ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ ప్రారంభం కంటే ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు హోం గ్రౌండ్ లేకుండా ముఖేష్ అంబానీ ట్రై చేశారన్న వార్తలు వస్తున్నాయి.రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముంబై డివై పాటిల్ స్టేడియాన్ని హోం గ్రౌండ్ గా చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. అయితే డివై పాటిల్ స్టేడియం బెంగళూరు వినియోగించుకోవాలంటే ముంబై ఇండియన్స్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ రావాలి. కానీ ఆ సర్టిఫికెట్ ఇచ్చేందుకు ముంబై ఇండియన్స్ నిరాకరించింది. దీంతో ఇప్పుడు బెంగళూరుకు హోం గ్రౌండ్ లేకుండా పోయింది.
ఈసారి చిన్నస్వామి స్టేడియం వేదికగా బెంగళూరు తన హోమ్ మ్యాచ్ లు ఆడబోదు. దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు. కర్ణాటక ప్రభుత్వం పర్మిషన్లు ఇచ్చే పరిస్థితి కూడా లేదట. తొక్కిసలాట కారణంగా 11 మంది మృతి చెందిన నేపథ్యంలో చిన్న స్వామి స్టేడియం బెంగళూరుకు దూరమైంది. దీంతో ప్రత్యామ్నాయంగా మరో రెండు వేదికలను చూసుకుంటుంది బెంగళూరు. ఇందులో డివై పాటిల్ ముంబై స్టేడియం ఒకటి కాగా… మరొకటి రాయ్ పూర్ అని తెలుస్తోంది. అయితే డివై పాటిల్ స్టేడియం అయితే బాగుంటుందని బెంగళూరు యాజమాన్యం ఇప్పటికే చర్చలు జరిపిందట. కానీ చివరికి క్షణంలో ముంబై ఇండియన్స్ యాజమాన్యం మాత్రం బెంగళూరుకు షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. డివై పాటిల్ స్టేడియం ముంబై ఇండియన్స్ కు హోమ్ గ్రౌండ్. వాంఖడేతో పాటు ఇక్కడ కూడా మ్యాచ్ లు జరుగుతాయి. అయితే ఇక్కడ బెంగళూరు తన మ్యాచ్ లో ఆడాలంటే ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యం నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తెచ్చుకోవాలి. ఈ సర్టిఫికెట్ ఇచ్చేందుకు అంబానీ ముందుకు రావడం లేదట. ఆ సర్టిఫికెట్ ఇవ్వబోనని ఇప్పటికే తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో బెంగళూరు పరిస్థితి దారుణంగా తయారైంది. ముంబై ఇండియన్స్ అడ్డు చెప్పడానికి కారణం ఏంటి ?
డివై పాటిల్ స్టేడియంకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వకపోవడానికి ప్రత్యేక కారణాలు ఉన్నాయి. ముంబైలో బెంగళూరు తన హోమ్ మ్యాచులు ఆడితే… ప్రేక్షక ఆదరణ ముంబైకి తగ్గే ప్రమాదం ఉంటుంది. దానివల్ల ముంబై ఇండియన్స్ యాజమాన్యానికి రెవెన్యూ తగ్గిపోతుంది. ముంబై ఇండియన్స్ బ్రాండ్ కూడా దెబ్బతింటుంది. అందుకే నో సర్టిఫికెట్ ఇచేందుకు ముంబై ఇండియన్స్ నిరాకరించింది. దీంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రాయపూర్, విశాఖపట్నం, పూణే లేదా ఇండోర్ నగరాలలో ఏదో ఒకదానిని హోమ్ గ్రౌండ్ గా మార్చుకోవాలి. దీనిపై చర్చలు జరుగుతున్నాయి.