విక్టరీ వెంకటేష్ మరియు త్రివిక్రమ్.. ఈ ఇద్దరి పేర్లు వింటేనే మనకు 'నువ్వు నాకు నచ్చావ్', 'మల్లీశ్వరి' వంటి క్లాసిక్ సినిమాలు గుర్తొస్తాయి. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఈ క్రేజీ కాంబోలో వస్తున్న సినిమా 'ఆదర్శ కుటుంబం'. సినిమాలోని మొదటి పాట 'వెంకీ రా మామ' లేదా 'ఫ్యామిలీ ఆంథమ్' పేరుతో ఒక మెలోడీ సాంగ్ త్వరలో రాబోతోంది.
త్రివిక్రమ్ సినిమాల్లో ఉండే ఫ్యామిలీ ఎమోషన్స్ మరియు మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ అందించిన క్లాసిక్ టచ్ ఈ ఆల్బమ్ కి మెయిన్ అసెట్. ఈ ఆల్బమ్‌లో మొత్తం 5 నుంచి 6 పాటలు ఉంటాయని సమాచారం. సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే 40% షూటింగ్ పూర్తయింది. తాజా అప్‌డేట్ ప్రకారం, చిత్ర యూనిట్ ఒక ముఖ్యమైన షెడ్యూల్ కోసం దుబాయ్ వెళ్ళబోతోంది.
అక్కడ కొన్ని కీలకమైన సన్నివేశాలతో పాటు ఒక బ్యూటిఫుల్ డ్యూయెట్ సాంగ్ ని కూడా చిత్రీకరించనున్నారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా, యోగి బాబు మరియు సత్య వంటి కామెడీ స్టార్స్ ఈ చిత్రంలో జాయిన్ అయ్యారు. ఈ సినిమాని 2026 సమ్మర్ కానుకగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మూవీకి సంబంధించిన ప్రతీ అప్డేట్ ను చూస్తున్న సినీ అభిమానులు వింటేజ్ వెంకీ మ్యాజిక్ మళ్ళీ రిపీట్ అవ్వబోతుందని ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు.