250 కోట్లు.. అంతతక్కువా? ఫ్యాన్స్ ఏమనుకుంటారో..?

రెబల్ స్టార్ ప్రభాస్ రాజా సాబ్ రిజల్ట్ ఎలా ఉన్నా, 5 పాన్ ఇండియా హిట్లతో ఇప్పటికీ తనే పాన్ ఇండియా కింగ్. తనని ఇటు ఎన్టీఆర్, అటు బన్నీ ఓవర్ టేక్ చేసేందుకు ట్రై చేస్తున్నారు. అయితే ఇలాంటి టైంలో 250 కోట్ల వార్త వైరలైంది.

Post Published By: dialnews
Updated : 15 April 2026, 8:50 PM IST

రెబల్ స్టార్ ప్రభాస్ రాజా సాబ్ రిజల్ట్ ఎలా ఉన్నా, 5 పాన్ ఇండియా హిట్లతో ఇప్పటికీ తనే పాన్ ఇండియా కింగ్. తనని ఇటు ఎన్టీఆర్, అటు బన్నీ ఓవర్ టేక్ చేసేందుకు ట్రై చేస్తున్నారు. అయితే ఇలాంటి టైంలో 250 కోట్ల వార్త వైరలైంది. 550 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకునే రేంజ్ కి రెబల్ స్టార్ రీచ్ అయ్యాడన్నారు. హాలీవుడ్ స్టార్స్ లిస్ట్ లో చేరేంతగా భారీ పారితోషికంతో, పాన్ ఆసియానే షేక్ చేస్తున్నాడన్నారు. అలాంటి స్టార్ తో సందీప్ రెడ్డి తీసే స్పిరిట్ విషయంలో మాత్రం 250 కోట్ల నెంబర్ చాలా చిన్నగా కనిపిస్తోంది. వినిపిస్తోంది. షాకింగ్ గా ఉంది.. ఎందుకంటే యానిమల్ తో 900 కోట్లు రాబట్టిన సందీప్ మేకింగ్ లో ప్రభాస్ సినిమా అంటే 5 వేల కోట్ల వసూల్లు గ్యారెంటీ అనుకుంటున్నారు.. అలాంటి ప్రాజెక్ట్ కి 250 కోట్ల ఓటీటీ డీల్ అంటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే.. వారణాసికి వెయ్యికోట్ల ఓటీటీ ఆఫర్ వచ్చింది... డ్రాగన్ కి 700 కోట్ల పైనే ఓటీటీ డీల్ సెట్ అయ్యేలా ఉంది. అలాంటిది స్పిరిట్ కి మరీ 250 కోట్ల ఓటీటీ ఆఫరా? ఇది నమ్మేలా లేదు.. ఇంతకి ఏది నిజం? అసలేం జరుగుతోంది?

రెబల్ స్టార్ ప్రభాస్ తో సందీప్ రెడ్డి తీస్తున్న స్పిరిట్ మూవీ పాన్ ఇండియా ని షేక్ చేస్తుందనే అంచనాలున్నాయి. అసలు పాన్ వరల్డ్ మార్కెట్ మీద దాడి చేసేందుకు స్పిరిట్ టీం రెడీ అవుతోందనే అంచనాలున్నాయి. దీనికి తోడు బాహుబలి 2 భాగాలు, సాహో, కల్కీ, సలార్ ఇలా ఐదు పాన్ ఇండియా హిట్లు, అందులో రెండు సార్లు వెయ్యికోట్ల వసూళ్లు రాబట్టిన రికార్డు రెబల్ స్టార్ ప్రభాస్ సొంతం..అలాంటి తనతో 900 కోట్లు రాబట్టిన యానిమల్ డైరెక్టర్ సందీప్ సినిమా తీస్తున్నాడంటే, బ్రహ్మాండం బద్దలవ్వాలి. అంతగా ఈ కాంబినేషన్ సెన్సేషన్ అవుతుందనే అంచనాలున్నాయి. అలాంటిది సడన్ గా స్పిరిట్ మూవీకి 250 కోట్ల ఓటీటీ ఆఫర్ వచ్చిందనేసరికి, ఈ వార్త వైరలైంది. కారనం, మహేశ్ బాబు వారణాసి మూవీకి, 1000 కోట్ల వరకు నెట్ ఫ్లిక్స్ సంస్త ఆఫర్ చేసిందని ఆమధ్య వార్తలొచ్చాయి.

