Top story: బిఆర్ఎస్ గ్రాఫ్ ఎందుకు పెరగటం లేదు? బావా బామ్మర్దులు ఎంత తిరిగినా….. బిఆర్ఎస్ గ్రాఫ్ పెరగదేం?

తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ పై జనంలో విపరీతమైన వ్యతిరేకత పెరుగుతుంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి ఖాయమని అందరూ అనుకుంటున్నారు. కానీ ఆ వ్యతిరేకత టిఆర్ఎస్ కి అనుకూలంగా మాత్రం మారడం లేదు

Post Published By: dialnews
Updated : 26 June 2026, 2:30 PM IST

తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ పై జనంలో విపరీతమైన వ్యతిరేకత పెరుగుతుంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి ఖాయమని అందరూ అనుకుంటున్నారు. కానీ ఆ వ్యతిరేకత టిఆర్ఎస్ కి అనుకూలంగా మాత్రం మారడం లేదు. బి ఆర్ఎస్ గ్రాఫ్ తెలంగాణలో ఇంచు కూడా పెరగటం లేదు. ఇలా ఎందుకు జరుగుతుందో కెసిఆర్ ,కేటీఆర్, హరీష్ రావుల కి అర్థం కావడం లేదు. హరీష్ రావు అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కంట్లో నలుసులా, కాలిలో ముల్లులా తయారయ్యాడు. రోజుకు ఒక అంశంపై రాష్ట్రంలో ఎక్కడో ఓ చోట తిరుగుతూ రచ్చ రచ్చ చేస్తున్నాడు. అయినా బీఆర్ఎస్ గ్రాఫ్ పెరగటం లేదు.దీనికి ప్రధాన కారణం కేటీఆర్ ,కెసిఆర్ లకు తెలిసిన బయటకు చెప్పడం లేదు. కెసిఆర్ కుటుంబం అవినీతి, అహంకారం పై జనానికి ఇంకా కోపం తగ్గలేదు.

కెసిఆర్ కుటుంబం లక్ష కోట్ల పైగా అవినీతికి పాల్పడిందని కేటీఆర్, కవిత, సంతోష్ రావు, హరీష్ రావు తోపాటు మంత్రులు ఎమ్మెల్యేలు పదేళ్లపాటు తెలంగాణను దోచుకు తిన్నారని ఆరోపణనీ జనం ఇప్పటికీ నమ్ముతున్నారు.రియల్ ఎస్టేట్ బిల్డర్లను అడ్డం పెట్టుకొని కేటీఆర్ వేల కోట్లు ఎనకేసాడు అని చాలామంది ఇప్పటికీ నమ్ముతున్నారు. హరీష్ రావు ప్రజల మనిషిగా చెప్పుకుంటూనే వేల కోట్లు ఎనకేశాడని, బినామీ పేర్లతో వ్యాపారాలు చేస్తున్నాడని ఇంకొందరు ఆరోపణ. ఇక కవిత సంగతి చెప్పనే అక్కర్లేదు. సంతోష్ రావు అయితే గుండెలు తీసిన బంటు అని అటు పొలిటికల్ సర్కిల్స్ లోను ఇటు పబ్లిక్ లోను ఒకే మాట నడుస్తుంది. అవినీతి ఒక్కటే కాదు కెసిఆర్ కుటుంబ సభ్యుల అహంకారం, రాజరిక పోకడలు, క్యాడర్ పట్ల చిన్న చూపు వెరసి ఇప్పటికీ బి ఆర్ఎస్ పై జనంలో కోపం పోలేదు. ఇదే విషయాన్ని కేటీఆర్ కూడా ఇటీవల అంగీకరించాడు.

మా వల్ల కొన్ని తప్పులు జరిగాయి అన్ని ఓపెన్ గానే ఒప్పుకున్నాడు. ఇటీవల పార్టీ చేసుకున్న ఒక ఇంటర్నల్ సర్వేలో టిఆర్ఎస్ గ్రాఫ్ పెరగటం లేదు అనే నిజం బయటపడింది .ఈ మధ్య హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరూ కేసీఆర్ తో సమావేశం అయ్యారు. పార్టీకి ప్రశాంత్ కిషోర్ ను కన్సల్టెంట్ గా పెట్టుకుందామని పెద్దాయన ముందు ఒక ప్రతిపాదన తెచ్చారు. 14 ఏళ్లు ఉద్యమం, పదేళ్లు అధికారం ఇచ్చిన పార్టీకి కన్సల్టెంట్ అవసరమా..? అని కెసిఆర్ ఇద్దరికీ చివాట్లు పెట్టాడంట. ఒకరికొకరు గోతులు తీసుకోవడం మానేసి... జనంలో ఎక్కువ తిరగాలని ఆదేశించాడంట. ఆయన ఆదేశం మేరకు బావబామ్మర్దిలిద్దరూ జనంలో పడ్డారు. ఏం చేసినా బి ఆర్ఎస్ గ్రాఫ్ మాత్రం పెరగటం లేదు. అంటే 2029 లో కూడా మనకు అధికారం రాదా? రేవంత్ రెడ్డి పాలన పై జనంలో ఎంత వ్యతిరేకతున్నా మనకెందుకు అది ఓటు బ్యాంకుగా మారడం లేదు...? మన పైన అంతా ఆగ్రహం ఉందా అని టిఆర్ఎస్ లీడర్లు... నాలుగు గోడల మధ్య నెత్తి కొట్టుకుంటున్నారు.2029 లో ఒంటరిగా పోటీ చేసినప్పటికీ, ఎన్నికల తర్వాత బిజెపితో బి ఆర్ఎస్ కలవక తప్పదేమో.

Published : 
  • 26 June 2026, 2:30 PM IST