2028 లో రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం బిజెపి, బి ఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం సెట్ అయిపోయింది.
పరిస్థితులను బట్టి ఎన్నికల ముందు కానీ, తర్వాత గాని బిజెపి బీఆర్ఎస్ మధ్య పొత్తులు కాయం. నిజానికి ఎన్నికలకు ఇంకా రెండేళ్లు సమయం ఉన్నప్పటికీ... కెసిఆర్ బిజెపి అధిష్టానంతో ముందుగానే డీల్ సెట్ చేసుకున్నారు. తెలంగాణలో బిజెపితో కలిసి ఎన్నికలకు వెళ్లడాన్ని, లేదా ఎన్నికల తర్వాత కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి బి ఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
కేటీఆర్ మొదట వ్యతిరేకించినప్పటికీ , కొందరు కీలక నాయకుల మూమెంట్స్ అన్ని గమనించిన కేసీఆర్, కేటీఆర్ ని ఒప్పించి ముందుగానే బి ఆర్ ఎస్ కర్చీఫ్ తీసుకెళ్లి బిజెపి పక్కకుర్చీలో వేసి వచ్చారు.
2028 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావడం అసాధ్యం అని తేలిపోయింది. ఈ విషయం కాంగ్రెస్ నాయకులకి స్పష్టంగా తెలుసు. అందుకే ఎవరు సంచి వాళ్ళు సర్దుకుంటున్నారు. వెనక్కి తీసుకోలేనన్ని పొరపాట్లు రేవంత్ రెడ్డి సర్కార్ చేసేసింది. ఏం చేసినా తిరిగి కాంగ్రెస్ గద్దినెక్కించడం కష్టమే. అయితే కాంగ్రెస్‌పై తెలంగాణలో ఉన్న వ్యతిరేకత... బి ఆర్ఎస్ కి మాత్రం పూర్తిగా అనుకూలంగా మారటం లేదు. కేటీఆర్, హరీష్ రావులు నిత్యం జనంలో తిరుగుతూ, సీఎం రేవంత్ రెడ్డి ని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ ని ఎండగడుతున్నప్పటికీ బి ఆర్ఎస్ గ్రాఫు సూపర్ గా పెరగటం లేదు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఒంటరిగానే గెలవగలమని.... బిజెపితో పొత్తు అనవసరమని కేటీఆర్ మొదటినుంచి మొండిగా వాదిస్తూ వచ్చారు. కానీ వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాదు అనే విషయాన్ని గుర్తించారు కేసీఆర్.
అందుకే మారుతున్న పరిస్థితులు, బిజెపితో తెలంగాణ పార్టీలు... లీడర్లు చేస్తున్న మంతనాలు గుర్తించి కెసిఆర్ 2028లో బిజెపితో కలిసి వెళ్లడానికి అందరికంటే ముందే సుముకత వ్యక్తం చేశారు. ఈ దూకుడు కి కారణం ముగ్గురు వ్యక్తులు .ఒకరు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. 2028 లో కాంగ్రెస్ ఓడిపోయి, కేవలం 25 నుంచి 30 సీట్లకు పరిమితం అయిపోతే, రేవంత్ కాంగ్రెస్ చీల్చి తాను సొంతంగా బిజెపితో జతకట్టే అవకాశం లేకపోలేదు. మహారాష్ట్రలో, అస్సాంలో బిజెపి ఇలాగే కాంగ్రెస్ నాయకుల్ని పార్టీలోకి లాగి ప్రభుత్వాలు ఏర్పాటు చేసింది. ప్రధాని మోడీ హైదరాబాద్ వచ్చినప్పుడు మనం కలిసి పని చేయాలి అంటూ సీఎం రేవంత్ కి సూచించడం జనంలో కొత్త అనుమానాలు రేకేతించింది. రేవంత్ ఏమి కాంగ్రెస్‌లో పుట్టినవాడు కాదు. అన్ని పార్టీలు చూసి ఇక్కడికి వచ్చినాడు. కనుక కాంగ్రెస్ వదిలి వెళ్లిపోవడం రేవంత్ కి పెద్ద కష్టమేమీ కాదు.2028 లో తెలంగాణలో రేవంత్ బీజేపీ కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేకపోలేదు.