ఇక ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ చేస్తున్న డ్రాన్ కి కూడా 700 కోట్ల పైనే ఓటీటీ ఆఫర్లు వస్తున్నట్టు వార్తలొచ్చాయి. ఐనా కూడా అటు వారణాసి టీం, ఇటు డ్రాగన్ టీం రెండూ ఆ ఆఫర్లను తిరస్కరించినట్టు ప్రచారం జరుగుతోంది. వారణాసి టీం అన్ని భాషల ఓటీటీ డీల్ ని 1500 కోట్లతో ముగించాలనుకుంటోందని, ఇక డ్రాగన్ రెండు భాగాల ఓటీటీ డీల్ 1000 కోట్లకు తగ్గకూడదని, డ్రాగన్ టీం ఫిక్స్ అయినట్టు కూడా ప్రచారం జరుగుతోంది.సో ఈ లెక్కన ఎందుకు స్పిరిట్ మూవీకి మరీ 250 కోట్ల ఓటీటీ ఆఫరే వచ్చింది... ఇది నిజంగా షాకింగ్ న్యూసే... స్పిరిట్ మూవీ బడ్జెట్ ఎంతలేదన్నా 400 కోట్లకు తక్కువ కాదు. అందులో 300 కోట్లు ప్రభాస్ రెమ్యునరేషనే.. ఇక 250 కోట్ల వరకు తనకి ప్రాఫిట్స్ లో బెనిఫిట్స్ రూపంలో దక్కేలా ఉన్నాయి. సందీప్ తోపాటు, టీసీరీస్ కి కూడా ప్రాఫిట్స్ లో 35 శాతం చొప్పున వాటా ఉండటంతో, ఇద్దరికి, తలో 400 కోట్లు వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు.

లెక్కలన్నీ భారీ స్థాయిలో ఉంటే, ఓటీటీ డీల్ మరీ 250 కోట్లుకు తెగేలా ఉండటం అందరికి ఆశ్చర్యంగా ఉంది. 550 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే హీరో, 800 కోట్ల వరకు బడ్జెట్ ఉండే సినిమా లు చేసే హీరో మూవీకి ఓటీటీ ఆఫర్ 250 కోట్లంటే ఇది నిజంగా షాకింగ్ న్యూసే..కాకపోతే ఇక్కడ నిజం ఏంటంటే, స్పిరిట్ తెలుగు, తమిల్ వర్షన్ రైట్స్ మాత్రమే 250 కోట్లు... హిందీ వర్షన్ కి 450 కోట్లు వచ్చేఛాన్స్ఉందనంటున్నారు. అన్ని భాషల రైట్స్ కలుపుకుంటే 900 కోట్లకు తగ్గదనే కొత్త లెక్కలు వినిపిస్తున్నాయి. కాని స్పిరిట్ తెలుగు, తమిళ్ వర్షన్ ఓటీటీ రైట్స్ నే, సినిమా అన్ని భాషల రైట్స్ లా నెగెటీవ్ ప్రచారం చేసే బ్యాచ్, రాంగ్ రూట్లో వార్తని వైరల్ చేస్తున్నారే టాక్ పెరిగింది. కౌంటర్ ఎటాక్ కూడా రెబల్ ఫ్యాన్స్ నుంచి పెరిగినట్టే కనిపిస్తోంది.

Published : 
  • 15 April 2026, 8:50 PM IST