Top story: టీపీఎస్‌…కవిత పార్టీ పేరు ఫిక్స్‌… అధికారిక ప్రకటనే తరువాయి…!

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత...పార్టీ పేరు ఫిక్స్‌ అయిందా ? తెలంగాణ రాష్ట్ర సమితికి దగ్గరగా ఉండేలా పేరును డిసైడ్‌ చేశారా ? తెలంగాణ ప్రజా జాగృతి అని ప్రచారం జరుగుతున్నా...అది వాస్తవం కాదా ?

Post Published By: dialnews
Updated : 25 April 2026, 10:00 AM IST

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత...పార్టీ పేరు ఫిక్స్‌ అయిందా ? తెలంగాణ రాష్ట్ర సమితికి దగ్గరగా ఉండేలా పేరును డిసైడ్‌ చేశారా ? తెలంగాణ ప్రజా జాగృతి అని ప్రచారం జరుగుతున్నా...అది వాస్తవం కాదా ? టీఆర్ఎస్‌ నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టేలా నిర్ణయం తీసుకున్నారా?
తెలంగాణలో మరో కొత్త పార్టీ పురుడుపోసుకుంటోంది. మరి కొన్ని గంటల్లో...పార్టీ పేరును అధికారికంగా ప్రకటించబోతున్నారు. అంతేకాకుండా పార్టీ లక్ష్యాలు...జెండా, ఎజెండా విడుదల చేయబోతున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలకు ధీటుగా పోరాటానికి సిద్ధం అవుతున్నారు. శనివారం జరిగే బహిరంగ సభలో కవిత...పార్టీ పేరును వెల్లడించనున్నారు.

మేడ్చల్ అద్వయ కన్వెన్షన్ సెంటర్ వేదికగా బహిరంగ సభలో కవిత తన పార్టీ పేరును ప్రకటించబోతున్నారు. కవిత పార్టీ పేరు తెలంగాణ ప్రజా జాగృతి అంటూ ప్రచారం జరిగింది. అయితే అదంతా అబద్దమని...తెలంగాణ ప్రజా వికాస సమితి అంటూ జోరుగా ప్రాచారం సాగుతోంది. మునీరాబాద్ ప్రాంతంలో తెలంగాణ ప్రజా వికాస్ సమితి పేరుతో కొన్ని బ్యానర్లు, ఫ్లెక్సీలు కనిపించాయి. దీంతో ఈ పేరుతోనే ఆమె పార్టీని ప్రకటిస్తారన్న చర్చ జోరందుకుంది. అయితే దీనిపై అధికారికంగా ప్రకటన అయితే రాలేదు కానీ…. దాదాపుగా ఇదే పేరు ఉండొచ్చని తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర సమితికి దగ్గరగా పార్టీ పేరు ఉండేలా కవిత జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర సమితిలాగే...కవిత పార్టీ పేరు కూడా తెలంగాణ ప్రజా వికాస్‌ సమితిగా పెట్టినట్లు సమాచారం. టీఆర్ఎస్‌ పార్టీలోని మధ్య అక్షరం...అంటే రాష్ట్ర అనే పదం తీసేసి...ప్రజా వికాస్‌ను యాడ్‌ చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. పార్టీ ఆవిర్భావ సభకు జాగృతి శ్రేణులతోపాటు రాష్ట్రవ్యాప్తంగా కవిత మద్దతుదారులు అధిక సంఖ్యలో హాజరుకానున్నారు. జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో వస్తారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఉద్యమకారులను పెద్ద సంఖ్యలోఈ సభకు ఆహ్వానించారని తెలుస్తోంది. తెలంగాణ జాగృతి పేరుతోనే ఇప్పటికే చేరికలు ప్రారంభమయ్యాయి. బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాబురావు, పలువురు కార్యకర్తలు కవిత సమక్షంలో పార్టీలో చేరారు.జనం బాట కార్యక్రమంతో పార్టీకి సంబంధించిన గ్రౌండ్ వర్క్ పూర్తి చేశారు కవిత. అటు అధికార పార్టీ కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ పార్టీ నీ ,మరోవైపు బిజెపిని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. కవిత పార్టీ ప్రకటనతో తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు నాంది పలకనున్నారు.

తెలంగాణ అస్థిత్వమే పునాదిగా, అభివృద్ధి. సంక్షేమమే లక్ష్యంగా... తమ పార్టీ పని చేస్తుందని కవిత ఇప్పటికే ప్రకటించారు. ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తూనే, మారుతున్న కాలానికి అనుగుణంగా తెలంగాణను మరింత ముందుకు తీసుకువెళ్లడమే ఉద్దేశమని అంటున్నారు. కేవలం ఒక ప్రాంతానికో, వర్గానికో పరిమితం కాకుండా రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు చేరువయ్యేలా పార్టీ కార్యక్రమాలు ఉంటాయని కవిత ఇప్పటికే ప్రకించారు. ఈ కొత్త పార్టీ ప్రధానంగా తెలంగాణ రైతాంగం, నిరుద్యోగ యువత, మరియు మహిళా సాధికారతపై దృష్టి పెట్టనుంది. తెలంగాణ సంస్కృతిని కాపాడుకుంటూనే…. సాంకేతిక పారిశ్రామిక రంగాల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడం కోసం పార్టీ పని చేస్తుందని పార్టీ వర్గాలు తెలిపాయి. నియోజకవర్గాల వారీగా బలమైన కేడర్‌ను నిర్మించేందుకు ఇప్పటికే కవిత తన మద్దతుదారులతో చర్చలు జరిపారు. ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో ఎటువంటి సమీకరణాలకు దారితీస్తుందోనని రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా గమనిస్తున్నారు.

Published : 
  • 25 April 2026, 10:00 AM IST