మరో నాయకుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఈయన వైసీపీలో పుట్టి బి ఆర్ ఎస్ మీదుగా కాంగ్రెస్‌లో చేరాడు. పక్క వ్యాపారి. రాజకీయాలు కూడా వ్యాపారం చేసినట్లే చేస్తాడు. ఏదైనా డబ్బుతోనే కొంటాడు.2028 లో రేవంత్ బిజెపితో కలవడానికి ధైర్యం చేయలేక పోతే..., పొంగులేటి అవసరమైతే ఓ పాతికమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలనీ తీసుకొని బిజెపిలోకి వెళ్లి పోగలరు. ఎక్కడైనా డబ్బుతోనే రాజకీయం చేస్తారూ కనుక... ఆయనకు ఏ పార్టీ అయినా ఒకటే. బిజెపి కున్న మరో ఆప్షన్ పొంగులేటి.ఇక మూడో వ్యక్తి బి ఆర్ ఎస్ వెన్నెముక, కెసిఆర్ మేనల్లుడు హరీష్ రావు. హరీష్ రావుకి బిజెపి చాలాసార్లు ఆఫర్ ఇచ్చింది.2028 ఎన్నికల్లో హంగ్ ఏర్పడితే, బి ఆర్ ఎస్ నీ చీల్చుకొని హరీష్ రావు తన సొంత బలంతో బిజెపి నీ కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉంది. వీళ్ళ ముగ్గురిలో ఎవరో ఒకరితో బిజెపి కలిసి ప్రభుత్వ ఏర్పాటు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.
ఈ ప్రమాదాన్ని కెసిఆర్ గుర్తించారు. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి 2028 లో కాంగ్రెస్ ఓడిపోవడం ఖాయం. హంగు ఏర్పడటం పక్కాగా కనిపిస్తుంది. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చే సూచనలు లేవు. అలాంటి పరిస్థితుల్లో ఈ ముగ్గురికి అవకాశం ఇవ్వడం కంటే బిజెపితో ముందే ఒక ఒప్పందం చేసుకుంటే, పార్టీ చీలిపోకుండా ఉంటుంది, రేవంత్ మళ్లీ సీఎం కాకుండా అడ్డుకున్నట్టు అవుతుంది. అందుకే ఒక ప్రణాళిక ప్రకారం టిఆర్ఎస్ బిజెపి రూపాయికారిగా ఒప్పందం చేసుకున్నాయి . ఎన్నికల నాటి పరిస్థితులను బట్టి ముందు సీట్ల సర్దుబాటు చేసుకోవాలా..? లేదు ప్రభుత్వ ఏర్పాటు కలిసి చేయాలా అన్నది అప్పుడు నిర్ణయించుకుంటారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి రాకుండా, కాంగ్రెస్ వస్తే ఏమిటి పరిస్థితి అనే ప్రశ్న కూడా తలెత్తింది. కాంగ్రెస్ సింగిల్ గా అధికారంలోకి రాలేదు. కూటమి గా లో అధికారంలోకి రావాల్సి ఉంటుంది. కానీ తెలంగాణలో ఓడిపోవడం మాత్రం పక్కా. అందువల్ల తాము రాష్ట్రంలో బతికి ఉండాలంటే బిజెపితో పొత్తుకు వెళ్లడమే మంచిదని కెసిఆర్ నిర్ణయించుకున్నారు. అందుకే ఆ ముగ్గురు కంటే ముందే నిర్ణయం తీసు కున్నారు. బిజెపిని కలుపుకోవడంలో ఆలస్యం చేస్తే... రేవంత్ కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పి బిజెపితో చేతులు కలిపితే రాజకీయంగా తాము సమాధి అయిపోతామని కెసిఆర్ ,కేటీఆర్ గుర్తించారు. అందుకే ముందు జాగ్రత్తగా బిజెపితో ఒప్పందం చేసుకున్నారూ.