TEASER పూనకాలు.. బర్త్ డే బొనాంజా.. ఎంతకాలానికి.?

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ని డ్రాగన్ గా చూడాలని ఫ్యాన్స్ ఎగ్జైటింగ్ గా ఉన్నారు. కాని ఇంతవరకు గ్లింప్స్ రాలేదు. టీజర్ వదల్లేదు..

Post Published By: dialnews
Updated : 13 February 2026, 5:00 PM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ని డ్రాగన్ గా చూడాలని ఫ్యాన్స్ ఎగ్జైటింగ్ గా ఉన్నారు. కాని ఇంతవరకు గ్లింప్స్ రాలేదు. టీజర్ వదల్లేదు.. ఇక ట్రైలర్ అనేది మాత్రం అత్యాశే అనుకోవాలి. అంతా సైలెన్స్....మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న వారణాసీ టీం, పూర్తిగా ఓపెన్ అయిపోతున్నా డ్రాగన్ టీం లో కదలిక లేదనేది, ఫ్యాన్స్ కంప్లైంట్.. ఆ కంప్లైంటే ఎన్టీఆర్ వరకు వెళ్లిందా? ప్రశాంత్ నీల్ టీం అందుకే టీజర్ లాంచ్ కి సిద్ధమైందా... అంతా బాగుంటే, లాస్ట్ ఇయర్ మేకే డ్రాగన్ గ్లింప్స్ వచ్చి ఉండేది, ఈ మధ్యలో టీజర్ పేలుండేంది.. కాని ఏడాది తర్వాత ఇప్పడు డ్రాగన్ టీజర్ కి మోక్షం దొరికేలా ఉంది. అందుకు ఎన్టీఆర్ బర్త్ డే నే సరైన అకేషన్ గా అంతా ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు... ఈ సారి డబుల్ ఇంపాక్ట్ క్రియేట్ అయ్యేలా డ్రాగన్ టీం ఏం చేయబోతోంది? టీజర్ పూనాకాలకు ముహుర్తం ఎప్పుడు కుదిరింది..?

డ్రాగన్ టీజర్ ఎప్పుడు..? ఈ ప్రశ్నకు లాస్ట్ ఇయరే సమాధానం రావాలి.. కాని ఏడాది ఆలస్యంగా ఆన్సర్ దొరకుతోంది. కాకపోతే ఈసారి మాత్రం సాలిడ్ గా సమాధానం దొరికేలా ఉంది. మే 19న డ్రాగన్ టీజర్ పేలటం మాత్రం పక్కా... లాస్ట్ ఇయరే గ్లింప్స్ ని ఎన్టీఆర్ బర్త్ డేకి సిద్దం చేశారు. కాని వార్2 మూవీ టీం ఆసినిమా మీద తప్ప జనాల అటెన్షన్ మరోవైపు ఉండకూడదనే రిక్వెస్ట్ తో ప్రశాంత్ నీల్ టీం, డ్రాగన్ గ్లింప్స్ వదల్లేదు.

అక్కడ ఆగిన గ్లింప్స్, ఇప్పుడు టీజర్ రూపంలో మే 20న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా, రిలీజ్ కాబోతోంది. ఒక రోజు ముందే లేదంటే, మే 20న ఉదయమే టీజర్ లాంచ్ చేయాలని ఫిల్మ్ టీం డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. అంతేకాదు డ్రాగన్ టీం హిందీ మూవీ ధురందర్ స్టైల్ ని ఫాలో అవుతున్నట్టుంది. ఆల్రెడీ ఇది రెండు భాగాలుగా ప్లాన్ చేసిన మూవీ అనంటున్నారు.అంటే ముందు ఒక భాగం తీసి, తర్వాత మరో పార్ట్ తీయటం కాదు.. ధురందర్ టీం ఎలాగైతే ఆ సినిమా రెండు భాగాల షూటింగ్ ఒకే సారి పూర్తి చేసి, రెండు మూడు నెలల గ్యాప్ లో రెండు భాగాలు రిలీజ్ చేయటం. అంటే ధురందర్ డిసెంబర్ 5న రిలీజై 1200 కోట్లు రాబట్టి, ఇప్పుడు ఈ ఏడాది మార్చ్ లో సెకండ్ పార్ట్ రూపంలో మరోసారి ఎటాక్ చేయబోతోంది.

అంటే 90రోజుల గ్యాప్ లో ధురందర్ రెండు భాగాలుగా వచ్చినట్టు ... అలా రెండు భాగాలు వెంట వెంటనే రావాలంటే, ఒకే సారి రెండు భాగాలు షూటింగ్ చేయాలి.. అందుకే ఈ సమ్మర్ లోనే మొదటి భాగం పూర్తి చేసి, దసరాలోపు రెండో భాగం పూర్తి చేయాలనే టార్గెట్ పెట్టుకుంది ప్రశాంత్ నీల్ టీం. అందుకే సమ్మర్ రిలీజ్ వదులుకుని, మొత్తం రెండు భాగాలు షూటింగ్ అయిపోయాకే, మొదటి భాగం, రెండో బాగం బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ చేయాలని నిర్ణయం మార్చింది ఫిల్మ్ టీం.అంటే వచ్చే సంక్రాంతకి మొదటి భాగం, ఉగాది లేదంటే ఏప్రిల్ ఎండ్ కి రెండో భాగం రావటం ఫైనల్ అయినట్టే.. ఇలాంటి డబుల్ ఇంపాక్ట్ కి ప్రిపేర్ అయ్యింది కాబట్టే, ఇప్పటి నుంచే ప్రమోషన్ పెంచే పని చేస్తున్నట్టున్నారు. అందుకే ఉగాదికి గ్లింప్స్, ఎన్టీఆర్ బర్త్ డే కి టీజర్ ని లాంచ్ చేయటం ఆల్ మోస్ట్ ఫైనలైపోయింది. ఇక రావాల్సింది ఎనౌన్స్ మెంటే.

Published : 
  • 13 February 2026, 5:00 PM IST