నువ్వు నన్ను గులకరాయతో కొడితే నేను నిన్ను ఇటుక రాయి తో కొడతా...... ఏపీలో ఇప్పుడు నడుస్తున్న రాజకీయం ఇది. ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు అన్ని పార్టీల నేతలు ప్రత్యర్ధులని ఓపెన్ గా,కెమెరా ముందు బండ బూతులు తిడుతుంటారు. వైసిపి హయాంలో ఈ కల్చర్ ఎక్కడికో వెళ్లిపోయింది. అధికారం మదంతో అప్పట్లో ఎమ్మెల్యేలు ,మంత్రులు, గల్లీ లీడర్లు ప్రతి ఒక్కరూ బూతులు మీదే రాజకీయం చేసి బతికేవారు. నిజానికి వైసీపీ ఓటమిలో ఆ నాయకుల నోటి దూల కీలక పాత్ర పోషించింది.
టిడిపి సారధ్యంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పరిస్థితి ఏం మారలేదు. అప్పుడు వైసీపీ వాళ్లు ప్రత్యర్థులపై బూతులతో విరుచుకుపడేవారు. ఇప్పుడు టిడిపి, జనసేన నేతలు రాజకీయ ప్రత్యర్థుల్ని బండ బూతులు తిడుతున్నారు. నాయకులు ఎలా ఉంటారో కింది స్థాయి కార్యకర్తలు అలాగే ఉన్నారు. గుంటూరులో అంబటి రాంబాబుకి, టిడిపి కార్యకర్తలకు మధ్య ఫ్లెక్సీలు తొలగింపు దగ్గర వచ్చిన వివాదం నోటి దూల రాజకీయానికి పరాకాష్ట. ఒక మహిళా టిడిపి కార్యకర్త మాట్లాడిన మాటలు వింటే ఎవరికైనా ఒళ్ళు జలదరిస్తుంది.
అనుచిత వ్యాఖ్యలు, బూతులకు కేరాఫ్ అడ్రస్ అయిన వైసీపీ నేతలు మాత్రం వెనక్కి తగ్గుతారా? టిడిపి కార్యకర్తలు తనను అడ్డుకోవడంతో ఆగ్రహం చెందిన మాజీ మంత్రి , వైసిపి సీనియర్ నేత అంబటి రాంబాబు.... ఏకంగా సీఎం చంద్రబాబు నాయుడు నీ టార్గెట్ చేశారు. అనరాని మాటలు అన్నారు
బూతులు విషయంలో తెలుగుదేశం వైసీపీ నేతల్లో టాప్ టు బాటమ్.... అందరూ అనుభవజ్ఞులే. ఇప్పుడంటే ఎవరికి వాళ్ళు సుద్దులు చెప్తున్నారు కానీ అవసరం వచ్చినప్పుడు నాయకులంతా నోటి దూలతో చెలరేగిపోతూనే ఉన్నారు. బూతులు మాట్లాడితేనే రాజకీయం చేయగలం అనే భావన అన్ని పార్టీల్లోనూ వచ్చేసింది. అందుకే సిగ్గు శరం లేకుండా ఇదేచ్ఛగా ఎవ్వరినైనా ఎలాంటి మాటైనా అనగలుగుతున్నారు. అసలు రాజకీయాలు అంటేనే దూరంగా పారిపోయే జనం ఏపీ స్టేట్ లీడర్ల నోటి దూల... బూతులు చూసి దేవుడా ఈ రాష్ట్రం ఎటు పోతుంది అని నెత్తి నోరు కొట్టుకుంటున్నారు.