ఒక్క ఓటమితో సీన్ మొత్తం రివర్స్… భారత్ సెమీస్ చేరాలంటే ?

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన టీమిండియాకు క్లిష్ట పరిస్థితి ఎదురైంది. అసాధారణ విజయాల నుంచి అదృష్టం కలిసి వస్తే తప్పా టోర్నీలో ముందడుగు వేయలేని పరిస్థితి నెలకొంది.

Post Published By: dialnews
Updated : 23 February 2026, 7:15 PM IST

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన టీమిండియాకు క్లిష్ట పరిస్థితి ఎదురైంది. అసాధారణ విజయాల నుంచి అదృష్టం కలిసి వస్తే తప్పా టోర్నీలో ముందడుగు వేయలేని పరిస్థితి నెలకొంది. ఒక్క పరాజయంతో మెగా టోర్నీలో టీమిండియా రాత తలకిందులైంది. సౌతాఫ్రికా ఇచ్చిన షాక్‌తో పసికూన జింబాబ్వేకు కూడా భయపడాల్సిన పరిస్థితి టీమిండియాకు నెలకొంది.సూపర్-8లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన సౌతాఫ్రికా 76 పరుగుల భారీ తేడాతో టీమిండియాను చిత్తు చేసింది. ఈ ఘోర పరాజయంతో ఈ టోర్నీలో టీమిండియా సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఈ భారీ ఓటమి.. టీమిండియా నెట్‌రన్‌రేట్‌ను దారుణంగా దెబ్బతీసింది.

తర్వాతి రెండు మ్యాచ్‌లకు రెండు గెలిచినా ఇతర జట్ల నెట్‌రన్‌రేట్‌పై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అజేయంగా ఫైనల్ చేరుతుందని భావించిన భారత అభిమానులు.. తాజా పరాజయం తీవ్రంగా నిరాశపర్చింది.లీగ్ దశను అజేయంగా ముగించిన భారత్.. సూపర్-8లో సౌతాఫ్రికా, జింబాబ్వే, వెస్టిండీస్‌తో గ్రూప్-1లో ఉంది. సౌతాఫ్రికా చేతిలో ఎదురైన పరాజయంతో భారత్ రన్ రేట్ మైనస్‌కు వెళ్లిపోయింది. మరోవైపు సౌతాఫ్రికా భారీ విజయంతో పాటు మెరుగైన రన్‌రేట్తో అగ్రస్థానంలో కొనసాగుతోంది.ఈ పరిస్థితుల్లో భారత్ తమ తదుపరి రెండు మ్యాచ్‌లకు రెండు గెలిచినా ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే భారత్ ఇంకా సెమీస్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించలేదు.

భారత్ తమ తదుపరి రెండు మ్యాచ్‌లకు రెండు గెలవాలి. ఈ విజయాలు కూడా భారీ తేడాతో నమోదు చేయాలి అప్పుడే భారత్ రన్ రేట్‌ మెరుగవుతుంది. జింబాబ్వేతో గురువారం జరిగే మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తే.. వెస్టిండీస్‌తో జరిగే ఆఖరి మ్యాచ్‌ డిసైడర్‌గా మారుతుంది.ఒకవేళ భారత్ ఈ రెండు మ్యాచుల్లో ఒక్కటి ఓడినా సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారుతాయి. ముఖ్యంగా ఇతర మూడు జట్లలో కనీసం రెండు జట్లు కూడా తమ మూడు మ్యాచ్‌ల్లో ఒక్కో విజయం మాత్రమే నమోదు చేయాలి. అప్పుడు కూడా మెరుగైన రన్‌రేట్ ఉన్న జట్టు సెమీస్‌కు అర్హత సాధిస్తోంది.ఒకవేళ సౌతాఫ్రికా అన్ని మ్యాచ్‌లు గెలిస్తే.. గ్రూప్-1లో రెండో స్థానం కోసం భారత్, వెస్టిండీస్ మధ్య పోటీ నెలకొంటుంది. అప్పుడు నెట్ రన్‌రేట్ ఎవరికి ఎక్కువగా ఉంటే వారే సెమీస్‌కు అర్హత సాధిస్తారు. అయితే ఇక్కడ జింబాబ్వేను తక్కువ అంచనా వేయడానికి లేదు. లీగ్ దశలో ఆ జట్టు పటిష్టమైన ఆస్ట్రేలియా, శ్రీలంకను మట్టికరిపించి సెమీస్ చేరింది. ఒకవేళ జింబాబ్వేపై ఏక పక్ష విజయం సాధిస్తే.. వెస్టిండీస్‌తో పోరు భారత్‌కు కీలకంగా మారుతుంది. రెండు మ్యాచ్‌ల్లో ఓడితే టీమిండియా పోరాటం సూపర్-8 దశలో ముగుస్తుంది.

Published : 
  • 23 February 2026, 7:15 PM IST