సోషల్ మీడియా సెలబ్రిటీ, మాజీ మంత్రి, బి ఆర్ఎస్ నేత... మల్లారెడ్డి ఈమధ్య ఎక్కడ పార్టీ ఆక్టివిటీస్ లో కనిపించట్లేదు. తెలంగాణలో ప్రతిరోజు ఎక్కడో ఓ చోట బిఆర్ఎస్ నేతలంతా.... ఏదో ఒక అంశంపై రోడ్డు ఎక్కుతూనే ఉన్నారు. హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరూ క్యాడర్ వెంటపెట్టుకొని రేవంత్ సర్కార్ పై నిత్యం నిప్పులు కురిపిస్తున్నారు. సర్కారీ అప్పు లు, అవినీతి, అభివృద్ధి పథకా లు, సంక్షేమం, కాలేశ్వరం, ఏ అంశం దొరికితే ఆ అంశంపై హల్ చల్ చేస్తూ రోజు మీడియాలో కనిపించడానికి ప్రయత్నిస్తున్నారు. తెలంగాణలో అప్పుడే ఎలక్షన్స్ సీజన్ వచ్చేసినంతగా బిఆర్ఎస్ హడావుడి చేస్తుంది. ఇంత హంగామా లోనూ ఆ పార్టీ సీనియర్ నేత చామకూర మల్లారెడ్డి కనిపించడం లేదు. మామూలుగా పార్టీ యాక్టివిటీస్ ఏం జరిగినా అక్కడ ప్రత్యక్షమై... మీడియా అటెన్షన్ తన వైపు తిప్పుకుంటారు మల్లారెడ్డి. అలాంటి మల్లన్న పార్టీ కార్యక్రమాలకి పూర్తిగా దూరంగాఉన్నారు. విషయం ఏంటని ఆరా తీస్తే మల్లారెడ్డి బీఆర్ఎస్ వదిలేసి చాలా రోజులు అయింది అని తెలిసింది.అయితే మల్లారెడ్డి బి ఆర్ఎస్ ను వదిలేసాడా...? లేక బి ఆర్ఎస్ మల్లారెడ్డిని వదిలించుకుందా అనే చర్చ పార్టీలోనూ బయట జరుగుతుంది. దీనికి చాలా బ్యాక్ గ్రౌండ్ ఉంది.
మల్లారెడ్డి ఫ్యామిలీ ఈమధ్య ఒక పొలిటికల్ సర్వే చేయించుకున్నా రూ. రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ బాగా పడిపోతుంది గానీ.... బి ఆర్ఎస్ గ్రాఫ్ మాత్రం పెరగటం లేదట. పదేళ్లు బీ ఆర్ఎస్ ని, ఐదేళ్లు కాంగ్రెస్ ని చూసిన జనం ఈసారి బిజెపికి అవకాశం ఇస్తారేమోనని డౌట్ వచ్చేసింది మల్లారెడ్డికి. అంతేకాదు మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి ఇప్పటికే సెంట్రల్ బిజెపికి టచ్ లోకి వెళ్లిపోయారు. మల్కాజ్గిరి నుంచి ఈసారి బిజెపి ఎంపీగా పోటీ చేయడానికి ప్రీతి రెడ్డి గ్రౌండ్ రెడీ చేసుకున్నారు. ఢిల్లీ స్థాయి బిజెపి నేతలతో ప్రీతి రెడ్డి పూర్తిస్థాయి రాజకీయ సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఆ మధ్య మల్లారెడ్డి 50వ వివాహ వార్షికోత్సవాన్ని ప్రీతి తెలివిగా తన పొలిటికల్ ఆరా పెంచుకోవడానికి ఉపయోగించుకున్నారు. మల్లారెడ్డి కూడా ఆలోచనలో పడ్డారు.
