పాన్ఇండియా విషయంలో ఎవరు నెంబర్ వన్, ఆ తర్వాత ఎవరేంటే వరుసగా ప్రభాస్,యష్, ఎన్టీఆర్, బన్నీ, రణ్ వీర్ సింగ్ పేర్లే వినిపిస్తున్నాయి... అన్ని భాషల్లో హిట్ కొట్టడమే కాదు. వెయ్యికోట్ల వసూళ్లని టచ్ చేసుండాలి.. ఇక్కడ రెండు సార్లు 1000 కోట్లు రాబట్టినా షారుఖ్ పేరు ఈ లిస్ట్ లో చేరలేదు..త్రిబుల్ ఆర్ తో 1400 కోట్లు టచ్ చేసినా రామ్ చరణ్ పేరు ఈ లిస్ట్ లో చేరలేదు.. ఇంకో విషయం ఏంటంటే, పాన్ ఇండియా ప్రాజెక్టులే చేయకున్నా, ఇప్పుడు పాన్ వరల్డ్ పోటుగాల్ల లిస్ట్ లో చేరిపోయాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు...మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, రెబల్ స్టార్ ప్రభాస్, సూపర్ స్టార్ మహేశ్ బాబు ఈ ముగ్గురిలోనే పాన్ వరల్డ్ పోటుగాడు ఎవరనే ఒక అంచనా ఉంది..రణ్ బీర్ కపూర్ రామాయణం లిస్ట్ లో ఉండొచ్చు.. అందులో రావణుడిగా యష్ కనిపించొచ్చు.ఐనా పాన్ వరల్డ్ అంటే ఆ ముగ్గరు మొనగాళ్ల పేర్లే వినిపిస్తున్నాయి.. ఎందుకు?
3000 వేలకోట్లు ఎవరు రాబడితే వాళ్లే పోటుగాల్లు... ఆల్రెడీ దంగల్ మూవీ 2070 కోట్లు రాబట్టింది. బాహుబలి 1850 కోట్లు రాబడితే, 1743 కోట్లతో మూడో స్తానంలో దురందర్ 2, 1742 కోట్లతో నాలుగో స్థానంలో పుష్ప2 ఉన్నాయి.. ఐతే ఇవన్నీ పాన్ ఇండియా హిట్స్ లిస్ట్.. ఈ స్టేజ్ నుంచి హీరోలు పాన్ వరల్డ్ స్టార్లు గా ఎదగాలంటే, 3000 కోట్లు కొట్టి చూపించాలి.అక్కడే సూపర్ స్టార్ మహేశ్ బాబు, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, రెబల్ స్టార్ ప్రభాస్ పేర్లే వినిపిస్తున్నాయి. ఇదే విచిత్రం... రెబల్ స్టార్ పాన్ ఇండియా కింగ్ కావొచ్చు.. ఎన్టీఆర్ వరుసగా రెండు పాన్ ఇండియా హిట్లు సొంతం చేసుకోవచ్చు.. కాని రామ్ చరణ్ కి కూడా త్రిబుల్ ఆర్ తో గ్లోబల్ హిట్ పడింది... షారుఖ్ ఖాన్ ఏకంగా 2 సినిమాలతో 1000 కోట్ల వసూల్లని ఎప్పుడో దాటేశాడు.
అయినా పాన్ వరల్డ్ పోటుగాల్ల లిస్ట్ లో ఇటు బాలీవుడ్ బాద్ షా పేరు కాని, త్రిబుల్ ఆర్ లో ఎన్టీఆర్ తో పాటు దూసుకెళ్లిన రామ్ చరణ్ పేరు కాని కనిపించట్లేదు.. వినిపించట్లేదు.. కేజీయఫ్ రెండు భాగాలతో యష్, పుష్ఫరాజ్ గా 2 సార్లు పాన్ ఇండియాని షేక్ చేసిన బన్నీ, ఇద్దరు ఇంకా పాన్ వరల్ల్ పోటుగాల్ల లిస్ట్ లో చేరేందుకు వేయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు..ఇదే ఆశ్చర్యంగా ఉంది.. ఎందుకంటే మహేవ్ బాబు ఇంతవరకు పాన్ ఇండియా మూవీనే చేయలేదు. కాని తను పాన్ వరల్డ్ పోటుగాడనిపించుకోవటంలో అందరికంటేముందున్నాడు.. ఎంతైనా రాజమౌళితో 1400 కోట్ల భారీ స్కేల్ లో మూవీ చేస్తున్నాడు.. వరల్డ్ వైడ్ గా వారణాసి 2027 ఏప్రిల్ లోరిలీజ్ అవుతుంది... కనీసం 5 వేల కోట్లు కాలం కలిసొస్తే, 10 వేల కోట్ల వసూల్లు మించే ఛాన్స్ఉంది కాబట్టి... ఇదే పాన్ వరల్డ్ మార్కెట్ ని షేక్ చేసే తొలి ప్రాజెక్ట్ గా ఫోకస్అవుతోంది.
ధంగల్ 2000 కోట్లు రాబట్టింది కాబట్టి, అందుకు కనీసం మరో వెయ్యికోట్లు అదనంగా రాబడితే తప్ప పాన్ వరల్డ్ రేంజ్ ఏ ఇండియన్ సినిమాకు రాకపోవచ్చు..ఐతే 3 వేల కోట్ల నుంచి 5 వేల కోట్లు లేదా, పదివేల కోట్ల మధ్య కలెక్సన్స్ రాబట్టే సీన్ ఉన్న మూవీలుగు వారణాసి, డ్రాగన్, స్పిరిట్ మీద అంచనాలున్నాయి. వారణాసికంటే ముందే సంక్రాంతికే డ్రాగన్ వస్తే, 3 వేలకోట్ల వసూల్లని ఇది మించితే, పాన్ వరల్డ్ ట్రెండ్ డ్రాగన్ తోనే మొదలైందనే క్రెడిట్ దక్కుతుంది. హిస్టరీలో డ్రాగన్ పేరు రీసౌండ్ చేస్తుంది.. స్పిరిట్ కూడా సందీప్ మేకింగ్ లోవస్తోంది కాబట్టి, బాహుబలికి 3 రెట్లు అంటే కనీసం 5 వేలకోట్ల వసూళ్ల అంచనాలతో వస్తోందీ సినిమా... కాబట్టే రామాయణం టీజర్ చూశాక రణ్ బీర్ కపూర్ మీద పాన్ వరల్డ్ ఆశలు గల్లంతవుతున్నాయి... మిగతా స్టార్స్ అసలీ లిస్ట్ లోనే లేకపోవటంతో, ఎన్టీఆర్, మహేశ్, ప్రభాస్ మాత్రమే పాన్ వరల్డ్ పోటుగాల్ల లిస్ట్ లో ఉండటం వెనక, ఒక రీజన్, రియాలిటీ కనిపిస్తోంది.