రాజమౌళి సినిమాటిక్ యూనివర్స్..? సునామీ సిగ్నల్స్..!

వారణాసి వచ్చి పాన్ వరల్డ్ లెవల్లో ట్రెండ్ సెట్ చేసినా, 5, నుంచి 6 వేల కోట్ల పైనే వసూళ్లు రాబట్టినా, ఇక కొత్త చరిత్ర మొదలైనట్టే.. సరికొత్త శకం షురూ అయినట్టే. ఎందుకంటే, రాజమౌళి సినిమాటిక్ యూనివర్స్ కి డోర్లు తెరుచుకోబోతున్నాయి.

Post Published By: dialnews
Updated : 12 March 2026, 3:40 PM IST

వారణాసి వచ్చి పాన్ వరల్డ్ లెవల్లో ట్రెండ్ సెట్ చేసినా, 5, నుంచి 6 వేల కోట్ల పైనే వసూళ్లు రాబట్టినా, ఇక కొత్త చరిత్ర మొదలైనట్టే.. సరికొత్త శకం షురూ అయినట్టే. ఎందుకంటే, రాజమౌళి సినిమాటిక్ యూనివర్స్ కి డోర్లు తెరుచుకోబోతున్నాయి.. ముందుగా అయితే ఎన్టీఆర్ తో కొత్త సినమా, తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ తో మరో మూవీ ఉంటుందన్నారు. అదే నిజమైతే, సినిమాటిక్ యూనివర్స్ అబద్దం అయ్యే ఛాన్స్ ఉంది.
కాని ఇద్దరు హీరోలతో వేరు వేరు మూవీలు తీస్తూనే, వాటిని సినిమాటిక్ యూనివర్స్ లింక్ తో సింక్ చేయబోతున్న రాజమౌళి అనంటున్నారు.. ఇంకా వారణాసి షూటింగ్ పూర్తికాలేదు.. దాని రిలీజ్ కి ఏడాది టైం ఉంది.. ఇంతలోనే రాజమౌళి నెక్ట్స్ ప్రాజెక్ట్ మీద డిస్కర్షన్ అతిలా అనిపించేచాన్స్ఉంది. అలాంటి టైంలో అది కూడా సినిమాటిక్ యూనివర్స్ అంటే అతిశయోక్తిలా అనిపించొచ్చు.. కాని రాజమౌళి విషయంలో ఏదైనా రెండేళ్ల ముందు నుంచే ప్లానింగ్ ఉంటుంది కాబట్టి, తన ఫ్యూచర్ ప్లానింగ్ మీద ప్రిడిక్షన్ లో తప్పులేదనే వాదనుంది.. అదే నిజమయ్యేలాఉంది.

జస్ట్ ఇమాజిన్ ఎన్టీఆర్ మూవీలో సడన్ గా రెబల్ స్టార్ ప్రభాస్ వస్తే ఎలా ఉంటుంది.. అదే రెబల్ స్టార్ ప్రభాస్ మూవీలో ఎన్టీఆర్ తలుక్కుమంటే... రెండు వార్ మిషిన్స్ బాక్సాఫీస్ మీద దండెత్తినట్టే.. ఇద్దరూ ఊరా నాటు మాస్ ఫాలోయింగ్ ఉన్న స్టార్స్ వాళ్లకి రాజమౌళి డైరెక్షన్ తోడైతే ఎలా ఉంటుంతో చాలా సార్లు చూశాం. అలాంటిది ఈ ఇద్దరు కలిసి రాజమౌళి మూవీలో మెరిస్తే, మతిపోవాల్సిందే. అలాని అది మల్టీ స్టారర్ మూవీ కాదు.. రాజమౌళి సినిమాటిక్ యూనివర్స్.. అదే ఇప్పుడు జరిగేలా ఉందనంటున్నారు.ఖైదీ మూవీని లియో సినిమాను జస్ట్ చిన్న పాత్రతో లింక్ చేస్తే పూనకాలొచ్చాయి.. ఓ మాదిరి హిట్లతోనే దూసుకెళ్లిన లోకేష్ తన సినిమాటిక్ యూనివర్స్ లోఇలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తే... రాజమౌళి పాన్ ఇండియా ట్రెండ్ సెట్టర్.. మరి తన సినిమాటిక్ యూనివర్స్ ఇంకెంతగా ఇండస్ట్రీని షేక్ చేస్తుంది.. తన ఒక్కో సినిమా ఒక్కో సునామీ క్రియేట్ చేసింది. ఫెల్యూరే లేని దర్శకుడు.. అలాంటి తను ఇప్పుడు సడన్ గా సినిమాటిక్ యూనివర్స్ తో షాక్ ఇవ్వాలనుకుంటే ఎలా ఉంటుంది.

ఆ ఊహే ఇండియన్ బాక్సాఫీస్ ని పీస్ పీస్ చేసేలా ఉంది. నిజంగా ఇది జరగబోతోందా? అంటే ఇలాంటి ఒక డిస్కర్షన్ తన టీం చేయటం, ఆ ఫీలర్స్ ఫిల్మ్ నగర్ ని షేక్ చేయటంతోనే ఉప్పందింది.. అలాని ఇది జరుగుతుందని కాదు.. కాకపోతే రాజమౌలి ఒకసారి ఇటు వైపు కూడా ఆలోచిస్తే ఇక బాక్సాఫీస్ మీద శిఖరాలే దాడి చేసినట్టవుతుంది.ఒక మగధీర, ఒక ఈగ, ఒక బాహుబలి, త్రిబుల్ ఆర్ లోని భీమ్, రామ్, ఇప్పడొస్తున్న వారణాసిలో రుద్రుడు.. వీళ్లంతా ఒకే మూవీలో ఉంటే రాజమౌలఇ సినిమా టిక్ యూనివర్స్ కాస్త, హాలీవుడ్ అవేంజర్స్ నేమించిపోతుంది.. కాకపోతే రాజమౌలఇ గత సినిమాలను, ఇప్పడు కలపటం కాకుండా, భవిష్యత్తులో తీసేమూవీలను కలిపే ప్రయత్నమే జరుగుతున్నట్టుంది.

2027 లో ఎన్టీఆర్ తో ఒక ప్రాజెక్ట్, తర్వాత రెబల్ స్టార్ తో 2030 లో మరో ప్రాజెక్ట ఈ రెండూ రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్టు ప్రచారం వరకైతే జరుగుతోంది. ఎంత వరకు ప్రాక్టికల్ గా ఛాన్స్ఉందనేది వారణాసి తర్వాతే తేలుతుంది. కాకపోతే, ఎన్టీఆర్ తో రాజమౌళి సినిమా తీస్తే, అందులో ఒక పాత్ర ప్రభాస్ గెస్ట్ లా కనిపించేచాన్స్ ఉందంటున్నారు. 2030 లో ప్రభాస్ చేసేమూవీలో ఎన్టీఆర్ అలానే ఒక పాత్రలో కనిపిస్తాడా? అదే జరిగితే ఈ రెండుపాత్రలతో రాజమౌలి సినిమాటిక్ యూనివర్స్ కి ఛాన్స్ఉందా? ఇవన్నీ టూ అర్లీ టూ టాక్.. కాని ఇలాంటి ఒక డిస్కర్షన్ జక్కన్న తండ్రి విజయేంద్ర ప్రసాద్ డిస్కర్షన్ లో రావటం వల్లే, ఇలాంటి స్పెక్కూలేషన్స్ వస్తున్నాయి.

Published : 
  • 12 March 2026, 3:40 PM IST