రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత నిలబడటం అంత ఈజీ కాదు. ఈ విషయం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు పిచ్చ క్లారిటీ ఉంది. 2014లో పార్టీ పెట్టిన తర్వాత.. పదవిలో కూర్చోవడానికి 10 ఏళ్ళు పట్టింది. ఈ పదేళ్లు పవన్ పడిన కష్టాలు అన్ని ఇన్ని కాదు. 2024 ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. పవన్ రేంజ్ మారిపోయింది. సీట్లు తక్కువైనా సరే.. పవన్ కు స్టేట్ లో, సెంటర్ లో దక్కాల్సిన రెస్పెక్ట్ టన్నుల్లో దక్కుతోంది. పవన్ కు అప్పగించాల్సిన బాధ్యతలను బిజెపి సైలెంట్ గా ఒక్కొక్కటి అప్పగిస్తూ వస్తుంది.
ఇప్పుడు పవన్ చేతిలో మరో రెస్పాన్సిబిలిటీ పెట్టింది బిజెపి. అదే తమిళనాడులో కొత్తగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన హీరో విజయ్ ను.. ఎన్డీఏ కూటమిలోకి తీసుకురావడం. పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత విజయ్ కూడా పవన్ మాదిరిగానే వరుసగా ఎదురు దెబ్బలు తింటున్నారు. ఒక షాక్ తర్వాత మరొక షాక్ తగులుతోంది. ఇందులో చాలా పెద్దది.. కరూర్ తొక్కిసలాట ఘటన. ఈ ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. విదేశాల్లో అయితే ఒక రాజకీయ నాయకుడు దీనికి కారణం అయితే.. సిచువేషన్ మరోరకంగా ఉండేది.
కానీ మనదేశంలో మాత్రం ఈ విషయంలో, రాజకీయాలు ఎక్కువగా జరుగుతున్నాయి అనే విమర్శలు కూడా ఉన్నాయి. ఇలాంటి టైంలో విజయ్ ను సిబిఐ విచారిస్తోంది. ఈ కేసు ను సీరియస్ గా తీసుకున్న.. సిబిఐ అధికారులు.. ఇప్పటికే పలుమార్లు విజయ్ ను ఢిల్లీ పిలిచారు. ఇప్పుడు మరోసారి ఢిల్లీ రావాలని, లెటర్ వచ్చింది. కానీ ఈసారి ఢిల్లీ టూర్ మాత్రం విజయ్ కు కాస్త స్పెషల్. ఇది కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉండే ఛాన్స్ తో పాటు.. పాజిబుల్ అయితే.. వచ్చే అనౌన్స్మెంట్ కూడా తమిళ రాజకీయాలను షేక్ చేసే విధంగా ఉండే ఛాన్స్ కనబడుతోంది.
ఇప్పుడు వస్తున్న న్యూస్ ప్రకారం విజయ్ ను, ఎన్డీఏలోకి తీసుకురావడానికి, పవన్ ను రంగంలోకి దించింది బిజెపి. సైలెంట్ గా విజయ్ తో.. దాదాపు నెల రోజుల నుంచి పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నట్లుగా న్యూస్ వైరల్ గా మారింది. బిజెపి నుంచి విజయ్ కు.. ఇవ్వాల్సిన ఆఫర్లు అన్నీ పవన్ రూపంలో ఇచ్చినట్లు సమాచారం. 2024 లో ఆంధ్రప్రదేశ్ ఫార్ములాను.. తమిళనాడులో అమలు చేసేందుకు బిజెపి, గ్రాండ్ ప్లాన్ చేసినట్లు పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ భీభత్సంగా నడుస్తోంది. అన్నాడిఎంకే, బీజేపీ కలిపి పోటీ చేస్తాయి. అంటే తెలుగుదేశం.. బిజెపి పోటీ చేసినట్లు.
ఈ రెండు పార్టీలతో కలిసి జనసేన మాదిరిగా.. విజయ్ నేతృత్వంలోని, టీవీకే కూడా జాయిన్ అవుతుంది. విజయ్ బలం పవన్ కంటే కాస్త ఎక్కువ. కాబట్టి ఆయనకు ఒక 35 నుంచి 40 సీట్లు ఇచ్చే విధంగా ఒప్పందం జరిగినట్లు సమాచారం. కానీ విజయ్ మాత్రం 234 స్థానాల్లో, పోటీ చేస్తాననే మాట మీద ఉన్నాడట. ఈ విషయంలో ఆయనను.. పవన్ కళ్యాణ్ ఒప్పించే ప్రయత్నం చేసినా విజయ్ మాత్రం కాస్త బెట్టు చేస్తున్నట్లు సమాచారం. ఇక విజయ్ మంగళవారం ఢిల్లీ వెళ్తున్నారు. కాబట్టి అక్కడ సిబిఐ విచారణ తర్వాత దీనిపై కీలక వ్యక్తులతో చర్చలు జరిగే అవకాశం ఉండవచ్చని వార్తలు వస్తున్నాయి.
