Top Story పవన్ తో వంగవీటి కుమార్తె భేటీ..? బెజవాడ మేయర్ పదవి ఆమెకేనా..?

బెజవాడ రాజకీయాలు మరోసారి హిట్ పెంచే సిగ్నల్స్ కనబడుతున్నాయి. మరోసారి వంగవీటి కుటుంబం పొలిటికల్ సర్కిల్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది.

Post Published By: dialnews
Updated : 16 February 2026, 10:40 AM IST

బెజవాడ రాజకీయాలు మరోసారి హిట్ పెంచే సిగ్నల్స్ కనబడుతున్నాయి. మరోసారి వంగవీటి కుటుంబం పొలిటికల్ సర్కిల్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. దాదాపు మూడు నెలల నుంచి వంగవీటి కుమార్తె ఆశ రాజకీయ రంగ ప్రవేశంపై.. సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. వంగవీటి కుమార్తెను ఏ పార్టీ ఆహ్వానిస్తుంది.. ఏ పార్టీ ఆహ్వానాన్ని ఆమె స్వీకరిస్తారనే దానిపైనే చర్చ అంతా. రాజకీయంగా బలహీనంగా ఉన్న వైసిపి ఆమెకు గాలం వేస్తోందని ప్రచారం జరిగింది. కాపు సామాజిక వర్గాన్ని పవన్ రూపంలో దారిలో పెట్టుకున్న టిడిపి, వంగవీటి కుమార్తెకు రెడ్ కార్పెట్ పరిచే అవకాశం ఉండవచ్చని టిడిపి వర్గాలు ఆశపడ్డాయి.

కాదు జనసేన పార్టీలోకి ఆమె ఎంట్రీ ఇస్తారంటూ ఆ పార్టీ సోషల్ మీడియా కోడై కూసింది. అన్న వంగవీటి రాధా మౌనంగా ఉండటంతో.. టిడిపి ఆమె రంగంలోకి దించింది అంటూ మరికొంతమంది మాట్లాడారు. కాపు సామాజిక వర్గ కార్యక్రమంలో మంత్రి రామానాయుడు తో కలిసి ఆమె కనపడిన తర్వాత ఈ వార్తకు మరింత బలం చేకూరింది. అయితే ఇప్పుడు వంగవీటి ఆశ.. రాజకీయ ప్రయాణాన్ని జనసేన నుంచే ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్లు, బెజవాడలో ఎక్కువగా టాక్ వినపడుతోంది. ఆమెను జనసేన పార్టీలోకి తీసుకొచ్చేందుకు ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. రంగం సిద్ధం చేసినట్లుగా ప్రచారం మొదలైంది.

విజయవాడలో కాపు సామాజిక వర్గం అత్యంత ప్రాధాన్యత ఉన్న సామాజిక వర్గం. అందుకే విజయవాడ మేయర్ పదవిలో, కాపు మహిళను కూర్చోబెట్టే ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉన్నట్లు రాజకీయ వర్గాలు అంటున్నాయి. గతంలో వైసిపి మహిళ మేయర్ ను ఎంపిక చేసింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అదే సాంప్రదాయాన్ని కంటిన్యూ చేసే దిశగా అడుగులు వేస్తోంది. వంగవీటి వారసురాల్ని బెజవాడ మేయర్ కుర్చీలో కూర్చోబెట్టడానికి సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రంగం సిద్ధం చేసినట్లుగా సమాచారం. ఏడాది చివర్లో లేదంటే వచ్చేయడాది మొదట్లో జరగబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమెను పోటీ చేయించే అవకాశం కనబడుతోంది.

గత ఎన్నికల్లో టిడిపి నుంచి కేశినేని నాని కుమార్తె శ్వేత, పోటీ చేశారు. అధికారంలో వైసీపీ ఉండటంతో విజయవాడ మేయర్ పదవి ఆ పార్టీ దక్కించుకుంది. ఇప్పుడు కూటమి అధికారంలో ఉండటంతో.. ఈసారి ఎలాగైనా సరే బెజవాడలో పాగా వేయాలని వ్యూహాలు సిద్ధం చేసింది కూటమి. అందులో భాగంగానే వంగవీటి ఆశ విజయవాడ మేయర్ గా పోటీ చేసే అవకాశం ఉండవచ్చని ప్రచారం ఊపందుకుంది. త్వరలోనే ఆమె ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో భేటీ అయి.. జనసేన పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. కాపు సామాజిక వర్గంలో చీలిక రాకుండా ఉండేందుకే ఆమెను రంగంలోకి దించుతున్నట్లు తెలుస్తోంది.

వంగవీటి రంగ విషయంలో వైసిపి కూడా కొంత సైలెంట్ గా రాజకీయం మొదలుపెట్టింది. పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు అతి దగ్గరగా ఉండటంతో.. కాపు సామాజిక వర్గంలో మెజారిటీ కూటమికే మద్దతిస్తోంది. అందుకే వంగవీటి రంగ పేరుతో వైసిపి దూకుడు పెంచింది. ఈ సమయంలో వంగవీటి ఆశ జనసేన పార్టీలో జాయిన్ అయితే ఆమెను మేయర్ చేయవచ్చని.. తద్వారా వంగవీటి అభిమానులు వైసిపి వైపు చూసే అవకాశం ఉండదని భావిస్తున్నారు కూటమి పెద్దలు. అయితే విజయవాడలో తెలుగుదేశం పార్టీకి బలం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆ పార్టీ నుంచే ఆమె పోటీ చేయవచ్చని అభిప్రాయాలు కూడా ఉన్నాయి.

ఆమె సోదరుడు తెలుగుదేశం పార్టీలో ఉండటంతో, ఈమె జనసేన లో ఉంటే అనవసరంగా సమస్య ఉంటుందనే అభిప్రాయం కూడా వినపడుతోంది. అయితే సామాజిక వర్గాలపరంగా ఆలోచించే ఆమెను జనసేనలోకి పంపిస్తున్నట్లు రాజకీయ వర్గాలు అంటున్నాయి. అన్ని అనుకున్నట్లు జరిగితే వేసవిలో ఆమె జనసేన పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉంది. ఇప్పటికే రంగరాధా మిత్రమండలని బలోపేతం చేసే ప్రయత్నం చేస్తున్న ఆమె.. వారందరూ కూటమి కోసం పనిచేసే దిశగా నడిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వచ్చేవారం లేదంటే మార్చి మొదటి వారంలో పవన్ కళ్యాణ్ తో ఆమె భేటీ అయిన తర్వాతనే దీనిపై ఒక క్లారిటీ రానుంది.

Published : 
  • 16 February 2026, 10:40 AM IST