తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో...చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. నిత్యం విమర్శలు చేసుకుంటున్న బీఆర్ఎస్, బీజేపీ నేతలు...పురపోరులో మాత్రం నాకు నువ్వు...నీకు నేను అంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ గెలవలేని చోట...బీజేపీ సపోర్ట్ చేస్తున్నారు. అటు బీజేపీ కూడా...తాము గెలవలేని ప్రాంతాల్లో కారు గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను కోరుతున్నట్లు సమాచారం.మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు రోజురోజుకు మారుతున్నాయి. పైకి విమర్శలు చేసుకుంటున్నా...బీజేపీ, బీఆర్ఎస్‌లు లోపాయికారి ఒప్పందంతో ముందకు సాగుతున్నట్లు చర్చ జరుగుతోంది. ఒకరు బలహీనంగా ఉన్న చోట మరొకరు సపోర్ట్ చేసుకుంటున్నట్లు టాక్. ఇంటర్నల్‌గా ఒకరి కోసం మరొకరు ప్రచారం సైతం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించడమే లక్ష్యంగా పరస్పరం సహకరించుకుంటున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఆ ఆదేశాలు ఇరు పార్టీల హైకమాండ్ నుంచి వచ్చాయా ? లేక లోకల్ కేడర్ తీసుకుంటున్న సొంత నిర్ణయమా ? అనేది ప్రశ్నార్థకంగా మారింది. మున్సిపల్ ఎన్నికల వేళ...క్షేత్రస్థాయిలో భిన్నమైన రాజకీయ సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. పైకి కాంగ్రెస్, బీజేపీపై విమర్శలు చేస్తున్న గులాబీ నేతలు అంతర్గతంగా మాత్రం కమలం పార్టీకి మద్దతు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే ఈ పరిస్థితి అన్ని చోట్ల కనపడటం లేదు. ఎక్కడైతే తమ పార్టీ అభ్యర్థులు గెలిచే అవకాశం లేదో...అక్కడ కమలం పార్టీ అభ్యర్థి విజయం కోసం శ్రమిస్తున్నట్లు తెలుస్తోంది.
బీజేపీ బలహీనంగా ఉన్నచోట్ల ఆ పార్టీ నేతలు కారు పార్టీ విజయం కోసం పని చేస్తున్నారు. ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థుల విజయం కోసం...ఆ పార్టీ లీడర్లు పని చేయడం సహజం. ఒకవేళ పార్టీ అభ్యర్థి బలహీనంగా ఉంటే మరింత కష్టపడి చేస్తారు. కానీ మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ నేతలు అందుకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు సొంత పార్టీ నేతల నుంచే వస్తున్నాయి. గెలుపు అవకాశాలు లేని చోట బీజేపీ అభ్యర్థుల కోసం ఇంటర్నల్ ప్రచారం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం కొందరు గుట్టు చప్పుడు కాకుండా పని చేస్తుంటే...కొందరైతే ఇంటింటికి వెళ్లి కమలం అభ్యర్థికి ఓటు వేయాలని కోరుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందులో బీఆర్ఎస్ కంటే బీజేపీ పట్టణాల్లో కనిపిస్తోంది.
బీజేపీ గెలిచే అవకాశం లేని చోట ఆ పార్టీ నేతలు కారు పార్టీకి సపోర్ట్ చేస్తున్నట్లు సమాచారం. ఇరువురి టార్గెట్ కాంగ్రెస్ అభ్యర్థి ఓటమి కావడంతో...పరస్పరం సహకరించుకుంటున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఉన్న అవగాహన వెనుక ఎవరు ఉన్నారనే అంశం ఆసక్తికరంగా మారింది. పార్టీ నాయకత్వమే తమ కేడర్‌కు సంకేతాలు ఇచ్చిందా ? లేదంటే క్షేత్రస్థాయి పరిస్థితుల మేరకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తామే ప్రత్యామ్నాయమంటూ ధీమాగా ఉన్న బీఆర్ఎస్ నేతలు...మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం సొంత పార్టీ అభ్యర్థుల విజయం కోసం శ్రమించడం లేదు. బీజేపీ గెలుపు కోసం బీఆర్ఎస్ నేతలు శ్రమిస్తున్నారు.