ముఖ్యంగా విజయ్ కు.. ఉన్న క్రిస్టియన్ ఓటు బ్యాంకు, కూటమి వైపు తిరగాలి అంటే.. టీవీకే, ఎన్డీఏలో జాయిన్ కావాల్సిందే. హిందుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకుతో పాటుగా, ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకులో కొంత విజయ్ లాక్కుంటే, అన్నాడిఎంకే నష్టపోతుంది. బిజెపిని ఇష్టపడని.. తమిళనాడులోని ఓ వర్గం ప్రజలు.. ఆ పార్టీ కారణంగా ఎక్కువగా డిఎంకె వైఫై ఉన్నారు అనే మాట కూడా ఉంది. అందుకే ఇప్పుడు విజయ్ కనుక, కూటమిలో చేరితే రిజల్ట్ బాగుంటుందని బిజెపి అంచనా వేస్తుంది.
కొంగునాడు జిల్లాలో అన్నాడిఎంకే గత ఎన్నికల్లో ప్రభావం చూపించింది. ఈసారి మాత్రం అక్కడ కాస్త డిఫరెంట్ వాతావరణం కనబడుతోంది. అందుకే విజయ్ రూపంలో తమకు మద్దతు లభిస్తే, అది చెన్నైతోపాటుగా కోయంబత్తూర్.. జిల్లాల్లో కూడా ప్లస్ అవుతుందని బిజెపి లెక్క. కోయంబత్తూర్ పరిసర ప్రాంతాల్లో, కమలహాసన్ పార్టీకి కాస్త బలం ఉంది. ఆయనకు డీఎంకే రాజ్యసభ ఇచ్చి కూర్చోబెట్టింది. అందుకే అక్కడ విజయ్ సహకారం ఉంటే బాగుంటుందనే భావనలో బిజెపి ఉంది. అలాగే రెండవ రాజధానిగా భావించే, మధురై చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా విజయ్ కు ఫాలోయింగ్ ఎక్కువ.
అక్కడ విజయ్ ఒంటరిగా పోటీ చేస్తే, ఎన్డియే కూటమి, నష్టపోయే ఛాన్స్ ఉంది. అందుకనే విజయ్ ను, ఎలాగైనా సరే ఒప్పించాలని, అధికారంలోకి వస్తే ఉప ముఖ్యమంత్రి పదవితో పాటుగా.. కీలక శాఖలు ఆయనకు ఇవ్వాలని బిజెపి ప్లాన్ చేసినట్లు సమాచారం. అందుకే ఆ పదవులను ఏపీ గవర్నమెంట్ లో నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ ను, పంపి ఒప్పుకుంటే బాగుంటుందని బిజెపి సున్నితంగా కోరుతున్నట్లు సమాచారం. పవన్ కంటే విజయ్ కాస్త డిఫరెంట్ క్యారెక్టర్. అంత ఈజీగా ఒప్పుకునే రకం కూడా కాదు అంటూ ఉంటారు. యువ నాయకుడు కాబట్టి భవిష్యత్తులో.. విజయ్ కి ఇబ్బందులు కూడా ఉండకుండా పార్టీ నిర్మాణాన్ని చేపట్టేందుకు అవకాశం ఉంటుంది.
కొంతమంది అన్నాడిఎంకే నాయకులు.. కూడా పదేపదే ఇదే మాట చెబుతున్నారు. విజయ్ మాతో కలిసి వస్తే విజయ్ పార్టీకి కావాల్సిన గ్రౌండ్ లెవెల్ బలాన్ని తాము ఇస్తామని చెబుతున్నారు. తొక్కిసలాట ఘటన తర్వాత రాష్ట్రప్రభుత్వం.. విజయ్ ని టార్గెట్ చేసిన సమయంలో, అన్నాడిఎంకే నాయకులు అండగా నిలబడ్డారు. అందుకే ఇలాంటి టైంలో విజయ్ ని, ఎలాగైనా సరే ఒప్పించేందుకు బిజెపి చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేస్తోంది. తమిళనాడులో అధికారంలోకి వస్తే సౌత్ లో తిరుగు ఉండదు అనే ఫీలింగ్ లో కూడా బిజెపి ఉంది. ఈ రిజల్ట్ 20209 పార్లమెంటు ఎన్నికలకు హెల్ప్ అవుతుంది అనే ఒపీనియన్ కూడా బిజెపిది. మరి పవన్ కళ్యాణ్ ఎంతవరకు బిజెపికి అనుకూలంగా, విజయ్ మైండ్ చేంజ్ చేస్తారో చూడాలి.