2029 ఎన్నికల్లో తన కుటుంబం నుంచి కనీసం మూడు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ పదవి కచ్చితంగా చేక్కించుకోవాలన్నది మల్లారెడ్డి ప్లాన్. తాను, తన అల్లుడు రాజశేఖర్ రెడ్డి, చిన్న కొడుకు భద్రారెడ్డి, పెద్ద కోడలికి కూడా ఒకే పార్టీ నుంచి సీట్లు సంపాదించాలన్నది మల్లారెడ్డి వ్యూహం. ఈ ప్లాన్ వర్కౌట్ కావాలంటే ముందు తాను టిఆర్ఎస్ కు దూరంగా ఉండాలని డిసైడ్ అయిపోయారు మల్లారెడ్డి. దీనికి తోడు ఇటీవల పార్టీ సమావేశంలో పెద్దాయన కేసీఆర్ డైరెక్ట్ గా మల్లారెడ్డికి క్లాస్ పీకారు. సోషల్ మీడియాలో చెలరేగిపోవడం కాదు, ముందు ఫీల్డ్ లో పని చేసి చూడు.... అని గట్టిగానే చురకలేశారు. దాంతో మల్లారెడ్డి డిసైడ్ అయిపోయారు. పనికిరాని పార్టీలో ఉండి.... ప్రతి వాడితో తానే ఎందుకు తిట్లు తినాలి అనే క్లారిటీగా చేశారు. పూలమ్మి... పాలమ్మి పైకొచ్చిన మల్లారెడ్డి ఏదైనా డబ్బులతోనే వర్కౌట్ అవుతుందని బలంగా నమ్ముతారు. డే వన్ నుంచి ఆయన డబ్బుతోనే రాజకీయం చేశాడు. టికెట్లు కావాలన్నా పార్టీ అధిష్టానానికి డబ్బులు ఇవ్వాల్సిందే. ఎన్నికల ప్రచారంలో కార్యకర్తలకు డబ్బులు ఇవ్వాల్సిందే.
ఓట్లు వేయించుకోవడానికి వాటర్లకి డబ్బు ఇవ్వాల్సిందే. మొదటినుంచి చివరి వరకు డబ్బులు ఇచ్చుకుంటూ వచ్చే రాజకీయం ఎప్పుడైనా చేసుకోవచ్చు. అనవసరంగా వ్యాపారం పాడు చేసుకుని మూడేళ్ల ముందే బజారులో తిరగడం దేనికి అని మల్లారెడ్డి... టిఆర్ఎస్ కి దూరంగా ఉన్నారు. అంతేకాదు మల్లారెడ్డి ఆజన్మాంత శత్రువు రేవంత్ రెడ్డి సీఎం కాగానే .... మల్లన్న కాలేజీల్లో సీట్లకు కోతబడింది. హైడ్రా కూడా మల్లారెడ్డి కాలేజీల్ని ఏ క్షమైనా కూల్చడానికి సిద్ధంగా ఉంది. దీంతో మల్లారెడ్డి ఒక అండర్స్టాండింగ్ ప్రకారం , బి ఆర్ఎస్ లో ఆక్టివిటీ తగ్గించారు. కాంగ్రెస్ లోకి రేవంత్ రెడ్డి ఎలాగూ రానివ్వడు. ఉన్న ఆప్షన్స్ బీ ఆర్ఎస్. బిజెపి. ఎన్నికలకు ఏడాదికి ముందు బిజెపిలో ఒక్క ఎంపీ మూడు ఎమ్మెల్యే సీట్లు గనక ఇస్తే ఆ పార్టీకి వెళ్ళిపోదాం, బి ఆర్ఎస్ లో మళ్లీ కేసీఆర్ కి డైవ్ కొట్టి.... ఫ్యామిలీ ప్యాక్ లో సీట్లు సంపాదించుకుందాం. ఎక్కడైనా డబ్బులు ఇచ్చే సీట్లు కొనుక్కోవాల్సిందే. డబ్బులతో రాజకీయం చేయాల్సిందే. ఇంత ఉన్నాడు మల్లారెడ్డి. అందుకే మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ కి రెస్ట్ తీసుకోవాలనుకున్నాడు. కనీసం మూడేళ్లు ఖర్చులు అయినా కలిసి వస్తాయి. దటీజ్ మల్లారెడ్డి.