Top Story: జగన్ మైండ్ సెట్ పవన్ కు క్లారిటీ ఉందా…? అందుకే కూటమిపై కోపమా…?

సాధారణంగా పొలిటికల్ లైఫ్ లో.. ప్రజల కోసం పనిచేసినా.. లేకపోయినా మార్కెటింగ్ స్కిల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అధికారంలో ఉన్నవాళ్లు.. అది ఇంకా ఎక్కువగా చేసుకోవాల్సిన అవసరం ఉంది.

Post Published By: dialnews
Updated : 9 March 2026, 9:59 AM IST

సాధారణంగా పొలిటికల్ లైఫ్ లో.. ప్రజల కోసం పనిచేసినా.. లేకపోయినా మార్కెటింగ్ స్కిల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అధికారంలో ఉన్నవాళ్లు.. అది ఇంకా ఎక్కువగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఏపీలో మాత్రం ఈ విషయంలో కూటమి సర్కార్.. వెనకబడింది అనే ఆవేదన చాలావరకు కూడా వినపడుతూనే ఉంటుంది. ఎవరో ఒకరు ఏదో ఒక సమయంలో దీనిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు.. పదేపదే ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇస్తూ ఉంటారు.

అయినా సరే ఎమ్మెల్యేలలో మార్పు ఉండదు. ఇక లేటెస్ట్ గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. కూడా తన ఒపీనియన్ షేర్ చేసుకున్నారు. అసెంబ్లీ సమావేశాలు చివరి రోజు.. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ చేసిన కామెంట్స్ పై.. ఇప్పుడు కూటమిలో పెద్ద చర్చ జరుగుతోంది. వైసీపీ వాళ్లు 11మంది ఉన్నా సరే 1100 మంది ఉన్నట్లు ప్రచారం చేసుకుంటారని పవన్ కళ్యాణ్ కామెంట్ చేశారు. కానీ కూటమిలో మాత్రం అటువంటి పరిస్థితి కనపడటం లేదనేది పవన్ లో కనపడుతోన్న కోపం.

15 ఏళ్ల పాటు మనం కలిసి పనిచేయాలని.. అలాంటప్పుడు ప్రచారం చేసుకోవాలని, పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ పై ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది. పవన్ లో ఫియర్ ఫ్యాక్టర్ ఎక్కువైందనే విషయంపైనే పాలిటిక్స్ పైను దగ్గరగా గమనిస్తున్న వారు చెప్పే మాట. దీనికి చాలా రీజన్స్ ఉండవచ్చు. ఇప్పటికే ప్రజల్లోకి.. ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది స్పష్టంగా వెళ్లడం లేదు. కానీ వైసీపీ చేస్తున్న ప్రచారాలు మాత్రం, ప్రజల్లోకి బలంగా వెళుతున్నాయి. ఇదే కంటిన్యూ అయితే.. రేపు 2019 పరిస్థితులు వచ్చే అవకాశాలు కూడా దాదాపుగా ఉండవచ్చు.

పవన్ కళ్యాణ్ ఆవేదన ఇదే.. అధికారం కోల్పోతే తెలుగుదేశం పార్టీ కంటే జనసేన పార్టీకి కలలో కూడా ఊహించని సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ కారణంగా వైసీపీ ఓడిపోయింది అనే ఫీలింగ్ వైసీపీ బాస్ జగన్ లో ఎక్కువ. జనాల ఫీలింగ్ కూడా ఆల్మోస్ట్ అదే మరి. ఒకవేళ వైసీపీ అధికారంలోకి వస్తే ముందుగా ఇబ్బంది పడేది పవన్ కళ్యాణ్.. ఆ తర్వాత పాటుగా జనసేన పార్టీ. జగన్ మైండ్ సెట్ పై పవన్ కు పిచ్చ క్లారిటీ ఉంది. అందుకే ఇప్పుడు పవన్.. తమ సర్కార్ కు సెన్సిటివ్ వార్నింగ్ లు ఇస్తున్నారు.

అలాగే పార్టీ కార్యకర్తలు కూడా ప్రచారం చేసే విషయంలో, వెనకబడుతున్నారు అనే భయం కూడా పవన్ కళ్యాణ్ లో కనపడుతోంది. ఇంకా ఎమ్మెల్యేలు మీడియా సమావేశాలు ఏర్పాటు చేయడానికి కూడా కంగారుపడుతున్నారు. జనసేన పార్టీ ఎమ్మెల్యేలకు ఎన్నిసార్లు చెప్పినా సరే.. అసెంబ్లీ సమావేశాలు విషయంలో కూడా వాళ్ళు సీరియస్ గా తీసుకోలేదు. ఇక అసెంబ్లీ సమావేశాల్లో కూటమి పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరూ కూడా సరిగా మాట్లాడే ప్రయత్నం చేయలేదు.

కల్తీ లడ్డు అంశానికి సంబంధించి గాని, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి గానీ, ఇతరత్రా అంశాలపై గానీ, గతంలో వైసిపి చేసిన అవినీతి కార్యక్రమాలపై గాని, ఎక్కడా కూడా పార్టీల ఎమ్మెల్యేలు మాట్లాడటం లేదు. ఇదే సమయంలో శాసనమండలి ద్వారా.. వైసిపి పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది. శాసన మండలిలో వైసీపీ హెరిటేజ్ టార్గెట్ గా.. చేసిన ఆరోపణలు ప్రజల్లోకి బలంగా వెళ్ళాయి. దీనితోనే పవన్ కళ్యాణ్ భయపడుతున్నట్లుగా కూడా తెలుస్తోంది.

అదే విధంగా శాఖలలో జరుగుతున్న కార్యక్రమాలు.. ప్రజలకు వివరించడం లేదనే బాధ కూడా పవన్ కళ్యాణ్ లో ఉందనేది చాలావరకు వినపడుతున్న మాట. అలాగే కూటమి పార్టీలలో ఉన్న విభేదాలు కూడా పవన్ కళ్యాణ్ ను భయపెడుతున్నాయి. తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి ప్రయాణం చేస్తాయని.. క్లారిటీ ఉన్నప్పటికీ, చాలామంది నాయకులు విభేదాలు పెట్టుకుంటున్నారు అనేది పవన్ కళ్యాణ్ లో ఉన్న భయం. అందుకే చంద్రబాబును కూడా గతంలో.. టీడీపీ వాళ్ళను హెచ్చరించాలని పవన్ కోరారు.

ఇదే కంటిన్యూ అయితే సిచ్యువేషన్ మరింత చండాలంగా ఉండే ఛాన్స్ ఉంది. చాలామంది నాయకులు గ్రౌండ్ లో కలుపుకుని వెళ్లడం లేదని పవన్ ఫీల్ అవుతున్నారు. అందుకే పదే పదే కూటమి.. కలిసి ఉంటుంది అని చెప్పుకునే ప్రయత్నం కూడా పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. ఎమ్మెల్యేలు మాట వినకపోతే.. స్థానిక నాయకత్వంతో కలిసి పని చేయకపోతే అది.. వైసీపీకి వైసీపీకి అడ్వాంటేజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. ప్రతీ నియోజకవర్గం లో చాలా వరకు ఇటువంటి పరిస్థితులే కనపడుతున్నాయి. అలాగే జనసేన పార్టీలోకి వచ్చిన కొంతమంది మాజీ ఎమ్మెల్యేల వైఖరి కూడా జనసేనకు ప్రాబ్లంస్ క్రియేట్ చేస్తోంది.

Published : 
  • 9 March 2026, 9:59 AM IST