ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు.. బంగారం కోసం జనం పరుగులు…!

బంగారం ధరలు రోజుకో క్రియేట్‌ చేస్తున్నాయ్. అందనంత ఎత్తా.. తారా తీరం అనే రేంజ్‌లో పెరిగిపోతున్నాయ్‌. అప్పుడప్పుడు కాస్త తగ్గుతున్నా.. తగ్గేది గోరంతా..పెరిగేది కొండంత అన్నట్లు కనకం రికార్డులు సృష్టిస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 31, 2026 | 09:41 AMLast Updated on: Jan 31, 2026 | 9:41 AM

If Not Now Then When People Are Rushing To Buy Gold

బంగారం ధరలు రోజుకో క్రియేట్‌ చేస్తున్నాయ్. అందనంత ఎత్తా.. తారా తీరం అనే రేంజ్‌లో పెరిగిపోతున్నాయ్‌. అప్పుడప్పుడు కాస్త తగ్గుతున్నా.. తగ్గేది గోరంతా..పెరిగేది కొండంత అన్నట్లు కనకం రికార్డులు సృష్టిస్తోంది. ఎంత పెరిగినా.. ఎక్కడికి పెరిగినా.. అసలు తగ్గేదే లే అన్నట్లుగా జనం తీరు కనిపిస్తోంది. ఇప్పటికీ.. ఒకప్పటిని కంపేర్ చేస్తూ.. ఇప్పటికే ఆలస్యం చేశాయం.. ఇప్పటికైనా కొనకపోతే నష్టపోతాం.. మంచి తరుణం మించిన దొరకదు అంటూ బంగారం దుకాణాలకు పరుగులు పెడుతున్నారు. సామాన్య, మధ్య తరగతిని పక్కనపెడితే… ఎప్పటికప్పుడు పెట్టుబడి సాధనాలపై కన్నేసి ఉంచే వారంతా బంగారం వెంట పడుతున్నారు.

దుకాణాల ముందు క్యూల్లో నిలబడి, రెండుమూడు గంటలు వెయిట్‌ చేసి మరీ గోల్డ్ కొనుగోలు చేస్తున్నారు. ఇంట్లో అప్పటికే ఉన్న పాత బంగారాన్ని బ్యాంకులో కుదువ పెట్టి.. ఆ డబ్బుతో కొత్తగా బంగారం కొంటున్న వాళ్లు మరికొందరు. ఇదేదో బాంబేలో మాత్రం ఇలాంటి పరిస్థితి ఉంది అనుకుంటే పొరపాటే. సెకండ్ బాంబేగా పేరు ఉన్న కడప జిల్లా ప్రొద్దుటూరుతో పాటు.. మన హైదరాబాద్‌లోనూ ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. రెండు మూడు నెలలుగా బంగారు, వెండి ధరలు పరుగులు తీస్తున్నాయ్‌. ఇంతకంటే పెరగదు అనుకున్న ప్రతీసారి.. మనం రాంగ్ అని ప్రూవ్ చేస్తున్న బంగారం.. ప్రతీరోజూ మరింత పైకి ఎగబాకుతోంది. దీంతో అప్పుడే కొని ఉంటే బాగుండేదని అనుకునే వాళ్ల సంఖ్య భారీగా పెరిగింది.

గత పది రోజుల్లో 10 గ్రాముల బంగారం ధర 30వేలకు పైగా పెరిగింది. కిలో వెండి ధర 70వేలకు పైగా పెరిగింది. తులం బంగారం రెండున్నర లక్షలు.. కిలో వెండి 5 లక్షలు దాటుతుందనే ఊహాగానాలు కంటిన్యూ అవుతున్నాయ్. దీంతో ఈ ట్రెండ్‌ను ఇప్పుడైనా క్యాష్‌ చేసుకుందాం అని జనాలు ఫిక్స్ అయ్యారు. ఎలా అయినా సరే బంగారం కొని తీరాల్సిందే అని డిసైడ్ అయ్యారు. చేతిలో డబ్బు లేకుంటే ఇంట్లో ఉన్న నగలను బ్యాంకుల్లో తనఖా పెట్టి మరీ.. వచ్చిన డబ్బుతో బంగారం, వెండి కొనేస్తున్నారు.

మూడు వారాలుగా బ్యాంకుల్లో గోల్డ్‌ లోన్స్‌ సంఖ్య భారీగా పెరిగాయంటే అర్థం చేసుకోవచ్చు… ఈ ట్రెండ్‌ ఎలా ఉందని ! గతంలో రియల్‌ రంగంలో పెట్టుబడి పెట్టే వారు కూడా ప్రస్తుతం బంగారం, వెండివైపు మారిపోయారు. ఇల్లు కట్టి ఏడాదికో, ఏడాదిన్నరకో అమ్మితే 10 నుంచి 15 లక్షలు మిగిలితే ఎక్కువ. బంగారం, వెండితో రోజుల్లోనే అంత లాభం వస్తోందని అంటున్నారు కొందరు రియల్టర్లు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. ఐతే అందులో పెట్టుబడి కోసం దాచుకున్న నగదునూ బంగారు, వెండి కొనుగోలుకు వాడుతున్నారు ఇంకొందరు.