నువ్వు లుచ్చా నా కొడుకువి ఒక ప్రతిపక్ష నేత సీఎం ని అంటున్న మాటలు ఇవి . నీ లాగులో తొండలు వదులుతా.... సీఎం ప్రతిపక్ష నేతని తిడుతున్న తిట్లు ఇవి. ఇక ఏకంగా స్పీకర్ను పట్టుకొని.... డాష్ కొడుకు అని ఒక ఎమ్మెల్సీ అంటాడు. ఉప్పు పాతర వేస్తా, పేగులు తీసి మెడలో వేసుకుంటా, నీ అడ్రస్ లేకుండా చేస్తా, మీది లుచ్చా కాంగ్రెస్, నువ్వు చావాలి, పండబెట్టి తొక్కుతా, ముడ్డి మీద తంతా... నువ్వు రండ గాడివి, బొచ్చు పీకుతావా? ఇవి తెలుగు రాష్ట్రాల్లో నిత్యం నేతలు మాట్లాడుకునే మాటలు. జనం దృష్టిలో బూతులు. ఇలా మాట్లాడితేనే లీడర్లుగా ఎదిగినట్లు. బూతులు తిట్టుకుంటేనే జనం తమను గుర్తిస్తారు.... అనే భావనలో ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లో నాయకులంతా. ప్రతిపక్ష నేతలు, ముఖ్యమంత్రులు బూతులు మాట్లాడటంలో ఒకరిని మించి మరొకరు దూసుకుపోతున్నారు.
ఏమాత్రం సిగ్గుపడటం లేదు. సామాన్య జనం నిత్యం బూతులు మాట్లాడరు. కుటుంబాల్లో అసలు మాట్లాడుకోరు. కేవలం రాజకీయ నాయకులు మాత్రమే ఇప్పుడు బూతులు మాట్లాడుతున్నారు. పైగా రాజ్యాంగబద్ధంగా ప్రమాణస్వీకారం చేసి చట్టసభల్లో, బహిరంగ సభల్లో ఎక్కడ బడితే అక్కడ ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. వీళ్ళ ....జనానికి మార్గదర్శకం చేసేది? వీళ్ళని చూసా జనం నేర్చుకునేది? అంతర్జాతీయ సమ్మెట్ల లో... ఇంగ్లీషులో చిలక పలుకులు పలికే లీడర్లు సైతం బట్టలిప్పి రోడ్డు ఎక్కుతున్నారు. ముఖ్యంగా తెలంగాణలో ఎంత చండాలంగా మాట్లాడితే అంత గొప్ప నాయకుడు అవుతాం అనే భ్రమలో ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సంస్కృతి రోజురోజుకీ పెరిగిపోతుంది.అసెంబ్లీ ముందు బీఆర్ఎస్ నేతలు పోలీసులతో వాదులాడుతూ... దానిలో భాగంగా ఎమ్మెల్సీ తాతా మధు స్పీకర్ పై అసభ్యంగా మాట్లాడారు.
తాతా మధు మాత్రమే కాదు కేటీఆర్ సైతం రేవంత్ రెడ్డి పేరు ఎత్తితే చాలు బూతులే బూతులు. జంజీ మీటింగ్ లోను.... ఐటీ కాంక్లేవ్ లోను పాష్ ఇంగ్లీషు మాట్లాడే కేటీఆర్... సామాన్య జనం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం బండ బూతులు మాట్లాడుతారు. అంటే వీళ్ళు ఉద్దేశం సామాన్యులంతా బూతులు మాట్లాడుతారు... వాళ్లతో మనం బూతులే మాట్లాడాలి అనుకుంటారేమో.హరీష్ రావు కూడా తక్కువేం తినలేదు. అట్లనే అన్న... ఎట్లనే తమ్మి అని దీర్ఘాలు తీసుకుంటూనే అవసరం వచ్చినప్పుడు మాత్రం నోటికి దారుణంగా పని చెప్తూ ఉంటారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తక్కువ తిన్నారా.? ఉద్యమ కాలంలోనే కాదు పదేళ్ల పాలనా కాలంలోనూ కెసిఆర్ నోటికి అంతు పంతు ఉండేది కాదు. ప్రజల భాష.... మాండలికం.... మా భాషే అంతా, మేము ఇలాగే మాట్లాడతాం అని చెప్పుకుంటూ కెసిఆర్ కూడా రొచ్చు భాషలో రెచ్చిపోయేవాళ్లు.ఆంధ్ర లీడర్లు మాత్రం తక్కువ తిన్నారా? సంస్కారం గురించి నిత్యం లెక్చర్లు ఇచ్చే పవన్ కళ్యాణ్ కూడా నాలుగు ఓట్లు పడతాయి అనగానే బహిరంగ సభల్లో పరమ నీచమైన భాష మాట్లాడతారు. అదేంటంటే అవతల వాళ్ళు మాట్లాడడం లేదా అని ఎదురు ప్రశ్నిస్తారు.
ఇక బూతులు మంత్రిగా గుడివాడ నాని నోటికి అంతు పంతు ఉండదు. అసలు కేవలం బూతులు మాట్లాడడానికి వైసిపి హయాంలో నానిని మంత్రిని చేశారేమో అనిపిస్తుంది.చంద్రబాబు నాయుడు, లోకేష్ సైతం ఈ బూతులు ట్రాప్ లో పడిన వారే. చంద్రబాబు లాంటి దిగ్నిఫైడ్ లీడర్ కూడా అదుపుతప్పి నీ అమ్మ మొగుడు ,నా అమ్మ మొగుడు భాష మాట్లాడిన వాళ్లే.ప్రజా జీవితాన్ని నిర్దేశించే నాయకులు, రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసి అత్యున్నత పీఠంపై ఎక్కే లీడర్లు ఇలా బజారు భాష మాట్లాడటం ద్వారా.. వాళ్లలో కుసంస్కారాన్ని ఎప్పటికప్పుడు బయట పెట్టుకుంటూనే ఉన్నారు. ఎంత నీచంగా మాట్లాడే ఆవారా లీడర్లుజనానికి ఏం చెప్తారు? ఏం సంస్కారం నేర్పిస్తారు? వీళ్ళ వల్ల కాదా మన కల్చర్ భ్రష్టు పడిపోతుంది. మన ఇళ్లల్లో, మన సంసారాల్లో, మన స్నేహితుల మధ్య , మన బంధువుల మధ్య వీళ్ళ లాగా మనం బూతులు మాట్లాడగలమా? మీరే అర్థం చేసుకోండి. సంస్కారవంతులు వాళ్ళ మనమా అని. ఇలా మాట్లాడ్డం చేతకాకే చాలామంది రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.