జస్ట్ ఇమాజిన్ సూపర్ స్టార్ మహేవ్ బాబు, ప్రియాంక చోప్రా ఇద్దరూ కలిసి రాజమౌలితో పాటు, అవతార్ సెట్లో కనిపిస్తే ఎలా ఉంటుంది... అంటే ఎప్పడో తీసిన అవతార్ కోసం వాడిన సెట్లో కాదు, ఇప్పుడు తీయబోతున్న నాలుగో అవతార్ మూవీ సెట్లో మహేశ్ బాబు, రాజమౌళి అండ్ కో ఉంటే ఏంటి పరిస్థితి... అదే జరిగేలా ఉంది. నిజంగా అవతార్ దర్శకుడు జేమ్స్ కామెరున్ తో పాటు టోటల్ టీం మన వారణాసి కోసం ముందుకొస్తే అదేదో అద్భుతం జరిగినట్టే.. ఏదో హాలీవుడ్ దర్శకుడితో రాజమౌైళికి మొదలైన స్నేహం వల్ల, ఇప్పుడు వారణాసి వరల్డ్ వైడ్ ప్రమోషన్ కి ఉపయోగ పడుతుందనుకుంటుంటే, ఇప్పుడు అంతకు మించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓరకంగా ఇది జేమ్స్ కామేరున్ నుంచి వచ్చిన ఆఫరే అనంటున్నారు.. ఇంతకి వారణాసి టీంమీద జేమ్స్ కామెరున్ వరాల జల్లు వెనకున్న మార్కెటింగ్ స్ట్రాటజీ ఏంటి? ఇదెంతవరకు సూపర్ స్టార్ ని గ్లోబల్ సూపర్ స్టార్ గా మారేలా కారణమౌతోంది?
సూపర్ స్టార్ మహేశ్ బాబు బర్త్ డే ఆగస్ట్ 9.. అంటే ఇంకా రెండున్నరనెలల పైనే టైం ఉంది. కాని ఈలోపే ఒకటి కాదు రెండు బాంబులు పేలేలా ఉన్నాయి. అందులో ఒకటి ఆగస్ట్ 15 కి అనుకున్న వారణాసి టీజర్ ని వారం ముందుగా, సూపర్ స్టార్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేయబోతున్నారట. ఆ విషయాన్ని హాలీవుడ్ మూవీ అవతార్ 4 సెట్లో ప్రకటించే ప్రయత్నం చేస్తున్నారట.. ఇదే ప్రజెంట్ రాజమౌళి ప్లానింగ్ అని తెలుస్తోంది.హాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ జేమ్స్ కామెరున్ అంటే, టైటానిక్, టర్మినేటర్, అవతార్ లాంటి క్లాసిక్స్ గుర్తొస్తాయి.. మన దేశంలో రాజమౌళి మేకింగ్ కి ఎలాగైతే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో, వరల్డ్ వైడ్ గా ఈ హాలీవుడ్ డైరెక్టర్ క్రియేషన్ అంటే, అంతకంటే మాస్ ఫాలోయింగ్ ఉంది. హాలీవుడ్ లెవల్లో లార్జర్ దేన్ లైఫ్ అనిపించే మూవీలు, సూపర్ మాస్ మూవీలు తీసిందంటే జేమ్స్ కామెరునే.
అలాంటి డైరెక్టర్ త్రిబుల్ ఆర్ కి ఫిదా అయ్యి రాజమౌళికి ఫ్రెండ్ గా మారాడు. అది వారణాసి ప్రమోషన్ కి పనికొచ్చేలా ఉందని, వారణాసి గ్లింప్స్ ని తన చేతుల మీదుగా లాంచ్ చేయబోయారు. కాని అవతార్ 3 రిజల్ట్ రివర్స్ అవటంతో, జేమ్స్ కామెరున్ లోప్రొఫైల్ మేయింటేన్ చేస్తున్నాడు. ప్రజెంట్ అవతార్ 4 , అవతార్ 5 ని ముందనుకున్న బడ్జెట్ కంటే సగం బడ్జెట్ లోనే తీయబోతున్నామని తేల్చాడు.దీనికి వారణాసి మూవీకి లింకుంది.. ఎందుకంటే వారణాసి సినిమా గ్లింప్స్ కాన్సెప్ట్ ఆల్రెడీ భారీ ఈవెంట్ తో లాంచ్ చేశారు. ఇక ఆగస్ట్ 15న ఇండిపెండెన్స్ డే స్పెషల్ గా వారణాసి టీజర్ లాంచ్ చేయాలనుకుంటున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. కాని ఇప్పుడు ఆ ప్లానింగ్ వన్ వీక్ ముందుకి ప్రీ పోన్ అయ్యింది అంటే, మహేశ్ బాబు బర్త్ డే సందర్భంగా వారణాసీ టీజర్ లాంచ్ చేయాలనే ఆలోచనని , రాజమౌళి ఆల్ మోస్ట్ కన్పామ్ చేశాడని తెలుస్తోంది.
ఇదే విషయం అవతార్ 4 మూవీ సెట్లో ఎనౌన్స్ చేయాలని, వినూత్నమైన ప్లాన్ చేసింది ఫిల్మ్ టీం. 2029 లో అవతార్ నాలుగో సీక్వెల్ రిలీజ్ అవ్వాలంటే, ఆగస్ట్ 1 నుంచి షూటింగ్ మొదలు పెట్టాల్సిందే అని వేగం పెంచాడు జేమ్స్ కామెరున్. అయితే ఆగస్ట్ ఫస్ట్ వీక్ లో యూఎస్ లో వారణాసి తాలూకు ఒక షెడ్యూల్ ఉందని తెలుస్తోంది. అదే ఆల్ మోస్ట్ ఫైనల్ షెడ్యూల్ అని కూడా సమాచారం అందుతోంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, అవతార్ 4 సెట్లు, హాలీవుడ్ నటీ నటుల మధ్య, వారణాసి టీజర్ లాంచ్ తాలూకు ఎనౌన్స్ మెంట్ వస్తే, అమెరికా, యూరప్ లో వారణాసి ప్రమోషన్ సెన్సేషన్ అవుతుంది. ఇక ఆగస్ట్ 9న అమెరికాలోనే జేమ్స్ కామెనున్ చేతుల మీదుగా వారణాసి టీజర్ లాంచ్ అయితే, వరల్డ్ మీడియాలో వారణాసి రీచ్ పెరుగుతుంది. అందుకే ఆగస్ట్ లో రెండు షాక్ వేవ్ లు క్రియేట్ చేసేందుకు రాజమౌళి టీం సిద్ధమైనట్టే కనిపిస్తోంది. ఇదే ఇండస్ట్రీలో ఊపు పెంచేస్తోంది.