పవన్ వర్సెస్ లోకేష్, బెజవాడలో క్రికెట్ మ్యాచ్..!

ఏపీ శాసన సభా సమావేశాల సందర్భంగా ప్రభుత్వం ఓ కీలక అడుగు వేస్తోంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అందరికీ క్రీడా పోటీలు నిర్వహిస్తోంది. గత ఏడాది కూడా ఈ పోటీలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సంగతి తెలిసిందే

Post Published By: dialnews
Updated : 23 February 2026, 11:47 AM IST

ఏపీ శాసన సభా సమావేశాల సందర్భంగా ప్రభుత్వం ఓ కీలక అడుగు వేస్తోంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అందరికీ క్రీడా పోటీలు నిర్వహిస్తోంది. గత ఏడాది కూడా ఈ పోటీలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సంగతి తెలిసిందే. రేపటి నుంచి మూడు రోజల పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆటల పోటీలు ఉంటాయి. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఆటల పోటీలు నిర్వహిస్తారు.

క్రికెట్ తో పాటు క్యారమ్స్, టెన్నిస్ ఇలా రకరకాల పోటీలు ఉండే అవకాశం ఉంది. ఎమ్మెల్యేల క్రికెట్ లో రెండు టీమ్స్ ఉంటాయి. ఒక టీమ్ కెప్టెన్ గా మంత్రి లోకేష్, మరో జట్టు సారథిగా నాదెండ్ల మనోహర్ ఉంటారు. మూడో టీం కెప్టెన్ గా పవన్ కళ్యాణ్ ఉండే ఛాన్స్ ఉంది.

Published : 
  • 23 February 2026, 11:47 AM IST