Top story: షాకింగ్.. త్రిషకు హ్యాండ్ ఇచ్చిన విజయ్ భార్య కోసం లండన్ వెళ్తున్న సీఎం.. విడాకుల కేసు క్లోజ్ అయిన నెల రోజులకే లండన్ టూర్..!

తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత దళపతి విజయ్ మొట్టమొదటిసారిగా విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. సెప్టెంబర్ 10 లేదా 11వ తేదీ నుండి ఆయన బ్రిటన్ పర్యటనకు వెళ్లనున్నట్లు అధికారిక వర్గాల సమాచారం.

Post Published By: dialnews
Updated : 5 September 2026, 2:25 PM IST

తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత దళపతి విజయ్ మొట్టమొదటిసారిగా విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. సెప్టెంబర్ 10 లేదా 11వ తేదీ నుండి ఆయన బ్రిటన్ పర్యటనకు వెళ్లనున్నట్లు అధికారిక వర్గాల సమాచారం. అయితే.. ఇప్పుడు ఈ లండన్ పర్యటన చుట్టూ కేవలం రాజకీయ వర్గాల్లోనే కాదు, అంతటా ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. దీనికి కారణం.. కేవలం ఒక నెల రోజుల క్రితం ఆయన వ్యక్తిగత జీవితంలో జరిగిన ఒక ఊహించని పెద్ద ట్విస్ట్. అవును, విజయ్ భార్య సంగీత తన విడాకుల పిటిషన్‌ను ఉపసంహరించుకున్న నెల రోజులకే ఈ బ్రిటన్ ప్రయాణం ఖరారు కావడం ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. అసలు ఈ లండన్ టూర్ వెనుక ఉన్న అసలు కారణాలు ఏంటి? టీవీకే పార్టీ వర్గాలు దీనిపై ఏమంటున్నాయి?

తమిళనాడు సీఎం విజయ్, ఆయన భార్య సంగీతల వివాహ బంధానికి లండన్ నగరానికి ఒక బలమైన, సుదీర్ఘమైన సెంటిమెంట్ కనెక్ట్ అయి ఉంది. వీరిద్దరి పరిచయం, ఆ తర్వాత 1999లో పెళ్లి.. ఇవన్నీ లండన్ బ్యాక్‌డ్రాప్‌తోనే ముడిపడి ఉన్నాయి. అయితే, గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయంటూ, ఫిబ్రవరి నెలలో సంగీత చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్ కూడా దాఖలు చేశారని వార్తలు వచ్చాయి. కానీ, సరిగ్గా గత ఆగస్టు నెలలో సంగీత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందుకు వచ్చి, తాను ఈ విడాకుల పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు.

దీంతో కోర్టు ఆ కేసును పూర్తిగా క్లోజ్ చేసింది. అలా విడాకుల కేసు క్లోజ్ అయిన నెల రోజుల వ్యవధిలోనే సీఎం విజయ్ లండన్ పర్యటన ఖరారు కావడం గమనార్హం. ఈ పరిణామాల నేపథ్యంలో, ప్రస్తుతం తమిళనాడు పొలిటికల్ మరియు సినీ సర్కిల్స్‌లో ఒక ప్రచారం జోరుగా సాగుతోంది. సీఎం విజయ్ లండన్ పర్యటనలో భాగంగా ప్రస్తుతం అక్కడ నివసిస్తున్న తన సతీమణి సంగీతను కలుస్తారని, విడాకుల కేసు ముగిసిన తర్వాత వీరిద్దరూ వ్యక్తిగతంగా కలిసి మాట్లాడబోతున్నారని టాక్ నడుస్తోంది.

ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారిగా లండన్‌కు వెళ్తున్న విజయ్, తన పాత జ్ఞాపకాలను మననం చేసుకుంటూ భార్యతో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారని, ఇది ఒక రకమైన ఫ్యామిలీ రీ-యూనియన్ కాబోతోందని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. విజయ్ కుమారుడు సంజయ్, కుమార్తె దివ్య సాషా గతంలో లండన్, కెనడాల్లోనే ఉన్నత చదువులు చదువుకున్నారు. అందువల్ల ఆ కుటుంబానికి బ్రిటన్‌తో పర్సనల్ ఎమోషనల్ బాండ్ కూడా ఉంది. గత రెండు మూడేళ్లుగా విజయ్, సంగీత విడివిడిగా ఉంటున్నారని, వారి మధ్య బంధం తెగిపోయిందని సాగిన ప్రచారాలకు ఈ లండన్ పర్యటనతో పూర్తి స్థాయిలో చెక్ పడనుందని విజయ్ సన్నిహిత వర్గాలు భావిస్తున్నాయి.

విజయ్ అభిమానులు కూడా ఈ వార్త వినగానే సోషల్ మీడియాలో సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఈ వ్యక్తిగత విషయాలు మరియు సోషల్ మీడియా ప్రచారాలను పక్కన పెడితే.. ఈ లండన్ పూర్ పూర్తిగా తమిళనాడు రాష్ట్ర ప్రయోజనాల కోసమే అని తమిళగ వెట్రి కళగం పార్టీ వర్గాలు మరియు ప్రభుత్వ ప్రతినిధులు బలంగా చెప్తున్నారు. సీఎం విజయ్ సెప్టెంబర్ 10 లేదా 11 నుండి దాదాపు 4 నుండి 6 రోజుల పాటు లండన్‌లో అధికారికంగా పర్యటించనున్నారు. ఈ పర్యటన యొక్క ముఖ్య ఉద్దేశ్యం.. తమిళనాడు రాష్ట్రానికి అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడం.

లండన్‌లోని ప్రముఖ అంతర్జాతీయ వ్యాపార దిగ్గజాలు, పొటెన్షియల్ ఇన్వెస్టర్లతో సీఎం విజయ్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించబోతున్నారు. రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు, టెక్నాలజీ ప్రాజెక్టులు మరియు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లను స్థాపించేలా పలు కీలక అవగాహన ఒప్పందాలపై ఆయన సంతకాలు చేయబోతున్నట్లు గైడెన్స్ తమిళనాడు వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే కేంద్ర విదేశాంగ శాఖ నుండి ఈ పర్యటనకు క్లియరెన్స్ కూడా లభించింది. సీఎం విజయ్ లండన్ పర్యటన అటు పొలిటికల్ గా ఏపీ, తమిళనాడు వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడమే కాకుండా, ఇటు పర్సనల్ గా కూడా అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది.

Published : 
  • 5 September 2026, 2:25 PM IST