టీ20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌పై భారత్ ప్రతీకారం తీర్చుకుంది. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన భారత్‌కు 2016 టీ20 ప్రపంచకప్ సెమీస్‌లో వెస్టిండీస్ షాక్ ఇచ్చింది. తర్వాత ఫైనల్లో ఇంగ్లాండ్‌ను ఓడించిన విండీస్ ట్రోఫీని ఎగరేసుకుపోయింది. సరిగ్గా పదేళ్ల తర్వాత భారత్.. ఆ ఓటమికి బదులు తీర్చుకుంది. వర్చువల్ క్వార్టర్ ఫైనల్‌లో వెస్టిండీస్‌ను ఓడించి టీ20 ప్రపంచకప్ 2026లో సెమీస్‌లోకి అడుగుపెట్టింది. వెస్టిండీస్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.2016 టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అద్భుత ఫామ్‌తో.. వరుస విజయాలు సాధించిన భారత్ సెమీస్ చేరింది. అయితే సెమీఫైనల్లో భారత్‌కు ఊహించని పరాభవం ఎదురైంది.
ముంబై వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 2 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 89 పరుగులతో అజేయంగా నిలిచాడు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్.. మరో 2 బంతులు మిగిలి ఉండగానే గెలుపొందింది. లెండల్ సిమన్స్ 82 పరుగులు, ఆండ్రీ రస్సెల్ 43 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును గెలిపించారు.తాజాగా ఆ ఓటమికి భారత్ రివేంజ్ తీర్చుకుంది. టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఆదివారం ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్.. విండీస్‌కు బ్యాటింగ్ అప్పగించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టు.. 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. అనంతరం టీమిండియా మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. ఓపెనింగ్ బ్యాటర్ సంజూ శాంసన్.. 50 బంతుల్లో 97 పరుగులతో అజేయంగా నిలిచి.. జట్టును గెలిపించాడు.2016లో విరాట్ కోహ్లీ.. ఎంత పోరాడినా టీమిండియా మాత్రం విండీస్ చేతిలో ఓడిపోయింది. కానీ ఈసారి మాత్రం సంజూ శాంసన్ అలా జరగనివ్వలేదు. సాధికారికంగా బ్యాటింగ్ చేసిన అతడు.. ఒంటి చేత్తో మ్యాచ్‌ను గెలిపించాడు. వెస్టిండీస్‌ను ఓడించి.. భారత్‌ను సెమీ ఫైనల్ చేర్చాడు.టీ20 వరల్డ్ కప్ చరిత్రలో భారత్, వెస్టిండీస్ జట్లు ఐదుసార్లు ముఖాముఖి తలపడగా.. కరేబియన్ జట్టు మూడుసార్లు గెలిచింది. తాజా విజయంతో టీమిండియా రెండుసార్లు గెలిచినట్లయ్యింది. 2009, 2010 ఎడిషన్లలో వెస్టిండీస్ భారత్‌ను ఓడించగా.. 2014 ఎడిషన్లో టీమిండియా కరేబియన్ జట్టుపై ఘనవిజయం సాధించింది. 2016 సెమీస్‌లో వెస్టిండీస్ సొంతగడ్డ మీద ఆడుతున్న భారత్‌కు హార్ట్ బ్రేక్ మిగల్చగా.. ఇన్నాళ్లకు టీమిండియా ఆ జట్టుపై ప్రతీకారం తీర్చుకుంది.