Avatar డైరెక్టర్ సీన్లోకొస్తే.. టీజర్ సూపర్ సునామీ…!

సూపర్ స్టార్ మహేశ్ బాబు గ్లోబల్ సూపర్ స్టార్ గా మారాలంటే, వారణాసి వరల్డ్ వైడ్ గా వసూళ్ల వేటతో ఓ ఆట ఆడుకోవాలి. అందుకు కంటెంట్ పరంగా రాజమౌళి ఉన్నాడు.. వరల్డ్ ఆడియన్స్ కి ఈజీగా కనెక్ట్ అయ్యే హాలీవుడ్ హీరో లుక్ తో మహేశ్ బాబు

Post Published By: dialnews
Updated : 14 May 2026, 5:50 PM IST

సూపర్ స్టార్ మహేశ్ బాబు గ్లోబల్ సూపర్ స్టార్ గా మారాలంటే, వారణాసి వరల్డ్ వైడ్ గా వసూళ్ల వేటతో ఓ ఆట ఆడుకోవాలి. అందుకు కంటెంట్ పరంగా రాజమౌళి ఉన్నాడు.. వరల్డ్ ఆడియన్స్ కి ఈజీగా కనెక్ట్ అయ్యే హాలీవుడ్ హీరో లుక్ తో మహేశ్ బాబు కూడా, మూడు పాత్రలు వేస్తున్నాడు. ఇక్కడ సమస్య ప్రమోషన్.. అదే అవతార్ డైరెక్టర్ చేతిలో ఉంది. తన చేతుల మీదగిగానే గ్లింప్స్ ని లాంచ్ చేయబోయినా రాజమౌళికి అక్కడ నిరాశే ఎదురైంది. అవతార్ 3 వ భాగం నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. కాబట్టే జేమ్స్ కామెరున్, సైలెంట్ అయిపోయాడు. అందుకే అలాంటి టైంలో తనతో వారణాసి గ్లింప్స్ లాంచ్ కుదర్లేదని ప్రచారం జరిగింది. కట్ చేస్తే జేమ్స్ కామెరున్ నుంచి రాజమౌళికి గ్రీన్ సిగ్నలేదో వచ్చిందా? టీజర్ లాంచ్ కి రాజమౌళి కూడా ఆగస్ట్ 15నే ముహుర్తం చూసుకుంటున్నాడా? ఇదే జరిగితే వరల్డ్ వైడ్ గా వారణాసి వైబ్స్ మారిపోతాయా?

వారణాసి మూవీకి వరల్డ్ వైడ్ గా వరం అంటే, అది అవతార్ దర్శకుడే.. ఎప్పుడో త్రిబుల్ ఆర్ ఆస్కార్ రేసులో ఉన్నప్పుడు, జేమ్స్ కామెరున్ ని రాజమౌళి కలిశాడు. ఇక అవతార్ డైరెక్టరే కాదు, జురాసిక్ పార్క్ ఫేం స్టీవెన్ స్పిల్ బర్గ్ కూడా త్రిబుల్ ఆర్ ని, రాజమౌలిని మెచ్చుకున్నాడు. ఆతర్వాతే వారణాసి మొదలైంది. ఆ సినిమా గ్లింప్స్ అవతార్ ఫేం జేమ్స్ కామెరున్ చేతుల మీదుగా లాంచ్ చేయబోతున్నాడు రాజమౌళి అంటూ ప్రచారం మొదలైంది.దాదాపు ఇది నిజానికి దగ్గరగా ఉన్న ప్రచారమే.. జేమ్స్ కామెరున్ చేతులు మీదుగానే వారణాసి గ్లిప్స్ లాంచ్ చేయించాలని పెద్ద ఈవెంట్ ప్లాన్ చేస్తే, అప్పుడే అవతార్ 3 విడుదలైంది. అదెలాగూ హిట్టౌతుందికాబట్టి, ఇక్కడికి వచ్చిన జేమ్స్ కామెరున్ తో వారణాసి ప్రోమో లాంచ్ చేయించాలనుకున్నాడు రాజమౌళి. కాని అవతార్ 3 మొదటి ఆటే, నెగెటివ్ టాక్ ని సొంతం చేసుకోవటంతో, జేమ్స్ కామెరున్ సైలెంట్ అయ్యాడన్నారు.

అందుకే వారణాసి గ్లింప్స్ తనతో లాంచ్ చేయించటం కుదరకే, రాజమౌలి ఇక ఈ సినిమా కాన్సెప్ట్ ఇమేజెస్ తో ఒక వీడియో ఈవెంట్ తో తతహా అనిపించాడనే కామెంట్స్ వచ్చాయి. ఏదేమైనా, ఈసారి గ్లింప్స్ కాదు, టీజర్ నే అది ఆగస్ట్ 15నే లాంచ్ చేయించే ప్రయత్నం చేయబోతున్నాడట రాజమౌళి. జేమ్స్ కామెరున్ ని ఎలా ప్రసన్నం చేసుకున్నాడో కాని, మొత్తానికి తననుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు తెలుస్తోంది.ఆగస్ట్ లోగా ఈ సినిమా 95 శాతం షూటింగ్ పూర్తవుతుంది. సెప్టెంబర్ కల్లా పెండింగ్ ప్యాచ్ వర్క్ ని కూడా పూర్తి చేయబోతోంది వారణాసి టీం. సో అసలు సిసలు ప్రమోషన్ అంటే ఇక ఆగస్ట్ నుంచే మొదలౌతుందని, అదెలా కూడా వారణాసి టీం కి ఇబ్బందిలేని సీజన్ అని తేలిపోతోంది.

అందుకే ఆగస్ట్ 15 న వారణాసి టీజర్ ని జేమ్స్ కామెరున్ చేతుల మీదుగా దేశ రాజధాని న్యూ దిల్లీలో లాంచ్ చేయించాలనే ఒక చర్చ తన టీం మధ్య జరిగినట్టుతెలుస్తోంది.మోస్ట్ లీ వారణాసి టీం ప్రజెంట్ షెడ్యూల్ తర్వాత ఏదైనా ఒక చిన్న క్లూలాంటిది ఇవ్వొచ్చని తెలుస్తోంది. అంతా అనుకున్నట్టు ఫిక్స్ అయితే, కామెరున్ డేట్స్ కన్ఫామ్ చేస్తే, జూన్ లో ఈ ఈవెంట్ సంబంధించిన ఎనౌన్స్ మెంట్ రావొచ్చు.. ఇక పారిస్ లో జరిగే వారణాసి ప్రమోషనల్ ఈవెంట్ లో కూడా ఈ విషయం సంబంధించిన హింట్ బయటికొచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. మొత్తానికి హాలీవుడ్ మూవీ అవతార్ డైరెక్టర్ చేతుల మీదుగా వారణాసి ప్రోమోని లాంచ్ చేస్తే, దానికి వరల్డ్ వైడ్ గా పెరిగే రీచే వేరు.. అదే ఇప్పటికి నిజం అయ్యేలా కనిపిస్తోంది.

Published : 
  • 14 May 2026, 5:50 PM IST