ధురంధర్ తర్వాత.. ఇక సునామీనే.. టార్గెట్ ఎవరు…?

ధురందర్ మూవీ 1200 కోట్లురాబట్టాక దాని సీక్వెల్ 2400 కోట్లు రాబడుతుందనే అంచనాలున్నాయి. ఇలాంటి టైంలో ఉరి తర్వాత ధురందర్ తీస్తేనే ఇంతటి అరాచకం తెరమీద చూపించాడు డైరెక్టర్ ఆధిత్య..

Post Published By: dialnews
Updated : 21 March 2026, 5:30 PM IST

ధురందర్ మూవీ 1200 కోట్లురాబట్టాక దాని సీక్వెల్ 2400 కోట్లు రాబడుతుందనే అంచనాలున్నాయి. ఇలాంటి టైంలో ఉరి తర్వాత ధురందర్ తీస్తేనే ఇంతటి అరాచకం తెరమీద చూపించాడు డైరెక్టర్ ఆధిత్య.. మరి ధురందర్ సీక్వెల్ ధురందర్ రివీంజ్ తర్వాత తను సినిమా తీస్తే అది ఇంకెలా ఉంటుంది... ఈ ప్రశ్నకు సమాధానం, ఎన్టీఆర్ లేదంటే రెబల్ స్టార్ ప్రభాస్ దగ్గరే ఉండొచ్చు... ఎందుకంటే ఎన్టీఆర్, పెట్టిన పోస్ట్ కి ఆదిత్య ధర్ రిప్లై అదిరింది.. థ్యాంక్స్ తో సరిపెట్టలేదు తను.. అంతేకాకుండా గతంలో ఇద్దరు కలుసుకున్న విషయాన్ని గుర్తు చేశాడు. ప్రభాస్ కి కూడా ఆదిత్య ధర్ 5 నెల్ల క్రితం కథ చెప్పాడని తెలుస్తోంది. అంటే ధురందర్ 2 తర్వాత అంతకు మించి అరాచకం చేయాంటే, టాలీవుడ్ హీరోలే సరైనోళ్లా..? ఆదిత్య ధర్ మనసులో ఎందుకు మన పాన్ ఇండియా మొనగాళ్లున్నారు?

ధురందర్ 2 వచ్చి రాగానే 190 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టింది. నిజానికి ఈ హీందీ మూవీ ఇలా దూసుకుపోవటం చూసి, పుష్ప2, బాహుబలి 2 రికార్డులను ఎక్కడ బ్రేక్ చేస్తుందో అన్న కంగారు టాలీవుడ్ స్టార్స్ లో కనిపించాలి. కాని ఇందుకు రివర్స్ లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పండగ చేసుకుంటున్నాడు. దర్శకుడినిఆకాశానికెత్తుతున్నాడు. సూపర్ స్టార్ మహేవ్ బాబు కూడా ధురందర్ 2 ని తెగ మెచ్చుకుంటే, బన్నీ దర్శకుడికి హ్యాట్సప్ చెప్పేశాడు.ఇదే విచిత్రంగా అనిపించొచ్చు.. ఆ దర్శకుడికి వీల్లంతా కర్ఛీఫ్ వేస్తున్నారనో, బిస్కెట్ వేస్తున్నారనో కామెంట్లు పేలుతుండొచ్చు.. కాని ఇక్కడ ఎన్టీఆర్, ప్రభాస్ విషయంలో మాత్రం ధురందర్ దర్శకుడికి ఏదో కనెక్షన్ సెన్సేషన్ అయ్యేలా ఉంది. ధురందర్ ఆడిందని, ధురందర్ 2 దుమ్ముదులుపుతోందని ఎన్టీఆర్ ఇలా ఆ దర్శకుడిని పొగడటం లేదు..

అసలు మొదటి పార్ట్ ధురందర్ రాకుముందే ఎన్టీఆర్ ని గోవాలో ఈ సినిమా దర్శకుడు ఆదిత్య ధర్ కలిశాడు. కాని అంతా లైట్ తీసుకున్నారు. ప్రభాస్ కూడా ఓం రౌత్ తర్వాత మళ్లీ హిందీ దర్శకులతో కలిసి పనిచేయడన్నారు. ఆతర్వాతే హిందీ దర్శకుడికోసం డేట్లు బల్క్ గా ఇచ్చేలా ఉన్నాడన్న వార్తలొచ్చాయి.. ఇప్పుడు ఆ దర్శకుడు ఎవరో కాదు ఆదిత్య ధరే అంటున్నారు.ఇటు ఎన్టీఆర్, అటు ప్రభాస్ ఈ ఇద్దరితో సినిమా తీసేందుకు ఆదిత్య ధరే తహతహలాడుతున్నాడట. మాస్ లో వాల్లకున్న పట్టే కాదు, పాన్ ఇండియా లెవల్లో తన మూవీ ముందుకెళ్లేందుకు వీల్లే సరైనోళ్లు అనుకుంటున్నాడో లేదంటే, తను కథ రాసినప్పుడే వాల్లని ఊహించుకున్నాడో... మొత్తానికి ఎన్టీఆర్,ప్రభాస్ ఈ ఇద్దరికి ఎప్పుడో డైరెక్టర్ ఆదిథ్య ధర్ కనెక్ట్ అయ్యాడు..

కథ చెప్పి కాంబినేషన్ విషయంలో ప్లాన్ చేస్తున్నాడు.. అందుకే తనకి ఆల్రెడీ కనెక్ట్ అయిన దర్శకుడికి రెండు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్లు రావటంతో, తనతో మూవీకి ఎన్టీఆర్ ఓకే చేయటం సరైన నిర్ణయమే అన్నట్టు తను సంబరపడిపోతున్నాడనే ప్రచారం జరుగుతోంది.. ఉరి తర్వాత ధురందర్ వచ్చే వణికించింది... ఆతర్వాత అంతకుమించిన వయోలెన్స్ తో ధురందర్ 2 పిచ్చెక్కించింది. ఈ లెక్కన ఆతర్వాత ఆదిత్య ధర్ తీసే సినిమా ఇంకెంత సునామీ క్రియేట్ చేయొచ్చు..? అలాంటి మూవీకి బాలీవుడ్ స్టార్స్ ని కాదని ఎన్టీఆర్, ప్రభాస్ లన ఈ దర్శకుడు ఎంచుకుంటున్నానే వార్త వైరలౌతోంది.. లెక్కే మారేలా ఉంది.

Published : 
  • 21 March 2026, 5:30 PM IST