Top story: వృధాగా పోయిన 19 రోజులు…. ఆవిరి అయిపోయిన 225 కోట్లు….. పార్లమెంట్ సమావేశాలు ఏం సాధించాయి?

19 రోజులు, 225 కోట్ల రూపాయలు బూడిదలో పోసిన పన్నీరు లా వృధా అయిపోయాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఒక్కరోజు కూడా సజావుగా సాగకుండానే ముగి సాయి. వెయ్యి రూపాయలు ఎవడైనా జోబు కొట్టేస్తే ఆరు నెలలు జైలు శిక్ష వేస్తాయి కోర్టులు

Post Published By: dialnews
Updated : 14 August 2026, 11:43 AM IST

19 రోజులు, 225 కోట్ల రూపాయలు బూడిదలో పోసిన పన్నీరు లా వృధా అయిపోయాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఒక్కరోజు కూడా సజావుగా సాగకుండానే ముగి సాయి. వెయ్యి రూపాయలు ఎవడైనా జోబు కొట్టేస్తే ఆరు నెలలు జైలు శిక్ష వేస్తాయి కోర్టులు. కానీ ఎంపీలు అందరూ కలిసి 19 రోజుల్లో పార్లమెంటు సమావేశాలు నిర్వహించకుండా 225 కోట్ల రూపాయలు వృధా చేశారు. ఈ వర్షాకాల సమావేశాలు పూర్తిగా “నీట్ ప్రశ్నాపత్రాల లీక్—విద్యార్ధులు, యవత ఆందోళనలు, భద్రతదళాల హింసాత్మక దాడులు” కేంద్రం గా నిస్సత్తుగా ముగిశాయి.పార్లమెంట్ లోపల, వెలుపల నిరసనలు, నినాదాలతో విపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీశాయు. చివరి రోజు వరకు ఆందోళనలు కొనసాగించాయు. దీనికి ప్రతిగా అధికార కూటమి సభ్యులు కూడా పోటీగా నిరసన ప్రదర్శన లు చేశాయి. విపక్షాల నిరసనలు 19 రోజుల పాటుకొనసాగాయి. విపక్షాల నిరసనలను, డిమాండ్లను లెక్క చేయకుండా ప్రభుత్వం మాత్రం తన అజెండా ను పూర్తి చేసుకుంది. పలు బిల్లులను ఆమోదింప చేసుకుంది. మొత్తంగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు అరుపులు, కేకలు, నినాదాలు, నిరసనలతో ముగిశాయు.

“పబ్లిక్ పరీక్ష సవరణ బిల్లు” పై చర్చ సందర్భంగా హోమ్ మంత్రి అమిత్ షా యే విద్యార్ధుల పై దాడి కి కారణమంటూ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు, ప్రభుత్వం అభ్యంతరాలు, విపక్షాల నిరసనలతో ఉభయ సభలు వరుస వాయుదాలతో
సజావుగా సాగలేదు. విపక్షాలు, ప్రభుత్వం ఒకరిపై మరొకరు నిందలు, విమర్శలు, ప్రతివిమర్శలతో పరిస్థితి జటిలంగా మారింది. జూలై 20 న ఆందోళన చేస్తున్న విద్యార్ధు లపై రాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఢిల్లీ పోలీసుల చేసిన హింసాత్మక దాడికి కారకులు ఎవరో స్పష్టం చేయాలని, హోమ్ మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ తో సహా, “ఇండియా” కూటమి పక్షాలన్నీ ప్రభుత్వాన్ని నిలదీశాయు.

సభకు, చర్చకు రాకుండా పారిపోతున్నానని విమర్శించడం సరైందికాదని చర్చకు తాను సిద్దంగా ఉన్నానని, విపక్షాలు సహకరించాలని హోమ్ మంత్రి అమిత్ షా ప్రతిపాదించారు, ప్రభుత్వం పై మరింత వత్తిడి తెచ్చేలా ప్రతిపక్ష “ఇండియా” కూటమి పక్షాలు నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. పార్లమెంట్ భవన ప్రాంగణంలో వెలుపల, ఉభయసభల లోపలవిపక్షాల నిరసనలు కొనసాగాయి. ప్రతిగా, అధికార “ఎన్.డి.ఏ”కూటమి పక్షాల ఎమ్.పిలు కూడా విపక్షాలకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీనిర్వహించాయి. పోటాపోటీగా అధికార, విపక్షాలు నినాదాలు, పరస్పర విమర్శలు చేసుకున్నాయు. వరుస వాయుదాలతో ఉభయ సభలు సజావుగా సాగలేదు. ఏలాంటి అర్ధవంతమైన చర్చలు లేకుండానే మొత్తం 12 బిల్లులు ఆమోదం పొందాయి.

చివరి రోజు అమిత్ షా లోకసభ కు వచ్చీరాగానే, వందే మాతరం గీతాలాపన ప్రారంభం కావడం, నిరవధిక వాయుదా వేయడం తో పార్లమెంట్ సమావేశాలు ముగిశాయి.. ఈ సమావేశాల్లోనే మహిళా రిజర్వేషన్. డీలిమిటేషన్ బిల్లులు ఆమోదం పొందేలా చేయాలని కేంద్రం వేసుకున్న అంచనాలన్నీ తలకిందులయ్యాయి. ఒకరకంగా చెప్పాలంటే 19 రోజుల పార్లమెంటు సమావేశాల్లో ప్రతిపక్షం పూర్తిగా అధికార పక్షాన్ని డామినేట్ చేసింది.పార్లమెంట్ సమావేశాలకు ప్రతి రోజుకు అయ్యే ఖర్చు 9 కోట్ల రూపాయలు. ప్రతి నిముషానికి అయ్యే ఖర్చు రెండున్నర లక్షల రూపాయలు. ప్రతి గంటకు అయ్యే ఖర్చు కోటిన్నర రూపాయలు. మొత్తంగా కలిపి 19 రోజులకు 225 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇది అంతా జనం సొమ్ము. జనం పనులుగా కడుతున్న సొమ్ము. కానీ తమ వ్యక్తిగత అజెండాల కోసం నాయకులు పార్లమెంట్ సాక్షిగా 225 కోట్ల రూపాయలు వృధా చేశారు. ఇంతకన్నా ప్రజాస్వామ్యంలో దారుణం ఏముంటది.?అందుకు బాధ్యత వహించాల్సింది ప్రభుత్వంతో పాటు, విపక్షాలు కూడా…పార్లమెంట్ లో ప్రాతినిద్యం వహించే పార్టీలన్నీ కూడా ఈ విషయం ఆలోచించాలి.

 

 

Published : 
  • 14 August 2026, 11:43 AM IST