అవతార్ మొదలైనప్పటి నుంచి దానికే అంకితమైన హాలీవుడ్ దిగ్గజం లానే, రాజమౌళి కూడా ఇక ఒకే ఒక్క జోనర్ లో మూవీకి పరిమితయ్యేలా ఉన్నాడా? జేమ్స్ కామెరున్ కి అవతార్ ఎలాగో, రాజమౌళికి మహాభారతం అలా మారబోతోందా? సీన్ చూస్తే అలానే ఉంది.. నిజానికి రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం.. మన మహాకావ్యాన్ని సినిమాగా తీయాలని ఎంత అనుకున్నా, అది తీసేంత శక్తి, గ్నానం తనకింకా రాలేదని ఎప్పుడో అన్నాడు రాజమౌళి. అలాంటి తనిప్పడు డ్రీమ్ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించేందుకు సిద్దమయ్యాడా? వారణాసి తర్వాత కనీసం రెండు సినిమాలు తీశాక, ఇక తన రెగ్యులర్ రొటీన్ సినీ జర్నీకి బ్రేక్ పడేలా ఉంది. ఎందుకంటే మరో మూడు నాలుగేళ్ల తర్వాత రాజమౌళి పూర్తిగా ఒకే ప్రాజెక్ట్ కోసం పదేళ్లు కష్టపడబోతున్నాడు. అది కూడా ఒకే కథని పది భాగాలుగా తీస్తూ... ఇదే జరగబోతోంది. ఒకే సారి రెండు భాగాల షూటింగ్ చేసి, మిగతా 8 భాగాలను మాత్రం ఏడాదలో 6 నెలల చొప్పున షూటింగ్ ప్లాన్ చేస్తాడా? వారణాసి సగం మాత్రమే పూర్తైనప్పుడు, ఇంకా మరో రెండు ప్రాజెక్టులు తీసేందుకు రాజమౌళి సిద్దపడుతున్నప్పుడు, అప్పుడే మహాభారతం మేకింగ్ ప్లానింగ్ ఎలా బయటికొస్తోంది? అంతా గాలి వార్తేనా..లేదంటే గాలిలో స్ప్రెడ్ అవుతున్న అసలు సిసలు వార్తేనా?
అవతార్ మూవీ మొదలు కాకముందు వరకు హాలీవుడ్ దిగ్గజం జేమ్స్ కామెరున్న టైటానిక్ మూవీ తీశాడు. టర్మినేటర్ సీరీస్ తో షాక్ ఇచ్చాడు. ట్రూ లైస్ నుంచి పిరానా వరకు చాలా ప్రయోగాలు చేశాడు. వన్స్ అవతార్ మొదలైంది... అంతే ఇక తన రెగ్యులర్ ఫిల్మ్ మేకింగ్ జర్నీకి బ్రేక్ పడింది. టైటానిక్ తర్వత 2005 నుంచి అవతార్ మాయలో పడ్డాడు.. అంటే అప్పటి నుంచి ఇరవైఏళ్లుగా అవతార్ 2, అవతార్ 3 అంటూ అవతార్ సీక్వెల్స్ తోనే తన జర్నీ సరిపోతుంది. ఇంకా అవతార్ 4,5 కూడా రాబోతున్నాయి... అచ్చంగా ఇలాంటి పరిస్థితే మరో నాలుగేళ్లలో రాజమౌళికి రాబోతున్నట్టుంది.సూపర్ స్టార్ మహేశ్ బాబు వారణాసి మూవీ 2027 మార్చ్ లో వస్తుంది. తర్వాత రాజమౌళికి ఐతే మ్యాన్ఆఫ్ మాసెస్, లేదంటే రెబల్ స్టార్ ప్రభాస్.. ఈ ఇద్దరే బెస్ట్ ఆఫ్షన్స్ లా కనిపిస్తున్నాయి. ఎందుకనేది వాల్ల మధ్య ఉన్న బాండింగ్, అలానే కమిట్మెంట్స్ కే తెలుసు.. అయితే పాన్ ఇండియా ట్రెండ్ సెట్టర్ ఇప్పుడు పాన్ వరల్డ్ లో కూడా మూడంటేమూడు సినిమాలు తీసి రిటైర్ అవబోతున్నాడా? ఒక్కసారి ఊహించుకోండి..
రాజమౌళి నెక్ట్స్ సినిమా ఏంటని వారణాసి తీస్తున్నప్పుడే డిస్కర్షన్స్ చేస్తున్నారు. అంతగా ఆడియన్స్ ఆగలేకపోతున్నారు. అలాంటి దర్శకుడు సడన్ గా సినిమాలు పక్కన పెట్టి రిటైర్ అయితే ఏంటి పరిస్థితి..? ప్రపంచం ఏం మునిగిపోదు కాని, సినీ పరిశ్రమకే చాలా నష్టం.. అయితే ఆ నష్టం లాంటి కష్టం రావటానికి కనీసం మరో 15ఏళ్లు పట్టే ఛాన్స్ఉంది. కాబట్టి ఇప్పటికిప్పుడొచ్చినముప్పేం లేదు.అయితే ఈ 15 ఏళ్లలో ఇక రెండు సినిమాలు వదిలేస్తే, రాజమౌలి ఒకే కథని పది భాగాలుగా తీస్తూ, తన శేష జీవితాన్ని ఆ ప్రాజెక్ట్ తోనే ముగించేయబోతున్నాడు. అదే మహకావ్యం మహాభారతం.. ఇందులో ఒక్కో పాత్రతో ఒక్కో సినిమాతీయొచ్చని, ఇలాంటి కావ్యాన్ని తెరెక్కించేంత టెక్నికల్ గా తాను ఇంకా ఎదగలేదన్న రాజమౌలి, 2032 తర్వాత మాత్రం పూర్తిగా మహాభరతం సీక్వెల్స్ తోనే బిజీ అయ్యేలా ఉన్నాడు. వారనాసి తర్వాత ఎన్టీఆర్ తో ఒక మూవీ, ప్రభాస్ తో మరో సినిమా చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.ఆతర్వాతే తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతాన్ని మొదలు పెడతాడట. అందుకు 2032 ముహుర్తం చూసుకున్నట్టు తెలుస్తోంది. ఏది కన్ఫామ్ కాలేదు. కాని తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ తన టీం, డిస్కర్షన్ వల్లే ఇలాంటి లీకులు షాకులిస్తున్నాయి. తన టీం నుంచి వచ్చిందంటే, ఖచ్చితంగా ఇది వ్యాలిడ్ పాయింటే..2032 ఏడాది నుంచి రాజమౌలి రెగ్యులర్ మూవీలకు ఇక దూరమై, జేమ్స్ కామేరున్ దారిలో నడిచినట్టే.