HOLLYWOOD మాస్ జాతర.. ఇద్దరు లెజెండ్స్…?

1400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న వారణాసి కోసం అవతార్ ఫేం జేమ్స్ కామెరున్ వస్తాడన్నారు. కాని కాన్సెప్ట్ గ్లింప్స్ ని టీమే రిలీజ్ చేసింది.

Post Published By: dialnews
Updated : 5 March 2026, 4:40 PM IST

1400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న వారణాసి కోసం అవతార్ ఫేం జేమ్స్ కామెరున్ వస్తాడన్నారు. కాని కాన్సెప్ట్ గ్లింప్స్ ని టీమే రిలీజ్ చేసింది. అసలు గ్లింప్స్ లేదంటే టీజర్ ని మాత్రం అవతార్ ఫేం జేమ్స్ కామెరున్ చేతుల మీదుగానే రిలీజ్ చేసే ప్రయత్నం మాత్రం గట్టిగానేజరుగుతోంది. జూన్ లో గ్రాండ్ ఈవెంట్ ఏదో ప్లాన్ చేస్తున్నారన్నారు.. ఈలోపు సినిమా విజువల్స్ ఉన్న గ్లింప్స్ కూడా రావొచ్చు.. ఐతే ఇంతలో మరో హాలీవుడ్ డైరెక్టర్ సీన్ లోకి వచ్చాడు. ఇన్ సెప్షన్, టెనెట్, ఇంటర్ స్టెల్లార్ లాంటి విజువల్ వండర్స్ తీసిన క్రిస్టోఫర్ నోలాన్ ఇండియాకి ల్యాండ్ అవబోతున్నాడు. కేవలం ఇక్కడ అడుగు పెట్టడమే కాదు,2 వేల కోట్ల హిందీ రామాయణాన్ని తానే స్వయంగా ఎడిట్ చేయబోతున్నాడు.. అంటే మన సినిమా పాన్ వరల్డ్ లెవల్ కి వెళ్లాలంటే హాలీవుడ్ లివింగ్ లెజెండ్స్ రంగంలోకి దిగాల్సిందేనా?

పాన్ ఇండియా సినిమా కోసం దేశం లో ఉన్న నటులంతా ఒక సినిమాలో కనిపించాలి.. ఇది పాన్ ఇండియా మార్కెటింగ్ స్ట్రాటజీ.. అలానే పాన్ వరల్డ్ మూవీ తీస్తే ప్రపంచ నటులంతా మన సినిమాలో కనిపించాలా? అక్కర్లేదు.. దానిక ఆల్టర్ నేటీవ్ గా హాలీవుడ్ దిగ్గజాలను మన దిగ్గజాలు రంగంలోకి దింపుతున్నారు.ముందు 1400 కోట్ల భారీ బడ్జెట్ తో తీస్తున్న వారనాసి కోసం హాలీవుడ్ లివింగ్ లెజెండ్ జేమ్స్ కామెరున్ రంగంలోకి దిగుతున్నాడు. నిజానికి తను ఈసినిమా కాన్సెప్ట్ గ్లింప్స్ టైంలోనే రంగంలోకి దిగాలి. కాని అవతార్ 3 రిజల్ట్ ఘోరంగా ఉండటంతో, తను సీన్ లోకి రాలేదు. కాని వారణాసి టీజర్ లాంచ్ మాత్రం తన చేతుల మీదుగానే చేయబోతున్నారు.

కేవలం గెస్ట్ లా వచ్చి పోవటం, కాదు తన సంస్త కూడా ఈ సినిమాను కెనెడా,యూఎస్,యూరప్ లో డిస్ట్రిబ్యూట్ చేయబోతోంది. అలా రాజమౌలికి జేమ్స్ కామెరున్ సాయం చేయబోతున్నాడు. నిజంచెప్పాలంటే టైటానిక్, టర్మినేటర్, అవతార్ లాంటి వరల్డ్ క్లాసిక్స్ తీసిన జేమ్స్ కామెరున్ వారణాసిని డిస్ట్రిబ్యూట్ చేయించటమే కాదు, ఇలా ప్రమోట్ చేయటం లాంటివి చేస్తే, వరల్డ్ ఆడియన్స్ కి ఈజీగా రీచ్ పెరుగుతుంది.ఇదిచూసే మరి ప్లాన్ చేశారో ఏమో కాని, దంగల్ ఫేం నితీష్ తీవారి కూడా తను తీస్తున్న రామాయణం కోసం హాలీవుడ్ దిగ్గజాలను దింపేస్తున్నాడు. ఆల్రెడీ దంగల్ 2 వేల కోట్ల రికార్డుతో ఇండియా నెంబర్ 1. ప్లేస్ లో ఉంది. 1850 కోట్ల వసూళ్లతో బాహుబలి 2 నెం. 2 ప్లేస్ లో ఉంది. ఈరెండు సినిమాలు తీసిన నితీష్, రాజమౌళి మధ్యే ఇప్పుడు పాన్ వరల్డ్ లెవల్లో పోటీ జరుగుతున్నట్టుంది.

అందుకే వారణాసి కోసం హాలీవుడ్ ఫేం జేమ్స్ కామెరున్ ని రంగంలోకి రాజమౌళి దింపుతుంటే, మరో హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలాన్ ని సీన్ లోకి తెస్తున్నాడు నితీష్ తీవారి.. ఇంటర్ స్టెల్లార్, ఇన్ సెప్షన్, టెనెట్, ఓపెన్ హైమర్ లాంటి వరల్డ్ క్లాసిక్స్ తీసిన క్రిస్టోఫర్ నోలాన్ ఇప్పుడు హిందీ రామాయాణం కోసం రంగంలోకి దిగుతున్నాడు. ఈ సినిమాను తానే ఎడిట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే, హిందీ రామాయణం లెవలే మారిపోతుంది. వరల్డ్ వైడ్ గా ఈ సీనిమా స్థాయే పెరిగిపోతుంది...కారణం ఏదైనా, హాలీవుడ్ దిగ్గజాలైన,జేమ్స్ కామెరున్, క్రిస్టోఫర్ నోలాల్ ను ఇండియన్ సినిమాలకోసం అడుగు ముందుకేస్తున్నారు.మనవాళ్లు కూడా పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ ల రేంజ్ పెంచేందుకు మంచి స్కెచ్చే వేస్తూ పోటీపడుతున్నారు.

Published : 
  • 5 March 2026, 4:40 PM IST