నాలుగు నిమిషాల ముప్పైఐదు సెకన్ల లెంథీ గ్లింప్స్ రాబోతోందంటే ఎవరూ నమ్మలేదు. డ్రాగన్ మీద వస్తున్న మరో రూమర్ ఇదనుకున్నారు. కాని ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా వచ్చిన గ్లింప్స్ ఇండస్ట్రీ రికార్డులనే బ్రేక్ చేసేలా ఉంది. ఇలాంటి లెంథీ గ్లింప్స్ లో ట్రెండ్ సెట్ చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. దీనికి గ్రీన్ సిగ్న్ ఇచ్చి ఎన్టీఆర్ కూడా మైండ్ బ్లాంక్ చేస్తున్నాడు. అయితే ఈ విషయంలో వారణాసిది కూడా ఇదే దారా? కేజీయఫ్ టైంలో సినిమాను ఎలా ప్రమోట్ చేయాలి? ఎలా నార్త్ మార్కెట్ కోసం పబ్లిసిటీ ప్లాన్ చేయాలనే సలహాలిచ్చాడు రాజమౌలి. ఓరకంగా కేజీయఫ్ రెండు బాగాలు మొత్తంగా 1800 కోట్ల వరకు రాబట్టాయంటే, తెరవెనక రాజమౌళి గైడెన్సే కారణం.. కట్ చేస్తే ఇప్పుడు అలాంటి రాజమౌలికి, ప్రశాంత్ నీల్ మార్గదర్శిగా మారాడా? డ్రాగన్ గ్లింప్స్ ప్లానింగ్ కి రాజమౌళి ఫిదా అయ్యాడా? కాబట్టే వారణాసి టీజర్ కి ఇదే ఐడియా అప్లై చేయబోతున్నారా? ప్రస్థుతానికి ఇది ప్రచారమే... కాని ఖచ్చితంగా జరిగే అవకాశం ఉన్న అంశమే అని తెలుస్తోంది.. ఇంతకి డ్రాగన్ దెబ్బకి వారనాసి టీం లో ఎలా అలజడి మొదలైంది?
వారణాసి మూవీ టీం సడన్ గా అలర్డ్ అయ్యింది. డ్రాగన్ గ్లింప్స్ ఇంపాక్ట్ ముందుగా వారణాసి టీం కే తగిలినట్టుంది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీలోనే ఇంత లెంథీ గ్లింప్స్ ఎవరూ రిలీజ్ చేయలేదు. గ్లింప్స్ దశలోనే పాత్రలు, కథలోని ట్విస్టులు ఇలా రివీల్ చేయలేదు. కాని ఇంకా చెప్పేందుకు ఎంతో కథ ఉందనే ఇంపాక్ట్ మాత్రం డ్రాగన్ గ్లింప్స్ క్రియేట్ చేసింది.ఇది ఆల్ మోస్ట్ అసాధ్యం.. క్వీంటాల్ల కొద్ద కథని ముందే చెప్పినా, ఇంకా టన్నుల కొద్ద కథ ఉందనేలా చేయటం చిన్న విషయం కాదు. ఇక్కడే ప్రశాంత్ నీల్ సక్సెస్ అయ్యాడు.తన ఆలోచనకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఎన్టీఆర్ కూడా చాలా పెద్ద రిస్కేచేశాడు. అదే ఇప్పుడు వారణాసి టీంని ఆలోచనల్లో పడేసింది. ఎందుకంటే ఈ సినిమా ఏకంగా 80శాతం షూటింగ్ అయిపోయింది.అయినా గ్లింప్స్ ని భారీ ఈవెంట్ తో రిలీజ్ చేయగలిగారే తప్పా, అసలు విజువల్స్ ఒక్కటి వదల్లేదు. అన్నీ ఇమేజెసే... అందుకే టీజర్ ని నెక్ట్స్ లెవల్లో ప్లాన్ చేయాలనుకుంటున్నారని తెలుస్తోంది. సలార్ లో ఎన్నో పాత్రలు ఉండటంతో ఆడియన్స్ కన్ ఫ్యూజయ్యారు. గతంలో ఇలాంటి తప్పే మణిరత్నం పొన్నియన్ సెల్వం మూవీలో చేశాడు. కాబట్టే ఆడియన్స్ కన్ ఫ్యూజ్ అయ్యారు. అందుకే అలాంటి పొరపాటుని సరిచేసేందుకు, ప్రతీ పాత్రని, డ్రాగన్ గ్లింప్స్ దశలోనే పూసగుచ్చి నట్టు చెప్పేశాడు ప్రశాంత్ నీల్.
అయితే వారణాసికి కూడా ఇలాంటి సమస్య ఉండేలా ఉంది. ఎందుకంటే వారనాసిలో పాత్రలే కాదు, టైమ్ లైన్స్ కూడా కన్ ఫ్యూజ్ చేసే ఛాన్స్ ఉంది. 7 వేల ఏళ్ల క్రితం, 4 వేల ఏళ్ల క్రితం.. ఇక రామాయణం ఎపిసోడ్, శివుడి పాత్ర, ఆఫ్రికా అడవుల్లో వింతలు, ప్రపంచ ఏడు వింతలు, ఇక చిన్నమస్త దేవితో కథకున్న కనెక్షన్ ఇలా లెక్కలేనన్ని ఎపిసోడ్లు, లెక్కలేనన్ని టైమ్ లైన్స్...అవే ఆడియన్స్ ని కన్ ఫ్యూజ్ చేసే ఛాన్స్ఉంది. కాబట్టి రాజమౌళి కూడా తన వారణాసి కథని, టీజర్ రూపంలో ముందే తేల్చాలనుకుంటున్నాడట. తనకి ఇదేం కొత్త కాదు స్టూడెంట్ నెం.1 నుంచి త్రిబుల్ ఆర్ వరకు మొత్తం కథని ముందే చెప్పి, తర్వాతే సినిమాని రిలీజ్ చేయటం రాజమౌళి స్టైల్.. కాబట్టి డ్రాగన్ గ్లింప్స్ స్టైల్ నచ్చి, వారణాసి టీజర్ ని ఇలానే లెంథీగా, అందులోనూ చాలా పాత్రలు, కాలాలు ముందే ఆడియన్స్ కి పరిచయం చేయాలనుకుంటున్నాడట. ఇలాంటి ఒక డిస్కర్షన్ మాత్రం వారణాసి టీంలో జరగటం వందకు వందశాతం నిజం. ఆ విషయమే ఫీలర్స్ రూపంలో తన టీమ్ మెంబర్సే బయటికి వదిలారు.. ఏదేమైనా బాహుబలి స్టైల్లో కేజీయఫ్ ప్రమోషన్ ఉండేలా ప్రశాంత్ నీల్ కి రాజమౌళి సాయం చేశాడు. ఇప్పుడేమో డ్రాగన్ గ్లింప్స్ ఫార్ములాతో రాజమౌళికే ప్రశాంత్ నీల్ గైడ్ గా మారేలా ఉన్నాడు. తనదారిలో రాజమౌళి నడిస్తే అదే నిజమౌతుంది... అదే జరిగేలా ఉంది.