చివరికి ఉత్తరాంధ్రలో బొత్స తో సహా అందరూ ఓడిపోయే పరిస్థితి వచ్చింది. జగన్ చుట్టూ ఉన్న క్వార్టర్ తో యుద్ధం చేయలేక చివరికి తానే పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చాడు సాయి రెడ్డి. జగన్ మంచోడు చుట్టూ ఉన్నోళ్లంతా నీచులు అనే నినాదం మొదటి చెప్పిన సాయి రెడ్డి…. క్రమంగా తను వాదన మార్చుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు జగన్ కూడా టార్గెట్ చేయడం మొదలుపెట్టారు.సాయి రెడ్డి జగన్ పైనే నేరుగా కామెంట్లు చేయడం వెనక ఆసక్తికరమైన అంశాలు బయటకు వచ్చాయి. వైసిపి లోకి తిరిగి రాడానికి సాయి రెడ్డి ప్రయత్నం చేశారు. దీనిని జగన్ చుట్టూ ఉండే కోటరీ తీవ్రంగా ప్రతిఘటించింది. జగన్ కూడా సాయిరెడ్డి తిరిగి రావడానికి అంగీకరించలేదు. దీంతో సహజంగానే అహంకారి, కుటిల మనస్కుడైన సాయి రెడ్డి ఇగో దెబ్బతింది.
మరో వైపు పవన్ కళ్యాణ్ తనకు పాత మిత్రుడు అంటూ తరచూ చెప్పుకునే సాయి రెడ్డి…. పవన్ ని తాను ఎప్పుడూ కామెంట్ చేయలేదని కూడా ప్రకటించి జాగ్రత్త పడ్డారు. అయినా సరే…. సాయి జనసేనలోకి దూరడానికి ప్రయత్నించిన వర్కౌట్ కాలేదు. స్కాముల నుంచి సాయి రెడ్డికి రిలీఫ్ అయితే ఇచ్చారు కానీ పార్టీలో చేర్చుకోవడానికి టిడిపి బిజెపి సుముఖంగా లేవు.ఆర్థిక నేరాలు… విధ్వంస రాజకీయాలు ఈ రెండు విజయ సాయి రెడ్డికి పెద్ద ఆటంకాలుగా మారాయి.
కొందరు ఢిల్లీ స్థాయిలో బిజెపితో మాట్లాడి పార్టీలోకి తీసుకోవాలని ప్రయత్నించిన వర్కౌట్ కాలేదు.
విజయ్ సారధి టీడీపీలో చేరడం అనేది అసలు ఎవరికీ జీర్ణం కానిది.
చంద్రబాబు నాయుడు గాని లోకేష్ గాని…. ఆ ఆలోచనకే తావు ఇవ్వరు. సాయి రెడ్డిని పార్టీలోకి తీసుకొని భరించేటంత శక్తి పవన్ కళ్యాణ్ కి లేదు. జగన్ సర్కార్లో జరిగిన అరాచకాలు, వైసీపీలో లోగుట్టు వ్యవహారాలు తెలుసుకోవడానికి సాయి రెడ్డి ఉపయోగపడతాడేమో తప్ప… ఆయన్ని చేర్చుకోవడానికి ఏ పార్టీ ఆసక్తి చూపడం లేదు. దీంతో పెద్దాయనకి ఫ్రస్టేషన్ బాగా పెరిగిపోతుంది. తనలాంటి వ్యూహకర్త సేవల్ని పార్టీలు ఎందుకు వాడుకోలేకపోతున్నాయి అనే ఆవేదంతో….. దీనంతటికీ కారణం జగన్ చుట్టూ ఉన్న కోటరీ ఏననివాళ్లని మాటలతో చీల్చి చెండాడుతున్నాడు సాయి రెడ్డి. ఒకానొక సమయంలో సమయమును కోల్పోయి జగన్ కూడా తిట్టిపోస్తున్నాడు. జగన్ మళ్ళీ జీవితంలో సీఎం కాలేదు అంటూ తన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. దాన్ని అనుకున్న అసలు కారణం రాజకీయ నిరాశ…. నిస్పృహలే.











